-గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం ప్రాధాన్యంగా తీసుకున్నాము -పంచాయతీరాజ్ సిబ్బంది శిక్షణలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచాము -కలెక్టర్ల చొరవతో పల్లె పండుగ 1.0ను నిర్దేశిత గడువులోగా పూర్తి చేశాము -5వ కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్లు నిబద్ధతతో పని చేస్తూ కూటమి ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారు. గిరిజన …
Read More »Monthly Archives: December 2025
మారిస్ స్టెల్లా కళాశాలలో ఘనంగా ఫ్లోరి ఎక్స్‌పో
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని మారిస్ స్టెల్లా కళాశాలలో జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా ఫ్లోరి ఎక్స్‌పోను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రీసైక్లింగ్ నమూనాలు, లైవ్ వర్కింగ్ మోడల్స్ మరియు వినూత్న వ్యవసాయ ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సిస్టర్ ఇన్యాసమ్మ మాట్లాడుతూ, ఇలాంటి ఎక్స్‌పోలు విద్యార్థుల్లో ఉద్యమాత్మక దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు వ్యవసాయ రంగంపై అవగాహనను మెరుగుపరుస్తాయని తెలిపారు. హెచ్.ఓ.డి డా. లక్ష్మణ స్వామి ఫ్లోరి ఎక్స్‌పో లక్ష్యాలు మరియు ప్రస్తుత వ్యవసాయ …
Read More »అమరావతి గ్రోత్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ అధికారి SVR శ్రీనివాస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి గ్రోత్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(AGICL) ఎండీగా నియమితులైన రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ అధికారి SVR శ్రీనివాస్(శొంఠి వెంకట రత్న శ్రీనివాస్) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని రాయపూడి APCRDA ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు ఆయన రెండో ఫ్లోర్‌లోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. AGICL ఎండీగా నియమితులైన SVR శ్రీనివాస్‌కు పలువురు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. 👉SVR శ్రీనివాస్ నేపథ్యం: 1989 ఐ.ఏ.ఎస్ బ్యాచ్‌కు చెందిన SVR శ్రీనివాస్ మహారాష్ట్ర క్యాడర్‌కు …
Read More »ఏ.పి.జే.ఏ.సి. అమరావతి మహిళా విభాగం క్యాపిటల్ యూనిట్ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక
-చైల్డ్ కేర్ లీవ్‌పై ప్రభుత్వం జారీ చేసిన చారిత్రాత్మక జి.ఓ. ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏ.పి.జే.ఏ.సి. అమరావతి మహిళా విభాగం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలలో జిల్లా కార్యవర్గాలు, అలాగే ఆయా జిల్లాలలో డివిజన్ కార్యవర్గాలను ఏర్పాటు చేసుకొని, మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ దిశగా పటిష్టంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఈరోజు విజయవాడలోని రెవెన్యూ భవనంలో రాష్ట్ర విభాగాధిపతుల (హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కార్యాలయాలు) కార్యాలయాలలో పనిచేస్తున్న మహిళా …
Read More »మహిళా క్రికెటర్ శ్రీచరణికి భారీ నగదు ప్రోత్సాహకం
-రూ.2.5 కోట్ల చెక్ అందజేసిన మంత్రి నారా లోకేష్ -పాల్గొన్న క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడు, ఎండి భరణి, స్పెషల్ సిఎస్ అజయ్ జైన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా క్రికెటర్ శ్రీచరణికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నగదు ప్రోత్సాహకంగా రూ.2.5 కోట్ల చెక్ ను రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని శ్రీచరణిని అభినందించారు. క్రీడల్లో మహిళలు …
Read More »ఆంధ్ర యువ సంకల్ప్ 2k25 ముగింపు కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్‌కు ఆహ్వానం పలికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
-ఈ నెల 20న KLU యూనివర్సిటీలో డిజిటల్ మారథాన్ ముగింపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఆంధ్ర యువ సంకల్ప్ 2k25” డిజిటల్ మారథాన్ ముగింపు కార్యక్రమాన్ని ఈ నెల 20న KLU యూనివర్సిటీలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనాలని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ని మంత్రి మండిపల్లి ఆహ్వానించారు. యువత ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తూ …
Read More »స్కేటర్ అమృతకు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి అభినందనలు
-జాతీయ రోలర్ స్కేటింగ్‌లో విశాఖ అమ్మాయికి బంగారు పతకం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ వేదికగా ఈ నెల 7 నుంచి 8 వరకు నిర్వహించిన 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలలో విశాఖపట్నానికి చెందిన స్కేటర్ V.అమృత బంగారు పతకం సాధించడం అభినందనీయమని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కొనియాడారు. విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో అమృతను అభినందించారు. రోలర్ డౌన్ హిల్ ఆల్పైన్ విభాగంలో అమృత బంగారు, కాంస్య పతకాలు సాధించడం ప్రశంసనీయం అని …
Read More »సహజ పద్ధతులతో మహిళల జీవనోపాధి మెరుగుదలకు శిక్షణ
-ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో వేప, తేనె ఉత్పత్తులపై 3వ రోజు నైపుణ్య శిక్షణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించాలనే లక్ష్యంతో సహజ పద్ధతుల ద్వారా జీవనోపాధి అవకాశాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో సహజ సాగు, తేనెటీగల పెంపకం, ఆవుపేడ ఆధారిత ఉత్పత్తులు, బయో–ఇన్‌పుట్స్ తయారీ వంటి అంశాలపై ప్రాక్టికల్‌తో కూడిన అవగాహన అందించారు. ఎంపీ కేశినేని శివనాథ్ సారధ్యంలో, కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాదు ఎన్.ఐ.ఆర్.డి …
Read More »ఎస్.హెచ్.జి మహిళల స్వయం ఉపాధికి ఎంపీ కేశినేని శివనాథ్ తోడ్పాటు : ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
-ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి కి బయలు దేరిన 4వ బ్యాచ్ -ఎన్టీఆర్ జిల్లా ఎస్.హెచ్.జి మహిళ లు 35 మందితో హైదరాబాద్ ఎన్. ఐ. ఆర్. డి. కి బయలుదేరిన బస్సు -జెండా ఊపి బస్సు ప్రారంభించిన నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య -ఎన్.ఐ.ఆర్.డి లో కేశినేని ఫౌండేషన్ , ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల శిక్షణ -బ్రిక్స్ తయారీ పై శిక్షణ పొందనున్న 35 మంది ఎస్.హెచ్.జి మహిళ లు నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »విజయవాడ జనరల్ ఆసుపత్రి అభివృద్ధి దిశగా ఎంపీ కేశినేని శివనాథ్ అడుగులు
-రూ.2 కోట్ల 80 లక్షలు సీఎస్ఆర్ నిధులు తెచ్చేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ కృషి -కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో ఎంపీ కేశినేని శివనాథ్ భేటీ -ఆ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సీఎస్ఆర్ నిధులు ఇప్పించాలని విజ్ఞప్తి -సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి హార్దీప్ సింగ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంపీ కేశినేని శివనాథ్ కృషి తో విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి రూపురేఖలు మారనున్నాయి. విజయవాడ జీజీహెచ్ …
Read More »
Prajavartha Online Telugu News