Breaking News

Daily Archives: December 22, 2025

ఆదాయం కాదు… ఆరోగ్యకరమైన వృద్ధి సాధించాలి

-లాటరీ విధానం, రిటైలర్ మార్జిన్ పెంపుపై పున:పరిశీలన -ప్రతీ మద్యం బాటిల్ పైనా ప్రత్యేక గుర్తింపు నెంబర్ -బెల్టు షాపుల నియంత్రణకు హర్యానా మోడల్‌పై అధ్యయనం -ఎక్సైజ్ శాఖపై సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు నిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మద్యం విధానాన్ని వ్యాపారంలా చూడకుండా, ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారులకు సూచించారు. ఆదాయమే లక్ష్యంగా విధానాలు ఉండకూడదని, మద్యాన్ని కూడా ఒక ఉత్పత్తిలానే పరిగణించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం అనుసరిస్తున్న లాటరీ …

Read More »

తరుచూ తాగునీటి పరీక్షలు చేపట్టాలి

-మూడు రీజియన్లల్లో డీ-ఎడిక్షన్‌ సెంటర్లు -ప్రజల కోణంలో ఆలోచించే ప్రభుత్వ సేవలందించాలి -ఆర్టీజీ సెంటర్‌ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల కోణంలో ఆలోచించేలా అధికారులు వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీ సెంటర్‌ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. క్షేత్ర స్థాయిలో అందుతున్న సేవలు ఏ విధంగా అందుతున్నాయనే అంశంపై ఆరా తీశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధికారులకు పలు …

Read More »

దుబాయ్‌లో సెమీ క్రిస్మస్‌ వేడుకలు

-పాల్గొన్న టి.డి.జనార్ధన్‌, నిమ్మల రామానాయుడు దుబాయ్‌, నేటి పత్రిక ప్రజావార్త : దుబాయ్‌లో తెలుగుదేశం పార్టీ అభిమానులు సెమీ క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రత్యేక అతిధులుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నీటిపారుదలశాఖా మంత్రి నిమ్మల రామానాయుడు తెలుగుదేశం పార్టీ పోలిట్యూరో సభ్యులు, ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చైర్మన్‌ టి.డి. జనార్ధన్‌ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో తెలుగు కుటుంబాల వారు పాల్గొన్న ఈ వేడుకలో ముందుగా క్రిస్మస్‌ కేక్‌ను కట్‌ చేశారు. ఆ తర్వాత వక్తలు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ పోలిట్‌ బ్యూరో …

Read More »

బ్రాహ్మణుల సమస్యలపై నిరంతరం పోరాడి పరిష్కారం సాధించడమే బ్రాహ్మణ సాధికార సమితి లక్ష్యం

-బ్రాహ్మణ కార్పొరేషన్‌, సాధికార సమితి ఏర్పాటు చేసి బ్రాహ్మణులకు గౌరవం కల్పించినది చంద్రబాబే -పేద బ్రాహ్మణుల కోసం గరుడా పథకం పునఃప్రారంభం, ఉచిత సామూహిక ఉపనయనాలు త్వరలో నిర్వహించనున్నాం -బుచ్చి రాంప్రసాద్‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించి వారికి మెరుగైన సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం అందిస్తుందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌, టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్‌ బుచ్చి రాంప్రసాద్‌ తెలిపారు. సోమవారం మంగళగిరి ఎన్టీఆర్‌ భవన్‌ లో బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కమిటీ మీటింగ్‌ …

Read More »

నరేగా పథకంలో కేంద్రం వాటా తగ్గింపు సమంజసం కాదు

-సీఎం చంద్రబాబుకు సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ వినతిపత్రం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడం సమంజసం కాదని, దీనిపై కేంద్రంతో మాట్లాడి మహాత్మాగాంధీ పేరును కొనసాగించేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబును సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావుతో పాటు రామకృష్ణ సీఎంను కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలను సీఎం …

Read More »

అమరావతిలో కల్చరల్ సెంటర్ ఏర్పాటు

-నిర్దేశిత గడువులోగా క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణం -జోన్ 8 ఎల్పీఎస్ లే అవుట్‌లో రూ.1358 కోట్లతో మౌలిక సదుపాయాలు -56వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతి ప్రాంతంలో ఆధునిక కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు త్వరితగతిన భూమిని గుర్తించాలని సూచించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో 56వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం వివిధ అంశాలను అథారిటీ ఆమోదించింది. అలాగే రాజధాని …

Read More »

రాజధాని అమరావతిలో పర్యటించిన పద్మభూషణ్‌ దాజి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలో పద్మభూషణ్‌ దాజి (కమలేష్‌ డి.పాటిల్‌) సోమవారం పర్యటించారు. మూడు రోజులపాటు ఏపీలో ఆయన పర్యటించనుండగా.. సోమవారం సాయంత్రం ఆయన రాయపూడి సిఆర్‌డిఎ ప్రధాన కార్యాలయానికి విచ్చేశారు. కాగా దాజి ప్రస్తుతం శ్రీరామ చంద్ర మిషన్‌ Ê గ్లోబల్‌ గైడ్‌ ఆఫ్‌ హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థకు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. దాజి కి సిఆర్‌డిఎ ప్రధాన కార్యాలయం వద్ద మొక్కలు అందజేసి రాష్ట్ర పురపాలక Ê పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా.పొంగూరు నారాయణ, సిఆర్‌డిఎ కమిషనర్‌ కె.కన్నబాబు ఐ.ఏ.ఎస్‌., …

Read More »

స్టెల్లా కళాశాలలో నేషనల్ ఇండియన్ మేథమెటిక్ ఒలింపియాడ్ ట్రైనింగ్ కార్యక్రమం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాలలో గణిత శాస్త్ర విభాగం వారు నిర్వహిస్తున్న నేషనల్ ఇండియన్ మేథమెటిక్ ఒలింపియాడ్ ట్రైనింగ్ కార్యక్రమం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపికైన 19 మంది విద్యార్థులు ఈ ట్రైనింగ్‌లో పాల్గొంటున్నారు. జనవరి 2026లో జరిగే పరీక్షకు సిద్ధం అవుతున్నారు. ఈ ట్రైనీ జి 20వ తేదీ నుండి 23 తేదీ వరకు జరుగుతుందని డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ తెలిపారు. ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ మాట్లాడుతూ… విద్యార్థులు గణితంలో ప్రావీణ్యం పొందితే విజయం వరిస్తుందని తెలిపారు. హైదరాబాద్ …

Read More »

పరకామణి దొంగతనాన్ని సమర్థించిన జగన్ క్షమాపణ చెప్పాలి

-రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్, బుచ్చి రాంప్రసాద్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : పరకామణి దొంగతనాన్ని సమర్థించిన జగన్ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్, బుచ్చి రాంప్రసాద్ గారు ఆగ్రహం వ్యక్తం చేసారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పరకామణి అంటే వెంకటేశ్వరస్వామికి భక్తులు ఇచ్చే కానుకలు. భక్తి శ్రద్ధలతో, కష్టపడి సంపాదించిన డబ్బు, బంగారం, నిలువు దోపిడీ, తలనీలాలు వంటివి దేవుడికి సమర్పించుకుంటారు. కొందరు మొక్కు కోరికలు తీరితే తలనీలాలు ఇస్తామని ప్రతిజ్ఞ …

Read More »

అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు

– వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కృష్ణా డీసీసీబి చైర్మన్ నెట్టెం రఘురాం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం నాగిశెట్టి పల్లె గ్రామానికి చెందిన చంద్రశేఖర్ నాయుడు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. తమ గ్రామంలో పట్టా భూమి అయిన 18 సెంట్ల స్థలంలోకి గ్రామ సర్పంచ్‌, వైసీపీ నాయకుడు మాదినేని ఈశ్వరయ్య వంక నీటిని దౌర్జన్యంగా మళ్లించి తీవ్ర నష్టం కలిగిస్తున్నాడు. తన …

Read More »