Breaking News

Daily Archives: December 19, 2025

వృధా జలాలు వాడుకుంటామంటే అభ్యంతరం ఎందుకు?

-పోలవరం-నల్లమల సాగర్ కి అనుమతులు ఇవ్వాలి. -సహజ సూత్రాల ప్రకారం దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కి హక్కు ఉంటుంది. -ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో కలిసిపోతున్న గోదావరి వృధా జలాలను దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వాడుకుంటామంటే ఎవరికి ఏ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన కేంద్ర జల్ శక్తి శాఖా …

Read More »

ఏసు ప్రభువు త్యాగం, ప్రేమ, కరుణ బోధనలు ద్వారా విశ్వమానవాళికి చక్కని శాంతిమార్గం వేసారు.

-యస్ సి సంక్షేమం, అభివృద్ధికి అదనంగా రూ 150 కోట్లు కేటాయించిన కూటమి ప్రభుత్వం. -రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి  ఏలూరు/నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు మంత్రివర్యులు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సెమీ క్రిస్టమస్ కు ప్రత్యేక అతిథిగా హాజరై ఫాదర్స్, మత పెద్దలకు, సోదర, సోదరీ మణులకు మరియు కూటమి నాయకులకు, కార్యకర్తలకు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి క్రిస్టమస్ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. మొదటిగా మంత్రికి ఘనంగా స్వాగతం పలికి చర్చి …

Read More »

స్కేటర్లకు రాష్ట్ర క్రీడాశాఖ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి మంత్రి అభినందనలు

-జాతీయ రోలర్ స్కేటింగ్‌లో విజయవాడ క్రీడాకారులకు పతకాలు పంట విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ వేదికగా ఈ నెల 5 నుంచి 15 వరకు నిర్వహించిన 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలలో విజయవాడకు చెందిన అంచిత, దినేష్, దిరాజ్, తనుజ, తన్మయి పతకం సాధించడం అభినందనీయమని, క్రీడాకారులకు మంచి శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దిన కోచ్ లు మహమ్మద్ ఖాజా, నాగుల్ మీరను ప్రత్యేకంగా ప్రశంసించారు. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కొనియాడారు. విజయవాడలోని మంత్రి క్యాంప్ …

Read More »

ఏపీ వి ఆర్ వో లకు పదోన్నతులు కల్పించాలి…. : భూపతి రాజు రవీంద్ర రాజు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన గ్రేడ్ 2 వీఆర్వోలకు గ్రేడ్ వన్ వి ఆర్ వో లుగా వెంటనే పదోన్నతులు కల్పించాలని,వన్ టైం సెటిల్మెంట్ గా అందరికీ గ్రేడ్ వన్ వి ఆర్ వో లుగా పదోన్నతులు కల్పించాలి ఏపీ వీఆర్వో అసోసియేషన్ ప్రెసిడెంట్ భూపతి రాజు రవీంద్ర రాజు పేర్కొన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో వి ఆర్ వో సమస్యలపై చర్చించి …

Read More »

రాజధాని అమరావతిలో APCRDA ఆధ్వర్యంలో కార్మికులకు ఉచిత కంటి వైద్య శిబిరం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తుళ్లూరులో ప్రజారాజధాని అమరావతి నిర్మాణ పనులు చేపట్టిన RVR సంస్థ క్యాంప్ సైట్‌లో అమరావతి అభివృద్ధి ప్రాజెక్ట్ పనులలో నిమగ్నమైన వాహన డ్రైవర్లు, భారీ యంత్రాల ఆపరేటర్లు, కార్మికుల కోసం శుక్రవారం APCRDA సౌజన్యంతో కంటి ఆరోగ్య పరీక్ష శిబిరం నిర్వహించబడింది. రహదారి భద్రతా కార్యక్రమాలలో భాగంగా, ముఖ్యంగా ప్రస్తుత శీతాకాలపు రాత్రి సమయంలో, తీవ్రమైన పొగమంచు పరిస్థితుల్లో నిర్మాణ వాహనాల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు, ట్రక్ డ్రైవర్లు, భారీ యంత్రాల ఆపరేటర్లకు గుంటూరు …

Read More »

మేరీ స్టెల్లా కళాశాలలో మెగా జాబ్ మేళా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మేరీ స్టెల్లా కళాశాల మరియు డాన్ బోస్కో ప్లేస్మెంట్ నెట్వర్క్ సంస్థ తెలంగాణ, ఆంధ్రాప్రదేశ్ సంయుక్తంగా మెగా జాబ్ మేళా ను నిర్వహించారు. ఈ కార్య క్రమంలో కరెస్పాండెంట్ డాక్టర్ లేన క్వాడ్రస్,ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ,ఫాదర్ బాల రాజ్,,ఫాదర్ శౌరి, ఫాదర్ జస్టిన్ దిశ డైరెక్టర్,తెలంగాణ,ఫాదర్ జీవన్ దిశ డైరెక్టర్, ఆంధ్రా ప్రదేశ్, తదితరులు ప్రారంభించారు ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ మాట్లాడుతూ బ్యాంకింగ్, ఫార్మా,అగ్రికల్చర్, ఏవియేషన్, మార్కెటింగ్,ఇండస్ట్రీ రంగాలకు చెందిన ప్రతిష్టాత్మక 23 సంస్థలు …

Read More »

సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లతో జిల్లా అభివృద్ధి

-జిల్లా సమీక్షా మండలి సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లతో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని రాష్ట్ర కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, వైద్య బీమా సేవల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా …

Read More »

ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచానికి శాంతియుత మార్గాన్ని చూపి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని తన రక్తాన్ని చిందించిన త్యాగమూర్తి, కరుణామయుడు ఏసుప్రభువు అని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కీర్తించారు. శుక్రవారం రాత్రి నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద గల శుభం కన్వెన్షన్ హాలులో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేసి అందరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి …

Read More »

15 మందికి కారుణ్య నియామకాలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విధులను అంకితభావంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి కొత్తగా నియమితులైన ఉద్యోగులకు సూచించారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో 15 మందికి కారుణ్య నియామకాల కింద నియామక పత్రాలు అందజేశారు. నియామక పత్రాలు అందుకున్న వారిలో 9 మంది జూనియర్ అసిస్టెంట్ పదవులకు, 6 మంది ఆఫీస్ సబార్డినేట్ పదవులకు వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయిస్తూ జిల్లా కలెక్టరు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వారికి …

Read More »

పరిశ్రమలు తదితర అంశాల పురోగతిపై సమీక్ష

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో విరివిగా పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్, డిఆర్ఓ కె చంద్రశేఖర రావులతో కలిసి పరిశ్రమలు తదితర అంశాల పురోగతిపై నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏపీఐఐసీ ద్వారా గత 2 సంవత్సరాల లోపు మల్లవల్లి, వీరపనేని గూడెం …

Read More »