Breaking News

Daily Archives: December 19, 2025

ఏపీ ఛాంబర్స్‌ను సందర్శించిన ఇండోనేషియా కాన్సుల్ జనరల్ (ముంబై)

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముంబైలోని రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా కాన్సుల్ జనరల్, ఎడ్డీ వార్డోయో (Mr. Eddy Wardoyo) ఈరోజు విజయవాడలోని ఏపీ ఛాంబర్స్ (AP Chambers) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఛాంబర్స్ ప్రతినిధులు మరియు సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మరియు ఇండోనేషియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మరియు పెట్టుబడుల సంబంధాలను బలోపేతం చేసే మార్గాలపై కాన్సుల్ జనరల్ చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ఎగుమతిదారులకు ఇండోనేషియా అందిస్తున్న ప్రయోజనాలు మరియు వాణిజ్య వెసులుబాటు చర్యలను …

Read More »

మీ పని తీరు చిరస్థాయిగా నిలిచిపోవాలి

-నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించండి -వర్తమాన, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి -ప్రతి నియోజకవర్గం ఆర్థికంగా బలోపేతం కావాలి… యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు పెంచాలి -మహిళలు, రైతుల సంక్షేమాన్ని విస్మరించకుండా ముందుకు వెళ్ళాలి -పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలి… జన సైనికులు, వీర మహిళలతో ఎప్పటికప్పుడు చర్చించాలి -జనసేన శాసనసభ్యులతో వన్ టూ వన్ సమావేశాలు నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  -నియోజకవర్గాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ఆన్ గోయింగ్ …

Read More »

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : • పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ కు చేయూత ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరిన సీఎం • రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరిన ముఖ్యమంత్రి • కరవు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు, సాగునీటి అవసరాల కోసం గోదావరి వరద జలాల మళ్లింపు కోసం చేపట్టే పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని సీఎం విజ్ఞప్తి పూర్వోదయతో గ్రోత్ ఇంజన్ గా ఏపీ • …

Read More »

కేంద్ర జల్ శక్తి శాఖా మంత్రి సీ.ఆర్.పాటిల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : • రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించారు. • ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో పాటిల్‌ను కలిసి పలు విజ్ఞప్తులు చేశారు. ప్రత్యేకించి విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, పెండింగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. • ఆంధ్రప్రదేశ్‌కు నీటి భద్రత అత్యంత కీలక …

Read More »

శ్రీ పొట్టి శ్రీరాములు పేరిట జె.జె.ఎం.వాటర్ గ్రిడ్ పథకం

-అమరజీవి జలధార అని నామకరణం -ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 68 లక్షల కుటుంబాలకు తాగు నీరు సరఫరా -శనివారం నిడదవోలు నియోజక వర్గం పెరవలిలో పనులకు శంకుస్థాపన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని దీక్షబూని ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు పేరును ప్రతి ఒక్కరూ నిత్యం తలచుకొనేలా చేస్తోంది కూటమి ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి సరఫరాకు ఉద్దేశించిన జె.జె.ఎం.వాటర్ గ్రిడ్ పథకానికి ‘అమరజీవి జలధార’ అని నామకరణం …

Read More »

రేపు అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

-‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ సహా పలు కార్యక్రమాలకు హాజరు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా విద్యార్థులతో ముఖాముఖి అవుతారు. ప్రజావేదిక సభ, పార్టీ కేడర్‌తో భేటీ, మత్స్యకారులతో సమావేశం, అలాగే మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి విగ్రహావిష్కరణ వంటి కార్యక్రమాల్లోనూ ముఖ్యమంత్రి పాల్గొంటారు. శనివారం ఉదయం అమరావతి నుంచి నేరుగా హెలికాప్టర్ లో అనకాపల్లి జిల్లా చేరుకుంటారు. ఉదయం 11.30 గంటలకు కశింకోట మండలం …

Read More »

నేడు ఉదయం 10 గంటలు నుండి సాయంత్రం 6 గంటలు వరకు నిర్వహించిన ప్రజాధర్బార్ కు విశేష స్పందన

-ప్రజాధర్భార్లో 36 అర్జీలు, సంబంధిత అధికారులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. -రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు/నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు రాష్ట్ర మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటలు నుండి సాయంత్రం 6 గంటలు వరకు జరిగిన ప్రజాధర్బార్ లో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొని 36 అర్జీలను స్వీకరించారు. కొన్ని సమస్యలను మంత్రి కొలుసు పార్థసారథి అక్కడికక్కడే పరిష్కారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి …

Read More »

గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుండే తగిన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయండి : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2027 జూన్ 26 నుండి జూలై 7వతేదీ వరకు 12 రోజుల పాటు జరగనున్న గోదావరి పుష్కరాలను విజయంవంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుండే ఆయా శాఖలు,జిల్లాల వారీగా తగిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కార్యదర్శులను ఆదేశించారు.గోదావరి పుష్కరాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యదర్శుల కమిటీ సమావేశం శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన జరింగింది.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి పుష్కరాల సహ్నాహక ఏర్పాట్లకు సంబంధించి ఇది మొదటి ప్రాధమిక సమావేశం …

Read More »

అవినీతికి ఆస్కారం లేకుండా పని చేయండి

-వీఆర్వో, వీఆర్ఏ, సర్వేయర్ల సమస్యలను పరిష్కరిస్తా -సంఘాల నేతలకు రెవెన్యూ మంత్రి అనగాని హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ ను శుక్రవారం ఆంధ్రపదేశ్ వీఆర్వో అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ వి.ఆర్.ఎ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ, ఎపీ గ్రామ సర్వేయర్ల అసోసియేషన్ నాయకులు కలిశారు. ఈ సందర్బంగా వారి సమస్యలను మంత్రి అనగాని సత్యప్రసాద్ కు వివరించారు. తమకు ప్రమోషన్లు ఇవ్వాలని మూడు సంఘాల వారు కోరారు. దీనిపై అధికారులతో …

Read More »

గ్రామీణ నిరుపేద ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభతరం.

-319 మంది అంగన్వాడీ కార్యకర్తలకు 5జి సెల్ ఫోన్లు పంపిణీ. -రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి … ఏలూరు/నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గంలోని 319 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ మొబైల్స్ అందజేసి, గ్రామీణ నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలు ప్రజలు ప్రభుత్వ సేవలు మరింత సులభతరం చెయ్యాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సేవలు …

Read More »