-ప్రజలకు ఉపయోగపడేలా, ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా రుషికొండ ప్యాలెస్ ను వినియోగించాలని భావిస్తున్నాం -మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ -హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఇస్తే బాగుంటుందని చర్చించామని వెల్లడి -సీఆర్ జెడ్ నిబంధనల ప్రకారం రుషికొండపై ఉన్న 9 ఎకరాలకు గానూ 7 ఎకరాల్లో ఎలా నిర్మాణాలు చేయకూడదు..మిగిలిన 2 ఎకరాలు ఎలా వినియోగించాలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించాం -డిసెంబర్ 28న మరోసారి భేటీ.. కేబినెట్ దృష్టికి ప్రతిపాదనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడకుండా ప్రజా ప్రయోజనాలకు …
Read More »Daily Archives: December 24, 2025
విద్యా ప్రమాణాలు మెరుగుకు “మన బడి – మన బాధ్యత”
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల విద్యా ప్రమాణాలు మెరుగుకు గుంటూరు జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమం ప్రారంభించింది. ముఖ్యంగా తొమ్మిది, పదవ తరగతి విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి, ఉన్నత విద్యా, ఉద్యోగ అవకాశాలు పట్ల అవగాహన కల్పించడం తద్వారా పది పరీక్షలలో శత శాతం ఫలితాలు సాధించడం లక్ష్యంగా “మన బడి – మన బాధ్యత” కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో గల 185 ఉన్నత పాఠశాలలకు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించి ఆయా పాఠశాలల …
Read More »పాస్టర్లకు రూ.51 కోట్ల వేతన బకాయిలు చెల్లించాం
-క్రీస్తు మార్గం అందరికీ అనుసరణీయం -కుల, మతాలకు అతీతంగా అర్హులకు పథకాలు -సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : ఏసుక్రీస్తు అనుసరించిన మార్గం అందరికీ అనుసరణీయమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. బుధవారం నాడు అద్దంకి నియోజకవర్గం స్థాయిలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ ను కట్ చేసి క్రైస్తవులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అద్దంకి నియోజకవర్గ …
Read More »రహదారుల పునర్నిర్మాణానికి నిధులు తెచ్చేందుకు కృషి : యార్లగడ్డ
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం నియోజకవర్గంలో గోతులు పడి అద్వాన్నంగా ఉన్న రహదారుల పునర్నిర్మాణానికి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు తెలిపారు. మంగళవారం రాత్రి గన్నవరం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ ఇంజనీర్లతో అభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలోని రహదారుల పునర్నిర్మాణానికి సాస్కి నిధులు రూ.6.76 కోట్లు, ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ రూ. 3 కోట్లు మంజూరయినట్లు చెప్పారు. ఈ నిధులతో ముందుగా పూర్తిగా పాడైన రహదారులును …
Read More »గిరిజన ప్రాంత ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందుల సరఫరా
-పాడేరు కేంద్రంగా నిర్వహించేందుకు ప్రైవేట్ సంస్థతో వైద్య ఆరోగ్య శాఖ ఒప్పందం -వచ్చే నెలాఖరు నుంచి సేవలు ప్రారంభం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మారుమూల గిరిజన ప్రాంతాలకు అత్యవసర వైద్య సేవలను చేరువ చేసే లక్ష్యంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ “రెడ్ వింగ్” సంస్థతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా దూరప్రాంతాల్లోని ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందులు, బ్లడ్ యూనిట్స్ పంపిణీ చేసేందుకు వీలుగా ఈ ఒప్పందం జరిగింది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌లో విజయవంతంగా …
Read More »పి బి. సిద్ధార్థకి సౌత్ జోన్ ఫెస్ట్ ఫోక్ డ్యాన్స్ ప్రథమ బహుమతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 19 నుంచి 23 వరకు చెన్నైలోని హిందుస్థాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన 39వ అంతర విశ్వవిద్యాలయాల సౌత్ జోన్ యూత్ ఫెస్టివల్ పోటీల్లో ఫోక్ డ్యాన్స్ (జానపద నృత్యం) విభాగంలో కృష్ణా విశ్వవిద్యాలయం పక్షాన పాల్గొన్న విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించి జాతీయ పోటీలకు ఎంపిక కావడం పట్ల ప్రిన్సిపల్ డా. మేకా రమేశ్, డైరెక్టర్ …
Read More »ఈ నెల 27న కే ఎల్ యూనివర్సిటీ స్నాతకోత్సవం..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కే ఎల్ డీమ్డ్ యూనివర్సిటీ 15వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 27 వ తేదీన వడ్డేశ్వరంలోని వర్శిటీ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ జి. పార్ధ సారధివర్మ తెలిపారు. నగరంలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో బుదవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025 విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 5 వేల మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయనున్నట్లు తెలియచేశారు. ఇందులో 184 మంది పి. హెచ్. డి, 700 మందికి …
Read More »ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సమిష్టి కృషి అవసరం
-సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ఐఏఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాలల రూపురేఖలు మార్చడంలో సమిష్టి కృషితో పాటు, నాయకత్వ పాత్ర కీలకమని సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు IAS., అన్నారు. అకడమిక్, పరిపాలనా, పాఠ్యేతర అంశాల్లో నాయకత్వ నైపుణ్యాలను జోడించి, అభ్యసన ఫలితాలలో (Learning Outcomes) స్పష్టమైన మార్పు తీసుకురావాలని అన్నారు. విజయవాడలో SALT (Supporting Andhra’s Learning Transformation) బిల్డింగ్‌లో నిపుణుల సమక్షంలో NCSL (The National Centre for School Leadership) –NIEPA (National Institute …
Read More »పార్టీ ఆదేశానుసారం ఆఫ్కాఫ్ చైర్మన్ ను ఎన్నుకోవాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆఫ్కాఫ్ జిల్లా అధ్యక్షులతో పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్షించారు ఆఫ్కాఫ్ చైర్మన్ ఎన్నికలో పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని జిల్లా అధ్యక్షులు పాటించాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. ఈ మేరకు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆఫ్కాఫ్ జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మత్స్యకార కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. …
Read More »మా అజెండా సంక్షేమం..అభివృద్ధి..
– జగన్ అజెండా రప్పా రప్పా రక్తపాతం – రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కూటమి కట్టుబడి ఉంది – రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసి ప్రజలకు మేలు చేస్తాం – రాక్షసుల మాదిరి రక్తాభిషేకాలు సిగ్గు చేటు – జగన్ రెడ్డి లాంటి అరాచక శక్తుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ధి బాటలో నడిపించాలని ప్రయత్నిస్తుంటే.. జగన్ రెడ్డి అండ్ కో మాత్రం రాష్ట్రంలో …
Read More »
Prajavartha Online Telugu News