-మచిలీపట్నంలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో గోదాము నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రైతుకు మెరుగైన ఆదాయం కల్పించినపుడే అసలైన అభివృద్ధి సాకారమైనట్లు అని రాష్ట్ర గనులు, భూర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో ఏపీ మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన రెండు గోదాముల నిర్మాణానికి భూమిపూజ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం …
Read More »Monthly Archives: December 2025
7 సెకండరీ ఆసుపత్రుల్లో తొలిసారిగా టిఫా స్కానింగ్ సౌకర్యం
-గర్భస్థ శిశువుల్లోని లోపాల గుర్తింపునకు వీలు -రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి -ఒక్కొక్క దానికి రూ. 30.48 లక్షల చొప్పున రూ.2.13 కోట్ల వ్యయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గర్భిణిలు, శిశు సంరక్షణ చర్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వం తొలిసారిగా రాష్ట్రంలోని 7 సెకండరీ అసుపత్రుల్లో ‘టిఫా’ (Targeted Imaging for Fetal Anomalies-TIFFA) స్కానింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. నర్సీపట్నం, తుని, నందిగామ ఏరియా ఆసుపత్రుల్లో, ఒంగోలులోని ఎంసీహెచ్ (మాతా, శిశు వైద్యశాల), పార్వతీపురం, …
Read More »కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అధిక ప్రాధాన్యతనిస్తుంది…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి నూతనంగా అధ్యక్షులుగా నియమితులైన పిల్లి మాణిక్యాలరావు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు పని చేయాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని) అన్నారు. తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు సోమవారం మేయర్ ను నగర పాలక సంస్థలోని ఆయన ఛాంబర్ నందు మర్యాదపూర్వకంగా కలవగా, మేయర్ ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, …
Read More »పన్నువసూళ్లకు ప్రత్యేక శ్రద్ధ చూపాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థకు బకయిబ్ ఉన్న పన్నువసూళ్లకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, మొండి బకాయిదారుల ఇళ్లు, కమర్షియల్ సంస్థలకు ట్యాప్, డ్రైనేజి కనెక్షన్ లు తొలగించాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, అధికారులకు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో రెవెన్యూ విభాగ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత వార్డ్ సచివాలయాల వారీగా ఉన్న అసెస్మెంట్లు, బకాయిలు, రోజువారీ వసూళ్లు చేయాల్సిన లక్ష్యంపై సమీక్షించి, పన్ను …
Read More »ఫిర్యాదులపై యాక్షన టేకెన్ రిపోర్ట్ తో అధికారులు హాజరు కావాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్ కు గత వారం అందిన ఫిర్యాదులపై యాక్షన టేకెన్ రిపోర్ట్ తో అధికారులు హాజరు కావాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు విభాగాధిపతులకు స్పష్టం చేశారు. సోమవారం డయల్ యువర్ కమిషనర్, నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో జరిగిన పిజిఆర్ఎస్ జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డయల్ యువర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి అందిన 24 ఫిర్యాదులు తీసుకొని, అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి …
Read More »పారిశుధ్య పనుల్లో భాగంగ మధ్యాహ్నం సమయంలో తప్పనిసరిగా డ్రైన్ల శుభ్రం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో పారిశుధ్య పనుల్లో భాగంగా మధ్యాహ్నం సమయంలో తప్పనిసరిగా డ్రైన్ల శుభ్రం చేయాలని, డ్రైన్లపై ఆక్రమణలను తక్షణం తొలగించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. సోమవారం రైల్ పేట, సాంబశివపేట ప్రాంతాల్లో పర్యటించి రోడ్ ఆక్రమణలను, పారిశుధ్య పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాల, రైల్వే స్టేషన్ వంటి రద్దీ ప్రాంతాల్లో డ్రైన్లను, రోడ్లను ఆక్రమణ …
Read More »హలో బీసీ – చలో విజయవాడ
-బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బీసీ హక్కుల కోసం విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆందోళన -మేమెంతో మాకంత అనే నినాదంతో మార్మోగిన విజయవాడ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బీసీ హక్కుల కోసం గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద సోమవారం హలో బీసీ చలో విజయవాడ ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జేఏసీ అధ్యక్షులు జై ఆంధ్ర జయబాబు రావడం జరిగింది. జయబాబు మాట్లాడుతూ బీసీలకు రావాల్సిన అన్ని న్యాయపరమైన హక్కులు …
Read More »ఆదాయం కాదు… ఆరోగ్యకరమైన వృద్ధి సాధించాలి
-లాటరీ విధానం, రిటైలర్ మార్జిన్ పెంపుపై పున:పరిశీలన -ప్రతీ మద్యం బాటిల్ పైనా ప్రత్యేక గుర్తింపు నెంబర్ -బెల్టు షాపుల నియంత్రణకు హర్యానా మోడల్‌పై అధ్యయనం -ఎక్సైజ్ శాఖపై సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు నిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మద్యం విధానాన్ని వ్యాపారంలా చూడకుండా, ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారులకు సూచించారు. ఆదాయమే లక్ష్యంగా విధానాలు ఉండకూడదని, మద్యాన్ని కూడా ఒక ఉత్పత్తిలానే పరిగణించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం అనుసరిస్తున్న లాటరీ …
Read More »తరుచూ తాగునీటి పరీక్షలు చేపట్టాలి
-మూడు రీజియన్లల్లో డీ-ఎడిక్షన్ సెంటర్లు -ప్రజల కోణంలో ఆలోచించే ప్రభుత్వ సేవలందించాలి -ఆర్టీజీ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల కోణంలో ఆలోచించేలా అధికారులు వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. క్షేత్ర స్థాయిలో అందుతున్న సేవలు ఏ విధంగా అందుతున్నాయనే అంశంపై ఆరా తీశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధికారులకు పలు …
Read More »దుబాయ్‌లో సెమీ క్రిస్మస్ వేడుకలు
-పాల్గొన్న టి.డి.జనార్ధన్, నిమ్మల రామానాయుడు దుబాయ్, నేటి పత్రిక ప్రజావార్త : దుబాయ్‌లో తెలుగుదేశం పార్టీ అభిమానులు సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రత్యేక అతిధులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదలశాఖా మంత్రి నిమ్మల రామానాయుడు తెలుగుదేశం పార్టీ పోలిట్యూరో సభ్యులు, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టి.డి. జనార్ధన్ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో తెలుగు కుటుంబాల వారు పాల్గొన్న ఈ వేడుకలో ముందుగా క్రిస్మస్ కేక్‌ను కట్ చేశారు. ఆ తర్వాత వక్తలు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో …
Read More »
Prajavartha Online Telugu News