Breaking News

Daily Archives: December 9, 2025

జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్..

-ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలలో భోజనం నాణ్యత పరిశీలన.. కృత్తివెన్ను/బంటుమిల్లి/పెడన, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్ మంగళవారం కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూ ఆహారం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తొలుత ఆయన కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలో రేషన్ షాప్, అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి అనంతరం సంగమూడిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్నం భోజనాన్ని …

Read More »

నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పెనమలూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం పెనమలూరు మండలం ఫోరంకిలోని ద్వారకా కన్వెన్షన్ లో జిల్లా కలెక్టర్ శాసనసభ్యులు బోడే ప్రసాద్ తో కలసి పెనమలూరు నియోజకవర్గ అభివృద్ధి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాలకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా విజన్ యాక్షన్ యూనిట్ …

Read More »

నగరంలో పలు ప్రాంతాల్లో సెంటినల్, ర్యాండమ్ సర్వేలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పలు ప్రాంతాల్లో సెంటినల్, ర్యాండమ్ సర్వేలు జరిగాయి. దానిలో భాగంగా జింఖానా గ్రౌండ్ సబ్ యూనిట్ ఫైవ్ పరిధిలోగల నాలుగు యూపీహెచ్సీలలో గల 28 సచివాలయాల ఏరియాలలో 8, 9 తేదీలలో (రెండు రోజులు) విజయవాడ యు పి హెచ్ సి పరిధిలో హనుమాన్ పేట, రామకోటి మైదానం ఏరియాలలో మరియు బాప్టిస్ట్ పాలెం యు పి హెచ్ సి పరిధిలో కొత్తూరు ఏరియా దేవినగర్ యుపిహెచ్సి పరిధిలో మద్యకట్ట తూర్పు పడమర ఏరియాలలో అయోధ్య నగర్ యూపీహెచ్సీ …

Read More »

డిసెంబర్ 12 నుండి 14 వరకు ఏపీ ఛాంబర్స్ ‘మెగా బిజినెస్ ఎక్స్‌పో – 2025’

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశ్రామిక దిగ్గజాలు, ఎంఎస్ఎంఈ (MSME)లు, స్టార్టప్‌లు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు మరియు సాధారణ ప్రజలను ఒకే వేదికపైకి తెస్తూ, ఏపీ ఛాంబర్స్ (AP Chambers) ప్రతిష్టాత్మక ‘బిజినెస్ ఎక్స్‌పో 2025’ను నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ మెగా ఎక్స్‌పో విజయవాడలోని ఎస్.ఎస్. కన్వెన్షన్ (SS Convention) వేదికగా డిసెంబర్ 12 నుండి 14, 2025 వరకు జరగనుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరగనున్న ఈ బృహత్తర కార్యక్రమంలో వ్యాపార అవకాశాలు, అభివృద్ధి చెందుతున్న నూతన …

Read More »

జిల్లాలో ప్రకృతి వ్యవసాయ అభివృధి, ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్న ప్రతీ రైతు ప్రకృతి వ్యవసాయం చేసేలా అవగాహన కల్పించాలని అంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ సంస్థ ఛైర్మన్ రిటైర్డ్. I.A.S విజయ్ కుమార్, ఈ రోజు జిల్లాలోని ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వై శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ఎన్టీఆర్ లోని APAO ఆఫీస్ విజయవాడ లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏ.పి.సి.ఎన్.ఎఫ్ ఛైర్మన్ రిటైర్డ్. I.A.S విజయ్ కుమార్ …

Read More »

బాల‌ల సంర‌క్ష‌ణ కేంద్రాల‌ను త‌నిఖీ చేయాలి..

– ఆరోగ్య శిబిరాల‌ను కూడా నిర్వ‌హించాలి – జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాలోని 16 బాలల సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేయాల‌ని.. అదేవిధంగా వైద్య శిబిరాలు కూడా నిర్వ‌హించాల‌ని జిల్లా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ ఎస్.ఇల‌క్కియ ఆదేశించారు. మంగ‌ళ‌వారం ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ ఎస్.ఇల‌క్కియ.. క‌లెక్ట‌రేట్‌లో జువైన‌ల్ జస్టిస్ రూల్స్ 41(8) ప్రకారం ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి త‌నిఖీ క‌మిటీ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ నెల 16,17న అన్ని బాలల సంరక్షణ కేంద్రాల్లో త‌నిఖీలు, వైద్య శిబిరాల …

Read More »

వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ (ఏటీఎంఏ) పథకం అమలు వివరాలు కోరిన ఎంపీ గురుమూర్తి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : లోక్‌సభలో ఏటీఎంఏ పథకం అమలు, నిధుల కేటాయింపు, వినియోగం, రైతులకు అందించిన ప్రయోజనాలపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ సమగ్ర వివరాలు వెల్లడించింది. గత మూడు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఏటీఎంఏ కింద రూ. 43.74 కోట్లు కేటాయించగా, రాష్ట్రం అధిక భాగం నిధులను వినియోగించినట్లు కేంద్రం తెలిపింది. తిరుపతి జిల్లాకు ఈ కాలంలో రూ. 7.24 లక్షలు కేటాయించగా, అవన్నీ పూర్తిగా వినియోగించారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శిక్షణా కార్యక్రమాలు, రైతు …

Read More »

తిరుపతి, సాయినగర్ షిరిడి నూతన ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ప్రారంభం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి మరియు సాయినగర్ షిరిడిలను కలుపుతూ భారతీయ రైల్వే శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన ఎక్స్‌ప్రెస్ రైలును నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి. సోమన్న, తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దిల గురుమూర్తి, రాజ్యసభ సభ్యులు, రైల్వే స్టాండింగ్ కమిటీ మెంబర్ మేడా రఘునాథ్ రెడ్డి, న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్య అతిథిగా హాజరై, వర్చువల్‌గా జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా …

Read More »

బస్ షెల్టర్ నిర్మాణానికి తిరుపతి ఎంపీ నిధులు మంజూరు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు ప్రధాన అనుసంధాన కేంద్రంగా ఉన్న కోట క్రాస్ రోడ్ వద్ద బస్ షెల్టర్ నిర్మాణానికి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి రూ.5 లక్షల తన కోటా కింద నిధులు మంజూరు చేశారు. గతంలో రోడ్డు విస్తరణలో భాగంగా బస్ షెల్టర్‌ను తొలగించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. తొలగించిన బస్ షెల్టర్‌ తిరిగి నిర్మించేందుకు చర్యలు తీసుకోకపోవడంతో రోడ్డు మీదే నిలబడి గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సి దుస్థితి, …

Read More »

కమీషనర్ ని కలిసిన నగర పాలక సంస్థ CPS ఉద్యోగులు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2004 లో పించను విధానం ఆగిపోయి cps విధానం అమలు లోకి వచ్చిన నాటి నుండి నగర పాలక సంస్థ నందు నియమితులు అయిన ఉద్యోగులు మంగళవారం ఉదయం కమీషనర్ ధ్యానచంద్ర ను తమ ఛాంబర్లో కలిసి వారికి రావలసిన ఆరియర్ అమౌంట్ గురించి తెలిపి,వినతి పత్రం సమర్పించారు. 2019 నుండి2025 మధ్య కాలం నందు వచ్చిన 8 DA లలోVMC GENERAL FUND నుండి రావలసిన 27 నెలలకు సంబందించిన బకాయి(ARREAR) బిల్లులుCPS మరియుOPS (PF)ఉద్యోగులకి …

Read More »