Breaking News

Daily Archives: December 29, 2025

ఫిల‌దెల్ఫియా ఎ.జి చ‌ర్చ్ ను సంద‌ర్శించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్

-రెవ‌. చార్లెస్ పి.జాక‌బ్ కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం సితార సెంట‌ర్ వ‌ద్ద వున్న ఫిల‌దెల్ఫియా ఎ.జి చ‌ర్చ్ ను ఎంపీ కేశినేని శివ‌నాథ్ సోమ‌వారం సంద‌ర్శించారు. చ‌ర్చ్ కు విచ్చేసిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ కు పుష్ప‌గుచ్ఛం అందించి రెవ‌. చార్లెస్ పి.జాక‌బ్, రెవ‌.డా.ఫిలిప్ పి.జాక‌బ్ ఆత్మీయంగా స్వాగ‌తం ప‌లికారు. “సమాజంలో శాంతి, ఐక్యత, సేవా భావాన్ని పెంపొందించడంలో చర్చిల పాత్ర ఎంతో కీలకమైనది. ఫిలడెల్ఫియా ఎ.జి చర్చ్ చేస్తున్న సేవలు అభినందనీయం. …

Read More »

వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఫార్చ్యూన్ మురళి పార్క్ రోడ్, మదర్ తెరిసా జంక్షన్, పినమనేని పాలీ క్లినిక్ రోడ్, టిక్కెల్ రోడ్, జమ్మిచెట్టు సెంటర్, సాంబమూర్తి రోడ్ మ్యూజియం రోడ్డు, అజిత్ సింగ్ నగర్, ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎక్కడైనా వ్యర్ధాలు ఉన్నచో …

Read More »

అన్న క్యాంటీన్లో ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూసుకోండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్న క్యాంటీన్ లోకి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం అజిత్ సింగ్ నగర్ వద్ద గల అన్న క్యాంటీన్ ను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడున్న ప్రజలతో స్వయంగా తానే మాట్లాడి ఆహార నాణ్యత, అన్న క్యాంటీన్లో ఉన్న వసతుల పై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్లో భోజనం చేసే ప్రజలకు ఇబ్బంది …

Read More »

అర్జీలు త్వరగా పరిష్కరించాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర -పీజీఆర్ఎస్ ద్వారా 18 అర్జీలు స్వీకరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అర్జీదారులు తెలియజేసిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి.. సత్వర పరిష్కారాన్ని అందించేలా చర్యలు చేపట్టాలని కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ. సమస్యలపై వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. పరిష్కారమైన సమస్యలతో అర్జీదారులు సంతృప్తి చెందాలని, ఎట్టిపరిస్థితిల్లో అర్జీలు పునరావృతం …

Read More »

రాజకీయ కోణంలోనే ఇష్టానుసారంగా జిల్లాల పునర్విభజన

-మంత్రి మండిపల్లి మాటకు విలువేదీ? -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనను రాజకీయ కోణంలో ఇష్టానుసారంగా ముక్క చెక్కలుగా మార్చడం సరికాదని, ఇది స్థానిక ప్రజల మనోభావాల్ని కించపర్చడమేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తప్పుపట్టారు. ఈ మేరకు నేడు ఈశ్వరయ్య నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని జిల్లాలను కూటమి ప్రభుత్వం తాజాగా 28 జిల్లాలకు పెంచుతూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా కొన్ని జిల్లాలకు సంబంధించి …

Read More »

ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో భారీ అక్రమాలు: స్వతంత్ర విచారణ కోరుతూ CPI ఫిర్యాదు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు–2025 నిర్వహణలో తీవ్రమైన చట్టవిరుద్ధ చర్యలు, విస్తృత అక్రమాలు మరియు పారదర్శకత లోపించిందని ఆరోపిస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య రిటర్నింగ్ ఆఫీసర్‌, ఆయుష్ శాఖ డైరెక్టర్ కోతమాసు దినేష్ కుమార్, ఐఏఎస్‌కు, అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికల్లో జరిగిన అక్రమాలు కేవలం కొందరు అభ్యర్థులకు అన్యాయ లాభం చేకూర్చడమే కాకుండా, ప్రజాస్వామ్య సంస్థగా ఉన్న ఫార్మసీ కౌన్సిల్‌పై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయని …

Read More »

మైక్రోసాఫ్ట్ ఉపాధ్యక్షులు జితేంద్రకుమార్ కి సిద్ధార్థ సత్కారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువత విజయం మీద కాకుండా నేర్చుకోవడంపై దృష్టి నిలపాలని, ఎప్పటికప్పుడు నూతన నైపుణ్యాలు పెంపొందించుకునే వారినే శరవేగంగా విస్తరిస్తున్న భారత ఆర్థికవ్యవస్థలో అపార అవకాశాలు వరిస్తాయని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయం (అమెరికా) వైస్ ప్రెసిడెంట్, అజ్యూర్ ఎ.ఐ. హెడ్, సిద్ధార్థ పూర్వ విద్యార్థి  వీరమాచనేని జితేంద్రకుమార్ అన్నారు. సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవ కార్యక్రమంలో భాగంగా సోమవారం కళాశాలలోని వెబినార్ హాలులో ఇలస్ట్రియస్ సిద్ధార్థియన్ పేరుతో జితేంద్రకుమార్ కు ఘనసత్కారం జరిగింది. సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ …

Read More »