Breaking News

Monthly Archives: January 2026

సైకిల్ కు ఓటేశారు…అభివృద్ధికి చోటిచ్చారు

-ప్రజా సంక్షేమమే కూటమికి పరమావధి -అభివృద్ధి కార్యక్రమాలకు కుప్పమే ప్రయోగశాల -2026లో రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు అమలు -ల్యాండ్ టైట్లింగ్ లాంటి నల్లచట్టం తెచ్చి గొప్పచట్టం అని చెప్పుకుంటున్నారు -నివాసం నుంచి ప్రజావేదిక వరకూ ఇ-సైకిల్ తో ర్యాలీగా వచ్చిన సీఎం -24 గంటల్లో 5555 ఇ-సైకిళ్ల పంపిణీతో కుప్పానికి గిన్నీస్ రికార్డు -కుప్పంలో పేదల సేవలో కార్యక్రమం ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ఎన్నికల్లో సైకిల్ కు ఓటేసి ప్రజలు అభివృద్ధికి చోటిచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు …

Read More »

ఆర్థిక అసమానతలు తగ్గేలా కూటమి ప్రభుత్వ విధానాలు

-పేదలు ఎదగాలి… పారిశ్రామికవేత్తలు కావాలి -ఎంఎస్ఎంఈలు స్థాపించే డ్వాక్రా మహిళలకు బ్యాంకర్ల సహకారం అవసరం -వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు సమావేశం కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : పేదల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు.. వారిని అన్ని విధాలా అభివృద్ధి చేసేలా కూటమి ప్రభుత్వ విధానాలు ఉంటాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కుప్పంలో రెండో రోజు పర్యటనలో భాగంగా శనివారం వివిధ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పథకాల లబ్దిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖీ …

Read More »

ఒప్పందం చేసుకున్న ప్రతీ ప్రాజెక్టుపైనా ప్రత్యేక శ్రద్ధ

-సరైన సమయంలో పరిశ్రమలు పూర్తైతేనే అందరికీ ప్రయోజనం -స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో అనుమతులు -కుప్పంలో రూ.7,684 కోట్ల పెట్టుబడితో 21 పరిశ్రమల ఏర్పాటు -ఆరు కొత్త పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు ఎంఓయూలు -కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో పరిశ్రమల పురోగతిపై సీఎం చంద్రబాబు సమావేశం కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఒప్పందం చేసుకున్న ప్రతీ ప్రాజెక్టుపైనా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎంఓయూ చేసుకుంటే అది ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి …

Read More »

కేజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యంతో నా బిడ్డను కోల్పోయాను

-బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై విచారణ జరిపి చర్యలు తీసుకోండి -విశాఖ విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ కి మహిళ వినతి -మహిళ ఫిర్యాదుపై తక్షణం స్పందించిన ఉప ముఖ్యమంత్రి -సోమవారం బాధిత కుటుంబాన్ని సచివాలయంలోని కార్యాలయానికి దగ్గరుండి తీసుకురావాలని అధికారులకు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం కేజీహెచ్ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా గర్భంలోనే తన శిశువు మృతి చెందిందని ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణం స్పందించారు. బాధిత మహిళను కుటుంబంతో సహా …

Read More »

మొదలైన కింగ్ పిన్స్ వేట

-ఎర్ర చందనం స్మగ్లర్లు… వారి వెనక ఉన్నవారిపై ఉక్కు పాదం మోపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆదేశాలు -అంతర్జాతీయ ఎర్రచందన స్మగ్లర్ ముజామిల్ అరెస్ట్ -⁠ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళాన్ని అభినందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ మొహమ్మద్ ముజామిల్ ను ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం అరెస్టు చేసింది. ఈ కింగ్ పిన్ ఎర్రచందనం దుంగలను లైసెన్స్ పేరు చెప్పి అక్రమంగా చైనాకి తరలించేవాడు. …

Read More »

వైసీపీని ఎన్నికల సంఘం బ్యాన్ చేయాలి

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైసీపీ నాయకులు రౌడీల్లా, అంబోతుల్లా పెట్రేగి పోతున్నారని, వారికి తల్లులున్నా, చెల్లెలన్నా, మహిళలన్నా గౌరవం లేదని, తక్షణమే ఆ పార్టీని ఎన్నికల సంఘం బ్యాన్ చేయాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కోరారు. సీఎం చంద్రబాబు మాతృమూర్తిని అంబటి రాంబాబు దూషించడం క్షమించరాని నేరమన్నారు. తక్షణమే ఆయన్ను అరెస్టు చేయాలన్నారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన …

Read More »

జగన్ హయామంతా కల్తీయే

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్ -మద్యం కల్తీ చేసి అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న జగన్ -కల్తీతో తిరుపతి ప్రసాదం అపవిత్రం -వైసీపీకి ఎప్పుడో ప్రజలు పాడె కట్టేసి శవయాత్ర జరిపించేశారు -పాదయాత్ర కాదు పొర్లు దండాలు పెట్టిన జగన్ అధికారంలోకి రాలేడు : మంత్రి సవిత -శ్రీసత్యసాయి జిల్లా వడిగేపల్లిలో పెన్షన్ల పంపిణీ -రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి మంత్రి సవిత భూమి పూజ గోరంట్ల/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త : జగన్ హయాంలో అన్ని కల్తీలే జరిగాయని, …

Read More »

వైసీపీ నేత అంబటి రాంబాబు సీఎంను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఆరోగ్య, వైద్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ శనివారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వ పాలన పనితీరు అద్భుతంగా ఉండటాన్ని చూసి వైసీపీ వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. “నిత్యం అహం భావంతో వ్యవహరించే అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు ను ఉద్దేశించి మాటల్లో చెప్పలేని విధంగా ఉపయోగించిన పదజాలo అత్యంత హేయం, జుగుప్సాకరం. అంబటి వ్యాఖ్యలు ఆ పార్టీ నైజానికి, నేతల వికృత చర్యలు అహంకారం, పరాకాష్టకు నిదర్శనం. అంబటికి ప్రజాస్వామ్య …

Read More »

కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీది అసత్యప్రచారం

-తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు -తిరుమల పవిత్రతకు వైసీపీ భంగం కలిగించింది -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగన్ రెడ్డి అవినీతి మూలాల్లోంచి పుట్టిన పార్టీ వైసీపీ అని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విమర్శించారు. శనివారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భీమవరం లోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన …

Read More »

పింఛన్ల పంపిణీకి ఏటా రూ. 33 వేల కోట్లు ఖర్చు

-63 లక్షల మందికి ప్రతీ నెల పింఛన్ల పంపిణీ -సోలార్ తో విద్యుత్ ఆదా, పర్యావరణ పరిరక్షణ -భీమవరం పర్యటనలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : భీమవరం పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ, ప.గో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. తొలుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒక్క రోజు ముందే ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. భీమవరం పర్యటనలో భాగంగా …

Read More »