Breaking News

Daily Archives: December 22, 2025

కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాంని మర్యాదపూర్వకంగా కలిసిన గౌడ కార్పొరేషన్ చైర్మన్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి ఈ రోజు విజయవాడలోని కేడీసీసీ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయంలో మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాంని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతం, పార్టీ కార్యకర్తల సంక్షేమం, భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ, ప్రజా సమస్యల పరిష్కారం తదితర కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరగగా, గురుమూర్తి కి నెట్టెం రఘురాం విలువైన సూచనలు, మార్గదర్శకాలు …

Read More »

అర్జీల పరిష్కార తీరు నాణ్యతగా ఉండాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర -పీజీఆర్ఎస్ ద్వారా 26 అర్జీలు స్వీకరణ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : అర్జీదారులు తెలియజేసిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి.. నాణ్యమైన పరిష్కారాన్ని వేగవంతంగా అందించేలా చర్యలు చేపట్టాలని కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతున్నందున అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వినతులను పరిష్కరించాలని …

Read More »

కార్పొరేషన్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్పొరేషన్ సిబ్బంది. సోమవారం ఉదయం కమిషనర్ ధ్యానచంద్ర కేక్ కట్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగులు అందరు ఒకటే కుటుంబంగా భావించి పని చేస్తూ తమ విధుల్లో కట్టుబడి ఉంటేనే మన నగరం అభివృద్ధి చెందుతుందని, విజయవాడ నగరపాలక సంస్థ అందరి సహకారాలతో మరింత పురోగతి …

Read More »

దోమల సమస్యను నిర్మూలించేందుకు విస్తృత చర్యలు చేపట్టాలి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : దోమల సమస్యను నిర్మూలించేందుకు విస్తృత చర్యలు చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఈట్ స్ట్రీట్, ఎంజీ రోడ్, డివి మేనర్ రోడ్, లబ్బీపేట ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యను నిర్మూలించాలని, అందుకు అనుగుణంగా విస్తృతమైన చర్యలు చేపట్టాలని ఆంటీ లార్వే ఆపరేషన్లు ప్రతినిత్యం జరుగుతుండాలని, ప్రతి ఫ్రైడే ఖచ్చితంగా …

Read More »

భారత్–న్యూజిలాండ్ మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరింది

– ఆర్థిక భాగస్వామ్యంలో నూతన అధ్యాయానికి నాంది : ఫియో అధ్యక్షుడు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ దూరదృష్టి గల నాయకత్వంలో, అలాగే న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్ మార్గదర్శకత్వంలో, కేంద్ర వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మరియు న్యూజిలాండ్ వాణిజ్య మంత్రి టాడ్ మెక్‌క్లే సన్నిహిత సహకారంతో, భారత్ మరియు న్యూజిలాండ్ కేవలం తొమ్మిది నెలల రికార్డు కాలంలో చారిత్రాత్మకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (FTA) విజయవంతంగా పూర్తి చేశాయి. ఈ …

Read More »