Breaking News

Daily Archives: December 24, 2025

పేదలకు నాణ్యమైన వైద్యంలో రాజీలేదు

-పీపీపీ విధానంపై ముందుకే… తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి -కేంద్ర మార్గదర్శకాల మేరకు విజీఎఫ్‌కు నిర్ణయం -వీజీఎఫ్‌ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 30 శాతం చొప్పున ఆర్ధిక మద్దతు -టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయండి -ఆదోని మెడికల్ కాలేజ్‌ నిర్మాణానికి ముందుకొచ్చిన సంస్థతో ఒప్పందం -వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు నాణ్యమైన మెడికల్ విద్యను, వైద్యాన్ని అందించే విషయంలో ఎక్కడా రాజీ పడేది, వెనక్కి తగ్గేది ఉండదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం …

Read More »

పది సూత్రాలే స్వర్ణాంధ్ర సాధనకు కీలకం

-సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు ప్రాధాన్యతాంశాలివే -20 లక్షల ఉద్యోగాల కల్పనకే మొదటి ప్రాధాన్యత -స్వర్ణాంధ్ర-2047, 10 సూత్రాల అమలుపై నోడల్ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సులో భాగంగా పౌరులకు మెరుగైన సేవలు వేగంగా అందించేందుకు ప్రతీ ప్రభుత్వ శాఖ ఇండికేటర్లను సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధన కోసం రూపొందించిన పది సూత్రాలను పది మిషన్లుగా నిర్దేశించుకుని పనిచేయాలని సీఎం సూచించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు, …

Read More »

నాగేశ్వరమ్మ కిచ్చిన మాట కోసం ఇప్పటం వెళ్ళిన ఉప ముఖ్యమంత్రి

-ఇప్పటంలో  ఇండ్ల నాగేశ్వరమ్మ  ఇంటికి పవన్ కళ్యాణ్  -యోగక్షేమాలు తెలుసుకుని… అండగా ఉంటానని భరోసా… -రూ. 50 వేల ఆర్థిక సాయం.. మనుమడి చదువులకు రూ. లక్ష అందజేత -నాగేశ్వరమ్మ పోషణకు తన జీతం నుంచి ప్రతి నెలా రూ. 5 వేలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘అమ్మా నీ పెద్ద కొడుకుని వచ్చా.. నిన్ను చూడడానికి వచ్చా.. బాగున్నావా.. నీ ఆరోగ్యం ఎలా ఉంది.. నాలుగు రోజులుగా నిన్ను చూసేందుకు వద్దామంటే ఆధికారిక కార్యక్రమాల వల్ల వీలుపడలేదు.. నీకిచ్చిన మాట …

Read More »

తిరుపతిలో ఐఐఎం ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రిని కోరిన ఎంపీ గురుమూర్తి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరంలో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్’ (ఐఐఎం) ఏర్పాటు చేయాలని తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలను విస్తరించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా తిరుపతిలో ఐఐఎం ఏర్పాటు చేయాలని ఆ లేఖలో ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఉన్నత విద్యను బలోపేతం చేయడం, ప్రాంతీయ సమతుల్య అభివృద్ధిని సాధించడం, …

Read More »

ఎల్‌వీఎం3-ఎం6 ప్రయోగం ఘన విజయం

-ఇస్రో శాస్త్రవేత్తలకు తిరుపతి ఎంపీ గురుమూర్తి అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎల్‌వీఎం3-ఎం6 రాకెట్ ప్రయోగం విజయవంతం అయిన సందర్భంగా తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు “ఎక్స్” ద్వారా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అత్యంత బరువైన పెలోడ్‌తో కూడిన బ్లూబర్డ్ బ్లాక్-2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టడం ద్వారా ఎల్‌వీఎం3 రాకెట్ మరో చారిత్రక మైలురాయిని సాధించిందని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం భారతదేశ శాస్త్రీయ, సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి మరోసారి చాటిందని, అంతరిక్ష …

Read More »

జనవరి 10, 11 తేదీలలో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ – 2026 ను విన్నూతంగా అందరిని ఆకర్షించేలా నిర్వహించాలి…

-జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ -ఫ్లెమింగో ఫెస్టివల్ కు ముఖ్య అతిథిగా హాజరు కానున్న గౌ. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు -క్లౌడ్ మేనేజ్మెంట్ పై పోలీస్ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 10, 11 తేదీలలో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ – 2026 ను విన్నూతంగా అందరిని ఆకర్షించేలా నిర్వహించాలీ అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు బుధవారం సాయంత్రం స్థానిక …

Read More »

రాత్రి పూట, మద్యం సేవించి వాహనాలు నడపవద్దు జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్

-మీడియా మిత్రులకు రోడ్డు భద్రతలో భాగంగా హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేసిన పోలీసు శాఖ : జిల్లా ఎస్.పి సుబ్బరాయుడు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాత్రిపూట, మద్యం తాగి వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోవద్దు అని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. రోడ్డుమీద చూస్తే చాలామంది హెల్మెట్లు లేకుండా ప్రయాణిస్తున్నారని అన్నారు. ఒకటిన్నర కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ బెంగళూరు వంటి మహానగరాలలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారు తప్పకుండా హెల్మెట్లు …

Read More »

వైకుంఠ ఏకాదశి దర్శనం కల్పించడంలో సామాన్య భక్తులకు పెద్ద పీట : జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్

-వైకుంట ఏకాదశి కి పటిష్ట బందోబస్తు -టికెట్లు కేటాయించిన భక్తులు సమయానికే దర్శనానికి రావాలి : జిల్లా ఎస్.పి సుబ్బారాయుడు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వైకుంఠ ఏకాదశి దర్శనం కల్పించడంలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుదువారం వైకుంట ఏకాదశి లో భాగంగా తీసుకున్న భద్రతా ఏర్పాట్ల పై జిల్లా ఎస్.పి తో కలిసి మీడియా మిత్రులతో మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ జిల్లా కలెక్టర్ …

Read More »

దయా గుణాన్ని ఇతరులకు పంచడమే క్రీస్తు సందేశం

-క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ -పాస్టర్లకు గౌరవ వేతనం – వారి అకౌంట్లకు రూ.50 కోట్లు జమ పూర్తి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దయా గుణాన్ని ఇతరులకు పంచడమే ఏసుక్రీస్తు సందేశమని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.క్రిస్మస్ పండుగ ప్రతీ ఒక్కరి ఇంటిలోనూ సంతోషాలు నింపాలని క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ బుధవారం అమరావతిలో ఒక ప్రకటన విడుదల చేశారు.ప్రేమ, త్యాగానికి ప్రతీకైన ఏసుక్రీస్తు బోధనలు ప్రతీ ఒక్కరికీ అనుసరణీయమన్నారు. …

Read More »

త్వరలోనే సినిమా టికెట్ రేట్లకు ఒకే జీవో ఉండేలా నిర్ణయం

-మంత్రి కందుల దుర్గేష్ -సామాన్యులకు భారం లేకుండా, సినీ పరిశ్రమకు మేలు జరిగేలా త్వరలోనే నిర్ణయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరదించుతూ, అన్ని సినిమాలకు వర్తించేలా ఒకే సమగ్ర జీవోను తీసుకురావాలని భావిస్తున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. బుధవారం సచివాలయంలో జరిగిన సినిమా టికెట్ ధరల హేతుబద్దీకరణ కమిటీ సమీక్షా సమావేశం అనంతరం మంత్రి దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. ప్రతి సినిమా బడ్జెట్‌ను బట్టి విడివిడిగా జీవోలు ఇచ్చే …

Read More »