Breaking News

Daily Archives: December 20, 2025

జిల్లా గ్రామీణ విలేఖరుల పునశ్చరణ తరగతులు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం తీసుకునే విధాన పర నిర్ణయాలను మీడియా సరైన అవగాహనతో ప్రజలకు చేరవేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రామచంద్రపురం విఎస్.ఎం ఇంజనీరింగ్ కళాశాలలో ఆడిటోరియం సి.ఆర్. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ప్రారంభమైన జిల్లా గ్రామీణ విలేఖరుల పునశ్చరణ తరగతుల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్మికుల పని వేళలపై తీసుకున్న నిర్ణయాలు వారి సంక్షేమానికి దోహదపడతాయని మంత్రి వ్యాఖ్యానించారు. కార్మికుల పని వేళలు వారికి కుటుంబంతో గడిపే సమయాన్ని, అధిక …

Read More »

స‌రైన ఆలోచ‌న‌తో వ్య‌ర్థాల‌ను విలువైన వ‌న‌రులుగా మారుద్దాం

– స‌ర్క్యుల‌ర్ ఎకాన‌మీతో బ‌హుముఖ ప్ర‌యోజ‌నాలు – చిత్త‌శుద్ధితో ప‌నిచేసి స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ‌లో ముందుందాం – స్వ‌ర్ణాంధ్ర‌-స్వ‌చ్ఛాంధ్ర కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్య‌ర్థాలను స‌రైన ఆలోచ‌న‌, కార్యాచ‌ర‌ణ‌తో విలువైన వ‌న‌రులుగా మార్చ‌డం ద్వారా స‌ర్క్యుల‌ర్ ఎకాన‌మీతో ఆర్థికంగా, సామాజికంగా, ప‌ర్యావ‌ర‌ణం ప‌రంగా బ‌హుముఖ ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. డిసెంబ‌ర్ నెల మూడో శ‌నివారం స్వ‌ర్ణాంధ్ర‌-స్వ‌చ్ఛాంధ్ర‌లో భాగంగా నందిగామ మునిసిపాలిటీ ప‌రిధిలో జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌.. …

Read More »

ఆరోగ్య ఆంధ్ర దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు..

– స్వ‌ర్ణాంధ్ర‌, విక‌సిత్ భార‌త్ ల‌క్ష్యాల‌ను చేరుకుందాం – పోలియో అంత‌మొందినా అప్ర‌మ‌త్తంగా ఉందాం – అయిదేళ్లలోపు చిన్నారుల‌కు త‌ప్ప‌నిస‌రిగా పోలియో చుక్క‌లు వేయిద్దాం – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స‌మ‌ష్టిగా అడుగులు వేస్తూ స్వ‌ర్ణాంధ్ర‌, విక‌సిత్ భార‌త్ ల‌క్ష్యాల‌ను చేరుకుందామ‌ని.. ఈ క్ర‌మంలో ఆరోగ్య ఆంధ్ర సాకారానికి కృషిచేద్దామ‌ని, పోలియో అంత‌మొందినా అప్ర‌మ‌త్తంగా ఉంటూ అయిదేళ్ల‌లోపు చిన్నారుల‌కు త‌ప్ప‌నిస‌రిగా పోలియో చుక్క‌లు వేయిద్దామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. శ‌నివారం విజ‌య‌వాడ‌, …

Read More »

బలమైన కుటుంబ వ్యవస్థ ద్వారానే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యం

-జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టాల గోపి పెడన, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యకరమైన కుటుంబ సంబంధాలు సామాజిక స్థిరత్వానికి మూలం, నేరాలు, సామాజిక వ్యతిరేక ప్రవర్తనలను తగ్గిస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గుట్టాల గోపి పేర్కొన్నారు. శనివారం ఉదయం పెడన మండలంలోని పెడన ఫంక్షన్ హాల్లో జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా పరిపాలనా యంత్రాంగం సంయుక్తంగా నూతన తరహా న్యాయ సేవల శిబిరం …

Read More »

ప్లాస్టిక్ వాడకం తగ్గించుకుని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా పాటించి, ప్లాస్టిక్ వాడకం తగ్గించుకుని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టరేట్లో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు కార్యాలయపు సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్ పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాలు, ఎండిపోయిన ఆకులను, విరిగిపోయి పడిపోయిన చెట్టు కొమ్మలను తొలగించి మునిసిపల్ ట్రాక్టర్లకు ఎక్కించారు. ప్రతి శనివారం మాదిరిగానే …

Read More »

అమరావతిలోని ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో ఘనంగా సెమీక్రిస్మస్ వేడుకలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి- రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో శనివారం అధికారులు, సిబ్బంది ఆనందోత్సాహాల మధ్య సెమీక్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అడిషనల్ కమిషనర్ ఏ. భార్గవతేజ ఐ.ఏ.ఎస్., ఆఫీస్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ వల్లభనేని శ్రీనివాసరావు, APCRDA, పీజీఎంసీ(PgMC)లోని పలు విభాగాల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా క్రిస్మస్ కరోల్స్, కేక్ కటింగ్, క్రిస్మస్ పాటల ఆలాపన నిర్వహించిన అనంతరం అడిషనల్ కమిషనర్, ఆఫీస్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్, ప్లానింగ్ విభాగ డైరెక్టర్(FAC) బి.సురేష్ కుమార్, డెవలప్మెంట్ …

Read More »

రైతుల నుంచి అర్జీలు స్వీకరించిన కమిషనర్ కె.కన్నబాబు ఐ.ఏ.ఎస్., అడిషనల్ కమిషనర్ ఏ. భార్గవతేజ ఐ.ఏ.ఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయం- గ్రౌండ్ ఫ్లోర్‌లో “గ్రీవెన్స్ డే” నిర్వహించారు. గ్రామకంఠాలు, LPS లే అవుట్లు, రిటర్నబుల్ ప్లాట్ల రీ అలాట్‌మెంట్ తదితర సమస్యల గురించి పలువురు రాజధాని ప్రాంతవాసులు తమ అర్జీలను “గ్రీవెన్స్ డే”లో కమిషనర్ కె.కన్నబాబు ఐ.ఏ.ఎస్., అడిషనల్ కమిషనర్ ఏ. భార్గవతేజ ఐ.ఏ.ఎస్. కు అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని కమిషనర్, అడిషనల్ కమిషనర్లు అర్జీదారులకు హామీ …

Read More »

అమరావతిలో రహదారుల నిర్మాణంలో QA/QC అంశాలపై శిక్షణ సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా ట్రంక్ రహదారుల నిర్మాణంలో నాణ్యతా నిర్వహణ(Quality Assurance), నాణ్యతా నియంత్రణ (Quality Control) అంశాలపై సమగ్ర శిక్షణా కార్యక్రమాన్ని పీజీఎంసీ(PgMC) సామర్థ్యాభివృద్ధి బృందం 20-12-2025న నిర్వహించింది. ఈ శిక్షణా కార్యక్రమంలో ఏపీ సిఆర్‌డీఏ, ఏడీసీఎల్ అధికారులు, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్ (PMCs)లోని కాంట్రాక్ట్ మేనేజర్లు పాల్గొన్నారు. అమరావతిలో రహదారి నిర్మాణ పనులు, తదితర మౌలిక వసతుల అభివృద్ధి పనులలో అత్యున్నత ప్రమాణాలు పాటించేలా సాంకేతిక సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య …

Read More »

వి.ఐ.టి సబ్ పోస్ట్ ఆఫీస్ ను జెన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ గా ప్రారంభించిన కేంద్ర మంత్రి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు పోస్టల్ డివిజన్ లో విట్ (VIT-AP) సబ్ పోస్ట్ ఆఫీస్ ను ఆధునీకరణ చేసి జెన్ జెడ్ (Gen ‘Z’) పోస్ట్ ఆఫీస్ గా మార్చడం జరిగింది. ఈ పోస్ట్ ఆఫీస్ ను శనివారం కేంద్ర గ్రామీణ అభివృద్ధి మరియు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ VIT University క్యాంపస్ లో ప్రారంభించారు. జెన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ లు సంప్రదాయ పోస్టల్ కార్యాలయాలను యువత కేంద్రంగా, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన …

Read More »

శంకర్ విలాస్ ఆర్.ఓ.బి వేగవంతానికి చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వే ప్రాజెక్టుల పురోగతి పై స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నశీర్ అహ్మద్ తో కలిసి గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో గల ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో శనివారం సమీక్ష  నిర్వహించారు. పెమ్మసాని మాట్లాడుతూ గుంటూరు నగర, రైల్వే డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. శంకర్ విలాస్ వంతెన రైల్వే ట్రాక్ పై ఉన్న పాత వంతెన డెమోలిష్ చేసే బాధ్యత ఓ ఏజెన్సీకి …

Read More »