Breaking News

Daily Archives: December 18, 2025

మేడిన్ ఏపీ

-జిల్లాకు క‌నీసం ఒక ఉత్పత్తిని గుర్తించాలి -త‌ద్వారా ఎంఎస్ ఎంఈల‌కు ప్రోత్సాహం -ప‌రిశ్ర‌మ‌ల కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ ఎన్‌. యువ‌రాజ్‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్ర‌త్యేకంగా త‌యార‌య్యే ఉత్ప‌త్తుల‌కు మేడిన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ్రాండింగ్ గుర్తింపు వ‌చ్చేలా చేయాల‌న్న‌ది ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ప‌రిశ్ర‌మ‌ల శాఖ కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ ఎన్‌. యువ‌రాజ్ తెలిపారు. జిల్లా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆయ‌న ప్రాడ‌క్ట్ ప‌ర్పెక్ష‌న్ అంశంపై మాట్లాడుతూ ఈ విష‌యం తెలిపారు. ప్ర‌తి జిల్లాలోనూ క‌నీసం ఒక విశిష్ట వ‌స్తువునైనా గుర్తించాల‌ని, వాటికి మేడిన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ్రాండిగ్ …

Read More »

నీళ్లుంటేనే రైతుకు మనః శాంతి

-ఒక మీట‌రు మ‌ట్టం పెరిగినా ఎంతో మేలు -విద్య‌త్తు కూడా ఆదా అవుతుంది – వ‌ర్షాకాలం చివ‌రి రోజుకి అన్ని రిజ‌ర్వాయ‌ర్లు నీటితో నిండిపోవాలి – చిన్న చెరువుల‌పైనా ప్ర‌త్యేక దృష్టి పెట్టాలి – కాలువ‌ల ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించండి – నీటి తీరువా చెల్లింపుపై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్లించండి – జ‌ల‌వ‌న‌రుల శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జి. సాయి ప్ర‌సాద్‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : నీళ్లు స‌మృద్ధిగా ల‌భించిన‌ప్పుడు రైతుల‌కు మ‌నఃశాంతి ఉంటుంద‌ని, నీటి సంర‌క్ష‌ణ అనేది అన్నిటికంటే అతిముఖ్య‌మైన …

Read More »

మంత్రి రాంప్రసాద్ రెడ్డితో సమావేశమైన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

-మంత్రితో పలు అంశాలపై ఎమ్మెల్యే చర్చ -5.70 ఎకరాల భూమిలో రూ.400 లక్షల అంచనా వ్యయంతో సమగ్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి వినతి -కోవూరు నియోజకవర్గంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి వినతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోవూరు నియోజకవర్గంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా ఉన్న అంశాలపై కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అమరావతి సచివాలయంలో రాష్ట్ర రవాణా, యువజ, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా ఇండుకూరుపేటలోని …

Read More »

నగరంలో బ్యాడ్ గాళ్స్ చిత్ర యూనిట్ సందడి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో ప్రసిద్ధిగాంచిన గాంధీ పర్వతాన్ని బ్యాడ్ గాళ్స్ చిత్ర యూనిట్ సందర్శించింది. అనంతరం చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనుకు రూబెన్స్ మాట్లాడుతూ దర్శకుడు మున్నా ధూళిపూడి ఒక చక్కటి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్ర బోస్ అద్భుతమైన పాటలు రచించగా వాటికి తనదైన శైలిలో సంగీతాన్ని అందజేయడం జరిగిందన్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన రెండు …

Read More »

పీపీపీ విధానం తప్పు అయితే… నన్ను జైలుకు పంపు..

-జగన్ రెడ్డికి మంత్రి సత్యకుమార్ యాదవ్ సవాల్ -కేంద్ర ప్రభుత్వ విధానం కూడా పీపీపీనే -అందుకని పీఎం మోదీని కూడా జైలుకు పంపుతారా? -మీ తాటాకు చప్పుళ్ల‌కు బెదిరేవారెవరూ లేరు జగన్ -గ‌వ‌ర్న‌రునూ ప‌క్క‌తోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం -పీపీపీ విధానంలో ప్రైవేటీకరణకు ఆస్కారమే లేదు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : మళ్లీ అధికారంలోనికి వచ్చి..2 నెలల్లోనే. పీపీపీ విధానంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన వారినందరినీ జైలుకు పంపిస్తానంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర …

Read More »

సీఎం చంద్ర‌బాబు కు స్వాగ‌తం ప‌లికిన ఎంపీ కేశినేని శివ‌నాథ్

ఢిల్లీ,  నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర సాయంపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు గురువారం ఢిల్లీకి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కి ఢిల్లీ విమానాశ్ర‌యంలో స‌హ‌చ‌ర ఎంపీల‌తో క‌లిసి ఎంపీ కేశినేని శివ‌నాథ్ స్వాగ‌తం ప‌లికారు. కేంద్ర భాగస్వామ్యంతో రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టులు, అమలు చేస్తున్న కార్యక్రమాలపై చ‌ర్చించేందుకు శుక్ర‌వారం ప‌లువురు కేంద్ర మంత్రుల‌తో సీఎం చంద్రబాబు సమావేశంకానున్నారు.

Read More »

ఎన్.ఐ.ఆర్.డి లో బ్రిక్స్ త‌యారీ పై ఎస్.హెచ్.జి మ‌హిళ‌ల‌కు నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ ప్రారంభం

-ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆధ్వ‌ర్యంలో శిక్ష‌ణ పొందుతున్న‌ 4వ బ్యాచ్ విజ‌య‌వాడ,  నేటి పత్రిక ప్రజావార్త : ఎంపీ కేశినేని శివ‌నాథ్ సార‌ధ్యంలో కేశినేని ఫౌండేష‌న్ మ‌రియు ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వ‌ర్యంలో బ్రిక్స్ త‌యారీ పై మూడు రోజుల శిక్ష‌ణ పొందేందుకు హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డికి వెళ్లిన 35 మంది ఎస్.హెచ్.జి మ‌హిళ‌ల‌కు శిక్ష‌ణ త‌ర‌గ‌తులు గురువారం ప్రారంభం అయ్యాయి. 4వ బ్యాచ్ గా వెళ్లిన వీరికి డిసెంబ‌ర్ 18 నుంచి 20 వ‌ర‌కు మూడు రోజుల పాటు బ్రిక్స్ త‌యారీ పై శిక్ష‌ణ వుంటుంది. …

Read More »

ప్ర‌జాస్వామ్య పాల‌న‌కు ప్ర‌జాద‌ర్భార్ నిద‌ర్శ‌నం

-ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్డీయే కూట‌మి పాలన -ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆదేశాల మేర‌కు 34వ డివిజ‌న్ లో ప్ర‌జాద‌ర్బార్ -స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కోసం భారీగా త‌ర‌లివ‌చ్చిన ప్ర‌జానీకం విజ‌య‌వాడ,  నేటి పత్రిక ప్రజావార్త : ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వ ప్ర‌జాస్వామ్య పాల‌న కు ప్ర‌జాద‌ర్బార్ నిద‌ర్శ‌నం..ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ఎలాంటి జాప్యం జ‌ర‌గ‌కూడ‌ద‌నే ఉద్దేశ్యంతో ప్ర‌జాదర్బార్ నిర్వ‌హిస్తున్న‌ట్లు మాజీ ఎమ్మెల్సీ టిడిపి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్దా వెంక‌న్న అన్నారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం 34వ డివిజ‌న్ లో కేదారేశ్వ‌ర‌పేట మ‌సీద్ సెంట‌ర్ …

Read More »

విజయవాడ రైల్వే మౌలిక వసతుల అభివృద్ధిపై ఎంపీ కేశినేని శివనాథ్ కృషి

-కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో ఎంపీ కేశినేని శివనాథ్, ఎంపీ పురందేశ్వరి భేటీ -గొల్లపూడి లోని బల్బ్ లైన్ల వద్ద శాటిలైట్ / హాల్ట్ రైల్వే స్టేషన్ ఏర్పాటుకు ప్ర‌తిపాద‌న -కొండపల్లి–విజయవాడ రైల్వే ట్రాక్ వెంట నీటి నిల్వ సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాల‌ని విజ్ఞ‌ప్తి -ఎంపీ కేశినేని శివనాథ్ అభ్య‌ర్ధ‌న‌ల‌పై సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణ‌వ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాల …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో 28 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు వాటిలో 23 పూర్తి

-గ‌త ఐదేళ్ల‌లో ఏపీకి 9 ఈ.ఎమ్.ఆర్.ఎస్ లు మంజూరు -కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ స‌హాయ మంత్రి దుర్గాదాస్ ఉయికే వెల్ల‌డి -ఏపీలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ పై ప్ర‌శ్నించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన విద్యార్థులకు ఉన్నత స్థాయి పోటీ పరీక్షలు ఐ.ఐ.టి-జె.ఈ.ఈ(IIT–JEE), ఎన్.ఈ.ఈ.టి (NEET) కోచింగ్ కోసం దేశవ్యాప్తంగా మూడు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoEs) ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేయ‌గా ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని చింతపల్లి ఒకటిగా ఉందని …

Read More »