-సత్వర న్యాయానికి చర్యలు- రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనవసర వ్యాజ్యాలను తగ్గించడం, ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాన్ని వృద్ధి చేయడం, లోక్ అదాలత్‌లను సంస్థాగతీకరించడం, సకాలంలో ప్రభావవంతమైన వివాద పరిష్కారాన్ని చూపడం, పారదర్శకత, వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్యయం, జవాబుదారీతనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు. ఇందులో భాగంగా “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాజ్య …
Read More »Daily Archives: December 17, 2025
హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
-విజయవాడ నుంచి వెళ్ళేవారందరికీ రూ. లక్ష ఆర్థిక సాయం -సద్వినియోగం చేసుకోవాలని మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుండి పవిత్రమైన మక్కా హజ్ యాత్ర కు వెళ్లే ప్రయాణికులకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అందచేస్తున్న ఆర్థిక చేయూతను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కోరారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి హజ్ కు వెళ్లే వారందరికీ రూ. లక్ష ఆర్థిక సాయం …
Read More »పర్యాటక రంగంలో సరికొత్త అధ్యాయం
-అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా(ఏడీటీవోఐ)తో పర్యాటక శాఖ ఎంవోయూ -2026 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో విశాఖలో “ఏడీటీవోఐ నేషనల్ టూరిజం మార్ట్ 2025” నిర్వహణ -రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని దేశీయంగా అగ్రస్థానంలో నిలబెట్టే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా (ADTOI) సహకారంతో 2026 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో …
Read More »డిజైనింగ్ లోపాలతో నిండుతున్న రైల్వే అండర్ బ్రిడ్జ్‌లు
–శాశ్వత పరిష్కారం కోరిన ఎంపీ గురుమూర్తి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పార్లమెంట్ పరిధిలోని రైల్వే అండర్ బ్రిడ్జ్‌ల వద్ద వర్షాకాలంలో తలెత్తుతున్న సమస్యల గూర్చి తిరుపతి ఎంపీ గురుమూర్తి పార్లమెంటులో ప్రస్తావించారు. చిన్నపాటి వర్షాలకే కొన్ని అండర్ బ్రిడ్జ్‌ల వద్ద నీరు నిలవడంతో ప్రయాణికులకు అసౌకర్యంగా మారడం తోపాటు ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ సమాదనం ఇచ్చారు. దేశవ్యాప్తంగా రైల్వే అండర్ బ్రిడ్జ్‌లు, సబ్‌వేలలో …
Read More »సెంట్రల్ నియోజకవర్గ తెలుగు యువత నూతన కమిటీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్ నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నందు బుధవారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు సెంట్రల్ నియోజకవర్గ తెలుగు యువత కమిటీ విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించబడింది.. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది, సెంట్రల్ నియోజకవర్గ తెలుగు యువత ఇన్‌చార్జ్ బొండా రవితేజ హాజరయ్యారు.. ఈ సందర్భంగా బొండా రవితేజ మాట్లాడుతూ కోటి మంది క్రియాశీలక సభ్యులతో దేశంలోనే …
Read More »ఉపాధిహామీ పథకం పేరు, చట్టం రద్దు, సరికాదు…
-భీశెట్టి బాబ్జి,లోక్ సత్తా,రాష్ట్ర అధ్యక్షుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం (ఎంజీ నరేగా)ను రద్దు చేస్తూ దాని స్థానంలో వికసిత భారత్ రోజ్ గార్,ఆజీవికా హామీ మిషన్2025( వీబీ-జీ రామ్ జీ ) పేరుతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త బిల్లుని సోమవారం లోక్ సభ ముందుకి తీసుకు రావడం కరెక్టు కాదని ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు బుధవారం విజయవాడలోని గాంధీ హిల్స్ లోని మహాత్మా గాంధీ విగ్రహని కి …
Read More »కొన్ని గంటల్లో ఈ–కార్యాలయ దస్త్రాలను పరిష్కరించడంలో కలెక్టర్ డీకే బాలాజీ అగ్రస్థానం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కొన్ని గంటల్లో ఈ–కార్యాలయ దస్త్రాలను పరిష్కరించడంలో నలుగురు జిల్లా కలెక్టర్లు నిలవగా అందులో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అగ్రస్థానంలో నిలిచినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలోని 5 వ బ్లాక్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, డిజిపి హరీష్ కుమార్ గుప్తా, మంత్రివర్గ సహచరులు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, అధిపతులతో కలసి మొదటిరోజు …
Read More »సౌరవిద్యుత్ వినియోగం పెరగాలి : పి.బి.సిద్ధార్థ ఫిజిక్స్ సింటిలాలో ప్రొ.విజయభాస్కరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మన దేశంలో సౌర విద్యుత్ వినియోగం యాభై శాతానికే పరిమితమయిందని, బొగ్గు ఆధారిత విద్యుత్, జలవిద్యుత్తులతో పోలిస్తే సోలార్ ఎనర్జీ పర్యావరణహితమని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షులు ప్రొ.ఎస్. విజయ భాస్కరరావు అన్నారు. విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సింటిలా పేరుతో ఆడిటోరియంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ఆయన మాట్లాడుతూ ఏసీలు, గ్రీజర్లు తదితర విద్యుత్ పరికరాల దుబారా, మొబైల్ ఫోన్ల వాడకం …
Read More »కలవర పెడుతున్న కోతులు, అడవి ఆవులు
– సమస్య పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు సీఎం ఆదేశాలు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ కోతులు ప్రజల్ని కలవరపెడుతున్నాయని.. అదేవిధంగా నందిగామ నియోజకవర్గంలో అడవి ఆవులు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్న విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రికి వివరించినట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కోతులు, అడవి ఆవుల …
Read More »బాలల సంరక్షణ కేంద్రాల్లో కొనసాగుతున్న తనిఖీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలో నున్న, భవానీపురం, ఇబ్రహీంపట్నంలో ఉన్న నూతన్ భవన్, షారోన్ గ్రేస్ చిల్డ్రన్ హోమ్, ప్రేమవిహార్, ప్రేమ్ నికేతన్ బాలల సంరక్షణ కేంద్రాలను జాయింట్ కలెక్టర్, జిల్లాస్థాయి కమిటీ ఛైర్మన్ ఎస్.ఇలక్కియ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ముందుగా నూతన్ భవన్ ను సందర్శించి అందులో ఉన్న ప్రత్యేక అవసరాల కలిగిన బాలలకు అందించే వైద్యం, ఆహారం, ఆరోగ్య పరిస్థితి గురించి జాయింట్ కలెక్టర్ ఆరా తీశారు. ఈ బాలలు ఎప్పటి నుండి ఇక్కడ ఉంటున్నారు? ఏ …
Read More »
Prajavartha Online Telugu News