Breaking News

Daily Archives: December 26, 2025

భారత్ సూపర్ పవర్ కావడం ఖాయం

-వేల ఏళ్ల క్రితమే ప్రపంచానికి నాగరికత పరిచయం చేసిన దేశం మనది -సంస్కృతి-విజ్ఞానాలతో పరిఢవిల్లిన చరిత్ర మన సొంతం -సున్నాను ఆవిష్కరించాం…భవిష్యత్తులో మరెన్నో ఆవిష్కరణలు చేయాలి -దేశ సంస్కృతిని పరిరక్షిస్తూ… దేశాభివృద్ధికి ఆర్ఎస్ఎస్ చీఫ్ చేస్తున్న కృషి శ్లాఘనీయం -తిరుపతిలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ప్రారంభ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశం త్వరలోనే సూపర్ పవర్ కావడం ఖాయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ప్రారంభ సదస్సుకు సీఎం …

Read More »

రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణే

-రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే చూస్తూ ఊరుకోం -పోస్టర్లపై జంతు రక్తం చల్లి భయబ్రాంతులకు గురిచేసే సంస్కృతి ఏమిటి? -గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టిన పోలీసులకు అభినందనలు -అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రానికి తరలివచ్చే భక్తులకు భరోసాగా పోలీసులు -తిరుపతిలో నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్రతను కాపాడుతూ, భక్తులకు పూర్తి రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం …

Read More »

రాష్ట్ర మంత్రి నిర్వహించిన ప్రజాధర్బార్ కు విశేష స్పందన.

-16 ఫిర్యాదులకు పరిష్కార మార్గం చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు. -కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కారాలు. -రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి … ఏలూరు/నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు రాష్ట్రమంత్రి కార్యాలయంలో శుక్రవారం ప్రజాధర్భారు నిర్వహించి అర్జీలను రాష్ట్ర గృహ నిర్మాణ,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి 16 అర్జీలను స్వీకరించారు. కొన్నిటిని అక్కడికక్కడే అధికారులకు తక్షణ ఆదేశాలిచ్చి పరిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ప్రజాధర్బారులో వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిష్కారం …

Read More »

ప్రపంచంలో విద్య ఒక్కటే అభివృద్ధికి రాజమార్గం

-మాజీ పార్లమెంటు సభ్యులు సర్గీయ కొలుసు పెద రెడ్డయ్య ఛారిటబుల్ ట్రస్టు ద్వారా చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి “నారా లోకేష్ విద్యాఅమృతం” పేరిట శ్రీకారం -నియోజకవర్గంలో 32 ఉన్నత పాఠశాలలో 1836 విద్యార్థిని, విద్యార్థులకు 100 రోజులు పౌష్టికాహారం -నూజివీడు నియోజకవర్గంలో విద్యారంగానికి ఒక మైలురాయిగా నిలుస్తుంది -రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు/ఆగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శుక్రవారం తన తండ్రి మాజీ పార్లమెంటు సభ్యులు సర్గీయ కొలుసు పెద …

Read More »

నేటి తరం రాజకీయ నాయకులకు వాజ్ పాయి జీవితం ఆదర్శనీయం: యార్లగడ్డ

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : సుదీర్ఘ రాజకీయ జీవితంలో విలువలతో కూడిన రాజకీయం చేసిన వాజ్ పాయ్ లాంటి మహానుభావుడిని నేటి తరం రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పాయ్ శత జయంతి ఉత్సవాలు, భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమార్ స్వామి జన్మదినోత్సవాన్ని బిజెపి ఆధ్వర్యంలో రోటరీ ఆడిటోరియంలో శుక్రవారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే వెంకట్రావు …

Read More »

రంగా ఆశయాలు స్ఫూర్తిదాయకం

-సామినేని ఉదయభాను, గద్దె క్రాంతి కుమార్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : 17వ డివిజన్ రాణిగారితోట గుడ్ మార్నింగ్ టీ స్టాల్ వద్ద శుక్రవారం నాడు జనసేన నాయకులు గుండు రాము ఆధ్వర్యంలో దివంగత వంగవీటి మోహనరంగా 37వ వర్ధంతి కార్యక్రమం ఘనంగానిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జనసేన జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ పాల్గొని రంగా విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. …

Read More »

తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని చాటిచెప్పేలా “ఆవకాయ”  సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవం

-జనవరి 8 నుండి 10 వరకు విజయవాడ పున్నమి ఘాట్, భవానీ ఐల్యాండ్ లో నిర్వహణ.. ప్రవేశం ఉచితం -తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంతో పాటు, సమకాలీన సృజనాత్మక పద్ధతులకు పెద్దపీట గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని చాటిచెప్పేలా ప్రభుత్వం విజయవాడ వేదికగా జనవరి 8 నుండి 10 వరకు ఆవకాయ సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవం పేరిట వినూత్న సాంస్కృతిక కార్యక్రమం “ఆవకాయ” ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మరియు టీమ్‌వర్క్ ఆర్ట్స్ సంయుక్త …

Read More »

సారస్ – మినీ భారత సాంస్కృతిక, కళా సమ్మేళనం

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : సారస్ – మినీ భారత సాంస్కృతిక, కళా సమ్మేళనంగా నిర్వహించడం జరుగుతుందని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ అన్నారు. సారస్ (SARAS – Sale of Articles of Rural Artisans Society – సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ సొసైటీ) ప్రదర్శన శాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం కేంద్ర మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశం నలుమూలల నుండి …

Read More »

నేడు విభిన్న ప్రతిభావంతులకు స్పెషల్ గ్రీవెన్స్

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న ప్రతిభావంతులు, హిజ్రలు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం విభిన్న ప్రతిభావంతులకు స్పెషల్ గ్రీవెన్స్ ను నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి మరియు ఇన్ ఛార్జ్ జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు డి.దుర్గా భాయి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతీ నెల 4వ శనివారం కలెక్టర్ కార్యాలయంలో గ్రీవన్స్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారని చెప్పారు. జిల్లాలో విభిన్న ప్రతిభావంతులు …

Read More »

ఇ.సి.ఐ నెట్ లో మ్యాపింగ్ జరుగుతోంది

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నెట్ వర్క్ యాప్ లో ఓటర్ల మ్యాపింగ్ జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 46.96 శాతం మ్యాపింగ్ పూర్తి అయ్యిందని చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు – బహుజన సమాజ్ పార్టీ ఉపాధ్యక్షులు చిరతనగండ్ల వాసు, కాంగ్రెసు పార్టీ జిల్లా కార్యదర్శి బిళ్ళల సునీల్, తెలుగు దేశం ప్రతినిధి కంచెర్ల శివరామయ్య, వై.ఎస్.ఆర్ కాంగ్రెసు పార్టీ ప్రతినిధి కొరిటిపాటి ప్రేమ్ కుమార్, జనసేన పార్టీ …

Read More »