-రైతుల ఆదాయం పెంపే లక్ష్యం : మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆక్వా రంగం కీలకమైన ఆధారంగా మారిందని, ఆక్వా కల్చర్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవారం కృష్ణా జిల్లా పెనమలూరులోని మత్స్య శాఖ కార్యాలయంలో రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి అధికార సంస్థ పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా …
Read More »Daily Archives: December 16, 2025
పి.బి.సిద్ధార్థలో నాగళ్ళ స్మారక ఉపకార వేతనాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పి.బి. సిద్ధార్థ కళాశాల తెలుగు శాఖాధిపతిగా, ప్రాచార్యులుగా, సిద్ధార్థ కళాపీఠం ప్రధాన కార్యదర్శిగా నాగళ్ళ గురుప్రసాదరావు తెలుగు భాషా సాహిత్యాలకు ఎనలేని సేవలందించారని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి.మునిరత్నం నాయుడు అన్నారు. మంగళవారం విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వెబినార్ హాలులో నాగళ్ళ గురుప్రసాదరావు 2022లో కోటీ 33 లక్షలతో ఏర్పాటుచేసిన ఉపకార వేతన నిధి నుంచి డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి ఫౌండేషన్ 60 మంది విద్యార్థులకు …
Read More »సంక్షేమం.. సంస్కరణల ఆద్యుడు వాజ్‌పేయి
-మచిలీపట్నంలో అటల్ సందేశ్-మోదీ సుపరిపాలన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో అనేక సంస్కరణలు తీసుకురావడంతో పాటుగా, సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేసిన ఘనత అటల్ బీహారీ వాజ్ పేయి అన్న నందమూరి ధ్వయానిదేనని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు మచిలీపట్నంలో నిర్వహించిన అటల్ సందేశ్-మోదీ సుపరిపాలన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు …
Read More »ప్రజలకు వ్యర్ధాల నిర్వహణపై అవగాహన కల్గించడంలో భాగస్వాములు కావాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు మెరుగైన పారిశుధ్యం తద్వారా స్వచ్చమైన వాతావరణం అందించేలా ప్రజారోగ్య విభాగం నుండి ప్రత్యేక కృషి చేస్తున్నామని, మెప్మా రీసోర్స్ పర్సన్స్ (ఆర్పీ) కూడా ప్రజలకు వ్యర్ధాల నిర్వహణపై అవగాహన కల్గించడంలో భాగస్వాములు కావాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం స్థానిక శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రజారోగ్య కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు, మెప్మా ఆర్పీలు, సిఓ, సిఎంఎంలతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, స్వచ్చ గుంటూరు …
Read More »ఇంజినీరింగ్ ఏఈలు, డిఈఈలు, ఈఈలతో సమీక్షా సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టిన సిసి రోడ్లు, డ్రైన్ల నిర్మాణ సమయంలో నిర్దేశిత ప్రమాణాల మేరకు క్యూరింగ్ జరిగేలా ఏఈలు, ఎమినిటి కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ ఏఈలు, డిఈఈలు, ఈఈలతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, సిసి రోడ్లు, డ్రైన్లను ఎంతో ఖర్చుతో నిర్మాణం చేస్తున్నామని, వాటిని నిర్దేశిత …
Read More »ఫ్లెక్సీ బ్యానర్లు ప్రింటింగ్ యజమానులు నిబందనలు పాటించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ డిస్ప్లే డివైసెస్ రూల్స్ – 2025 మేరకు ఫ్లెక్సీ బ్యానర్లు ప్రింటింగ్ యజమానులు నిబందనలు పాటించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో ఫ్లెక్సీ ప్రింటర్స్ తో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యాలయాల గోడలపై, పబ్లిక్ ప్రాంతాల్లో పోస్టర్స్ అంటించడం, బ్యానర్లు నిషేధమని, ఏమైనా బ్యానర్లు ఏర్పాటు చేసుకోవాలంటే …
Read More »అన్నక్యాంటీన్లలో పరిశుభ్రత పాటించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్నక్యాంటీన్లలో పరిశుభ్రత పాటించాలని, ఆహారం సరఫరా అనంతరం శుభ్రం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం అమరావతి రోడ్డులోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో ఆహారం తీసుకునేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని, కొందరు క్యాంటీన్ లోపల స్థలం సరిపోక కాంపౌండ్ లోపల కూర్చొని భోజనం చేస్తున్నందున పరిసరాలను …
Read More »పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో మైక్రో ప్యాకెట్స్ వారీగా ప్రతి సచివాలయం పరిధిలో డ్రైన్ల శుభ్రంపై ప్రజారోగ్య అధికారులు దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం అమరావతి రోడ్, నగరాలు, రెడ్డిపాలెం, నాయడుపేట, విద్యా నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్య కార్మికులు మధ్యాహ్నం సమయంలో తప్పనిసరిగా డ్రైన్లు శుభ్రం చేయాలన్నారు. అమరావతి రోడ్ లోని …
Read More »148 రైతు సేవా కేంద్రాలు ద్వారా 1,50,000 మెట్రిక్ టన్నుల ప్యాడీని ప్రభుత్వం మద్దతు ధర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ (2025–26)లో ఎన్‌టిఆర్ జిల్లాలో మొత్తం 1,50,000 మెట్రిక్ టన్నుల ప్యాడీని ప్రభుత్వం మద్దతు ధర (MSP) వద్ద నేరుగా రైతుల నుండి కొనుగోలు చేయనుంది. ఈ ప్యాడీ కొనుగోలు కార్యక్రమం జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన 148 రైతు సేవా కేంద్రాలు (RSKs) ద్వారా నిర్వహించబడుతోంది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 148 రైతు సేవా కేంద్రాలు అక్టోబర్ 17, 2025 నుండి దశల వారీగా ప్రారంభించబడగా, ఇప్పటివరకు 142 కేంద్రాలు …
Read More »జియోడెటిక్ అసెట్ రిజిస్టర్, రాష్ట్ర జియోడెటిక్ అసెట్ మ్యాప్ ల ఆవిష్కరణ
-కలెక్టరేట్లో ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కచ్చితమైన పటాల (మ్యాపుల) తయారీకి, సర్వేకు జియోడెటిక్ అసెట్ రిజిస్టర్ ఎంతగానో దోహదపడుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. స్థానిక కలెక్టరేట్లో జియోడెటిక్ అసెట్ రిజిస్టర్, రాష్ట్ర జియోడెటిక్ అసెట్ మ్యాప్ లను సర్వే ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల డైరెక్టర్ బీసీ పరిడాతో కలసి జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ…. జియోడెటిక్ అసెట్ రిజిస్టర్ లో …
Read More »
Prajavartha Online Telugu News