-జిల్లాలో గత ఆర్దిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం రుణాల మంజూరులో మూడు నుంచి నాలుగు రెట్లు వృద్ధి -రుణాల మంజూరులో ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు అద్భుతం -ప్రైవేటు బ్యాంకులు పనితీరు మెరుగుపరుచుకోవాలి -డీసీసీ, డీఎల్ఆర్ఎస్ సమావేశంలో గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకర్ల పాత్ర చాలా కీలకమని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రుణాలు మంజూరు అయ్యేలా బ్యాంకర్లు పనిచేయాలని గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ …
Read More »Daily Archives: December 26, 2025
ఇ.వి.యం గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఇ.వి.యం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శుక్రవారం తనిఖీ చేశారు. పీరియాడికల్ తనిఖీలలో భాగంగా జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, రాజకీయ పార్టీల ప్రతినిధులు – బహుజన సమాజ్ పార్టీ ఉపాధ్యక్షులు చిరతనగండ్ల వాసు, కాంగ్రెసు పార్టీ జిల్లా కార్యదర్శి బిళ్ళల సునీల్, తెలుగు దేశం ప్రతినిధి కంచెర్ల శివరామయ్య, వై.ఎస్.ఆర్ కాంగ్రెసు పార్టీ ప్రతినిధి కొరిటిపాటి ప్రేమ్ కుమార్, జనసేన పార్టీ ప్రతినిధి చట్టాల త్రినాథ్ లతో కలసి తనిఖీ చేసి సంతృప్తి …
Read More »లైఫ్ సర్టిఫికెట్ ను 1వ తేదీ జనవరి 2026 నుంచి 28వ తేదీ ఫిబ్రవరి 2026 లోపు అందచేయాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సంచాలకులు, ఖజానా మరియు లెక్కలు, మంగళగిరి వారి ఉత్తర్వులు మేరకు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ యెక్క లైఫ్ సర్టిఫికెట్ ను 1వ తేదీ జనవరి 2026 నుంచి 28వ తేదీ ఫిబ్రవరి 2026 లోపు మాత్రమే జీవన్ ప్రామాన్ అప్లికేషన్ ద్వారా కానీ జీవన్ ప్రమాన్ ఫేస్ అప్లికేషన్ ద్వారా కానీ సంబంధిత ఉప ఖజానా కార్యాలయము నందు సమర్పించవలసినదిగా యం.చంద్ర శేఖర్ రెడ్డి, జిల్లా ఖజానా అధికారి మరియు లెక్కలు శాఖ, గుంటూరు వారు తెలిపియున్నారు. …
Read More »రాష్ట్ర గవర్నర్ కు ఘన స్వాగతం
పెదనందిపాడు (గుంటూరు జిల్లా), నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా పెదనందిపాడుకు శుక్రవారం విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్, ప్రత్తిపాడు శాసన సభ్యులు డా.బూర్ల రామాంజనేయులు ఘన స్వాగతం పలికారు. పెదనందిపాడులో సుప్రీమ్ కోర్టు విశ్రాంత న్యాయమూర్తి లావు నాగేశ్వర రావు గృహానికి సతీసమేతంగా గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, డి.ఎస్.పి భానోదయ …
Read More »నగరంలో సైక్ సిద్ధార్థ్ చిత్ర యూనిట్ సందడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో సైక్ సిద్ధార్థ్ చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్రం ప్రమోషన్ లో భాగంగా భవానిపురం లోని బాక్స్ 22 క్రికెట్ ప్రాంగణంకు చిత్ర యూనిట్ విచ్చేసి సరదాగా హీరో హీరోయిన్ క్రికెట్ ఆడారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో శ్రీ నందు మాట్లాడుతూ తాను నిర్మాతగా తొలిసారి సైక్ సిద్ధార్థ్ చిత్రాన్ని నిర్మించడం జరిగిందని చెప్పారు. ఈ చిత్రంలో తాను సిద్ధార్థ్ క్యారెక్టర్ లో ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలియజేశారు. విజయవాడ నగరం నుంచి …
Read More »హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా ఉరుసు మహోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన సిపి ఎస్.వి.రాజ శేఖర బాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్.జిల్లా, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిది, కొండపల్లి పట్టణ పరిధిలో ఈ నెల 29 వ తేదీ నుండి 31 వ తేదీ వరకు నిర్వహించు హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా దర్గా 429వ ఉరుసు మహోత్సవ కార్యక్రమం సందర్బంగా ఆదిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపధ్యంలో కొండపల్లి మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు చేస్తున్న ఏర్పాట్లను ఈ రోజు నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ …
Read More »ఏపీసిసి ఆధ్వర్యంలో డాక్టర్ మన్మోహన్ సింగ్, శంకర్ దయాళ్ శర్మ, వంగవీటి మోహన రంగాకు ఘన నివాళి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీసిసి ఆధ్వర్యంలో ఈరోజు మాజీ దివంగత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రథమ వర్ధంతి, మాజీ భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ వర్ధంతి మరియు కాంగ్రెస్ పార్టీ దివంగత శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రజా సమస్యలపై నిరంతరం కుల, మత, వర్గ రహితంగా నాటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై, అలుపెరుగని పోరాటం సలిపిన మహా నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతి, కార్యక్రమాన్ని నిర్వహించి వారికి ఘన …
Read More »ప్రజల మాటలు ప్రజల బాటలో నిలిచి ప్రయాణించిన గొప్ప నాయకులు వంగవీటి మోహన రంగా
-రంగా ఉద్యమ వారసులుగా అనేక పోరాటాలు ఉద్యమాలు చేశాం. -రంగా వారసురాలిగా ఆశ కిరణ్ ప్రజాపక్షం నిలవాలి. -జనసేన పార్టీ నాయకులకు వంగవీటి మోహన రంగా అంటే గౌరవం లేదు. -వంగవీటి రాధా నల్ల కళ్లద్దాలు తీస్తే పేద సామాన్య వర్గాల వారు కనబడతారు. -కూటమి ప్రభుత్వం రంగా పేరు మీద స్మృతి వనం ఏర్పాటు చేయాలి. పోతిన వెంకట మహేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సితార సెంటర్ వద్ద వంగవీటి మోహన రంగా జంక్షన్ వద్ద రంగా చిత్రపటానికి పూలమాలలు …
Read More »పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో వంగవీటి రంగా కు నివాళులు..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా 37 వ వర్ధంతి వేడుకలు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రదాంజలి ఘటించారు. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా వంగవీటి మోహనరంగా పేద ప్రజలకు అండగా నిలిచారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రంగా పాటు పడ్డారని గుర్తు చేశారు.. రంగా ఆశయ సాధనే ఆయనకు ఘన నివాళి …
Read More »బీసీ విద్యార్థుల స్కాలర్ షిప్పులకు రూ.90.50 కోట్లు మంజూరు
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుతున్న బీసీ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025-26 విద్యా సంవత్సరంలో భాగంగా పీఎం యశ్వసి పథకం కింద రెండో విడతగా కళాశాల, పాఠశాల ఓబీసీ, ఈబీసీ, డీఎన్టీ విద్యార్థులకు స్కాలర్ షిప్పుల నిమిత్తం రూ.90.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు …
Read More »
Prajavartha Online Telugu News