Breaking News

Daily Archives: December 9, 2025

రెవెన్యూ సేవలు మరింత సులభతరం

-రియల్‌టైమ్‌లో పట్టాదారు పాస్ పుస్తకాల ఆటో మ్యుటేషన్ -2027 డిసెంబర్ నాటికి భూముల రీసర్వే పూర్తి కావాలి -రెవెన్యూ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రెవెన్యూ సేవలు మరింత సులభతరం కావాలని, చిక్కుముడులు లేకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాలు సహా అన్నింటా రియల్ టైమ్‌లో ఆటో మ్యుటేషన్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆటోమ్యూటేషన్ జరిగేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని …

Read More »

అపరిశుభ్రతే అసలు జబ్బు…ప్రజల్లో చైతన్యం పెంచాలి

-స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ -ప్రభుత్వ చర్యలతో 48 శాతం తగ్గిన అంటువ్యాధులు -డెంగ్యూ 56 శాతం, మలేరియా 11 శాతం, చికున్ గున్యా 46 శాతం తగ్గుదల -సీజనల్ వ్యాధులను పూర్తిగా కట్టడి చేయాలి -వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనం చేసేందుకు, భవిష్యత్‌లో దీన్ని పూర్తిగా నివారించేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేశించారు. సచివాలయంలో వైద్యారోగ్య …

Read More »

పూర్వోదయ పథకంతో ఏపీకి ఉషోదయం

-మూడు ప్రాంత్రాల సమగ్ర అభివృద్ధికి కార్యాచరణ -సీమలో 20 లక్షల ఎకరాల్లో ఉద్యాన సాగులక్ష్యం -సాగునీరు, మౌలిక వసతుల ప్రాజెక్టులకూ నిధుల వినియోగం -పూర్వోదయ పథకం ప్రతిపాదనలపై సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి వచ్చే నిధులతో మూడు ప్రాంతాల అభివృద్ధికి సత్వరం ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ నిధులు సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యానపంటల విస్తరణ, గ్రామీణ రహదారులు వంటి మౌలిక వసతుల కల్పనకు వినియోగించేలా ప్రణాళికలు …

Read More »

11 నూతన ఔషధ పరిపాలనా భవనాలు ప్రారంభం

-వీటిలో క‌ర్నూలు, విశాఖ‌కు అనుబంధంగా ప్రాంతీయ ప్ర‌యోగ శాల‌లు -రూ.11.12 కోట్లతో నిర్మించిన వీటిని వర్చువల్ గా ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ -మరో 3 నెలల్లో స్టేట్ ల్యాబ్ వినియోగంలోకి తెచ్చేలా చర్యలు -తద్వారా 13,000 చేరుకోనున్న మందుల నాణ్యతా పరీక్షలు -త్వరలో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రూ.11.12 కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మించిన 11 ఔషధ ప‌రిపాల‌నా భ‌వనాలు, టెస్టింగ్ ల్యాబ్‌ల‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి …

Read More »

భూ వివాద రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

-రెవెన్యూ సమస్యలన్నీ ఏడాదిలోగా జాయింట్ కలెక్టర్లు పరిష్కరించాలి -2027 జనవరి నాటికి రీసర్వే 2.0 పూర్తి -ఇక నుండి ఆలస్యం లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ -పట్ణణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆటో మ్యూటేషన్ -రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖామాత్యులు అనగాని సత్య ప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎటు వంటి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రపందేశ్ ను తీర్చిదిద్దేంకు అవసరమైన అన్ని చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టినట్లు రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖామాత్యులు అనగాని …

Read More »

గోదావరి డెల్టాకు పూర్వవైభవం.

• ఉభయగోదావరి జిల్లాల ముంపు నివారణకు లైడార్ సర్వే. • జగన్ హాయాంలో గోదారి డెల్టాకు తీవ్ర నష్టం. • డెల్టా ఆధునీకరణకు చర్యలు. -జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి డెల్టా ముంపు సమస్య పరిష్కరించడంతో పాటు, ఇరిగేషన్ సమస్యలను పరిష్కరించేలా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని, దీని కోసం డెల్టా ప్రాంతంలో లైడార్ సర్వే కోసం రూ.13.4 కోట్ల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. మంగళవారం …

Read More »

మిర్చి పంటలో తెగుళ్లపై అత్యవసర చర్యలు ప్రారంభించండి

– ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి/విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మిర్చి పంటపై విస్తృతంగా కనిపిస్తున్న నల్ల తామర పురుగు దాడిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సీరియస్‌గా స్పందించారు. విజయవాడ క్యాంప్ కార్యాలయం నుండి ఉద్యానవన శాఖ డైరెక్టర్ డా. కే. శ్రీనివాసులతో ఫోన్ ద్వారా మాట్లాడిన మంత్రి, ప్రస్తుత పరిస్థితులపై పూర్తి నివేదికను వెంటనే అందించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని, …

Read More »

ప్రతి జిల్లాలో మాక్ అసెంబ్లీకి చర్యలు

-మంత్రి కందుల దుర్గేష్ -ప్రభుత్వంతో చర్చించి నిర్ణయిస్తామని వెల్లడి -బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేద్దామని పిలుపు -నేటి విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పునాదులని, విద్యార్థుల నడవడికను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నిరంతరం గమనించాలని సూచన -ఆటపాటలతో కూడిన విద్యా విధానంతో పాటు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేసిన మంత్రి దుర్గేష్ -విజయవాడ సిద్ధార్థ కాలేజీలో జరిగిన అమరావతి బాలోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వంతో చర్చించి …

Read More »

నేడు రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సులో పాల్గొననున్న డిప్యూటీ సీఎం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ రాష్ట్రస్థాయిలో ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని మంగళగిరిలో సి.కె.కన్వెన్షన్ లో బుధవారం నిర్వహిస్తుంది. రాష్ట్రంలో ఇటీవల పదోన్నతి పొందిన అభ్యర్థులకు పరిపాలన సామర్థ్యం పెంపుదల, సేవలను అత్యంత వేగంగా అందించుట, నైపుణ్యాలను పెంచుట ఆశయంగా రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ క్రింద నిర్వహిస్తున్నారు. అవగాహన కార్యక్రమం బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు చెందిన జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ …

Read More »

21న పల్స్ పోలియో కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పల్స్ పోలియో కార్యక్రమం ఈ నెల 21వ తేదీన నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమంపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి రెండు పల్స్ పోలియో చుక్కలు పడాల్సిందేనన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఎక్కడ ఎటువంటి …

Read More »