– ఆధునిక సాంకేతికత, రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు – కొత్త సంవత్సరం, సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ – రైతుల తరఫున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశానికే ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య వ్యవస్థను మరింత పారదర్శకంగా, రైతుల శ్రేయస్సు లక్ష్యంగా తీర్చిదిద్దుతోందని.. ఆధునిక సాంకేతికత అనుసంధానంతో భూమి యాజమాన్య హక్కు పత్రం, పట్టాదారు పుస్తకాలను రాజముద్రతో అందిస్తోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. …
Read More »Daily Archives: January 2, 2026
కాంట్రాక్టర్ ఏజెన్సీలకు వృత్తిపరమైన ఆరోగ్యం, భద్రత మరియు కార్మిక నిర్వహణపై శిక్షణా కార్యక్రమం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) ఆధ్వర్యంలో వృత్తిపరమైన ఆరోగ్యం & భద్రత (OHS) మరియు కార్మిక నిర్వహణపై శుక్రవారం మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:45 వరకు ఏపీసీఆర్‌డీఏ ఏవీ సెమినార్ హాల్‌లో ఒక అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. నిర్మాణ ప్రాంతాలలో భద్రతా సంస్కృతిని బలోపేతం చేయడం, చట్టబద్ధమైన కార్మిక నిబంధనలను అమలు చేయడం మరియు ప్రామాణిక నిర్వహణ విధానాలను (SOPs) పటిష్టం చేయడంలో భాగంగా కెపాసిటీ బిల్డింగ్ టీమ్ సభ్యులు …
Read More »శంకర్ విల్లాస్ బ్రిడ్జ్ పనులు నిర్ణీత కాల వ్యవధిలోనే పూర్తవుతాయి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరులో నిర్మితమవుతున్న శంకర్ విల్లాస్ బ్రిడ్జ్ పనులు నిర్ణీత కాలవ్యవధిలోనే పూర్తవుతాయని కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. పెమ్మసాని మాట్లాడుతూ… బ్రిడ్జ్‌కు సంబంధించి GGH వైపు నిర్మాణంలో భాగంగా 9 పిల్లర్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని, తాను స్వయంగా ఈ ప్రాంతాన్ని పరిశీలించామని తెలిపారు. అవసరమైన టెక్నికల్ క్లియరెన్సులు ఇప్పటికే పొందామని, సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి మరో రెండు మూడు రోజుల్లో తుది అనుమతి రానుందని చెప్పారు. క్లియరెన్స్ వచ్చిన …
Read More »రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ సక్రంగా జరగాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రెవెన్యూ సంబంధిత సమస్యలను వీలైనంత వరకూ తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ఈ నెల 2 నుండి 9 వరకూ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నందున ఆ పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరిగేలా జిల్లా కలక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలక్టర్లను ఆదేశించారు. రైల్వే అండర్ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వేకు సంబంధించి పెండింగ్ భూసేకరణ కేసులకు సంబంధించిన అంశాలు, పట్టాదారు …
Read More »పొగాకు రైతుల సంక్షేమానికి, అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ పొగాకును ప్రోత్సహించడానికి టుబాకో బోర్డ్ కృషి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పొగాకు బోర్డు కేవలం నియంత్రణ సంస్థగానే కాకుండా పొగాకు, రైతుల సంక్షేమానికి, అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ పొగాకును ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుందని టుబాకో బోర్డు చైర్మన్ యస్వంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు లోని శ్రీ కన్వెన్షన్ లో జరిగిన పొగాకు బోర్డు వ్యవస్థాపక దినోత్సవం మరియు స్వర్ణ జయంతి వేడుకలలో పొగాకు బోర్డు చైర్మన్ యస్వంత్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ, ఐసీఎఆర్ – ఎన్ఐఆర్సీఎ డైరెక్టర్ డా. ఎం …
Read More »పట్టణానికి ప్రముఖుల రాక
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు పట్టణానికి పలువురు ప్రముఖులు రానున్నారు. మారిషస్ అధ్యక్షులు ధరమ్ బీర్ గోకుల్ (Dharambeer Gokhool, Hon’ble President of the Republic of Mauritius) ఈ నెల 3వ తేదీన పట్టణానికి రానున్నారు. 4వ తేదీ ఉదయం 10.30 గంటలకు బొమ్మిడాల నగర్ శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్ లో ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహిస్తున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొంటారు. ఒడిశా గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు 3వ తేదీ సాయంత్రం 4.45 …
Read More »పట్టాదారు పుస్తకాల పంపిణీ
-జనవరి 2 వ తేది నుండి 9 వరకు గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహించి పంపిణీ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశ వ్యాప్తంగా భూ రికార్డులను డిజిటలైజ్ చేసి, కేంద్ర ప్రభుత్వ రిపాజిటరీలో భద్రపరచే విధానాన్ని అమలు చేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పట్టా పాస్‌బుక్స్ అనేది దశాబ్దాలుగా కొనసాగుతున్న కార్యక్రమమని, ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రధాన కారణం భూ రికార్డుల వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలేనని తెలిపారు.శుక్రవారం కలెక్టరేట్ లోని ఎస్.ఆర్. శంకరన్ సమావేశ …
Read More »సారస్ జాతీయ స్థాయి కార్యక్రమం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సారస్ (SARAS – Sale of Articles of Rural Artisans Society – సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ సొసైటీ) జాతీయ స్థాయి కార్యక్రమం అని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. సారస్ వేదికను శుక్రవారం ఉదయం జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సారస్ ప్రదర్శన జనవరి 6వ తేదీ నుండి 18వ తేదీ వరకు గుంటూరులో …
Read More »అన్నక్యాంటీన్లలో పరిశుభ్రత పాటించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్నక్యాంటీన్లలో పరిశుభ్రత పాటించాలని, ఆహారం సరఫరా అనంతరం శుభ్రం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. శుక్రవారం బస్టాండ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో ఆహారం తీసుకునేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని, కొందరు క్యాంటీన్ లోపల స్థలం సరిపోక కాంపౌండ్ లోపల కూర్చొని భోజనం చేస్తున్నందున పరిసరాలను …
Read More »అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన ప్రథమ కర్తవ్యమని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. రాజకీయాలు కేవలం ఎన్నికల సమయానికే పరిమితమని, గెలిచిన తర్వాత కేవలం అభివృద్ధిపైనే తన దృష్టి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం గన్నవరం మండలంలోని కొత్తగూడెం, తెంపల్లె గ్రామాల్లో ఆయన పర్యటించారు. ‘పల్లె పండుగ 2.0’ కార్యక్రమంలో భాగంగా రూ.85 లక్షల వ్యయంతో నిర్మించిన రెండు సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను ఆయన ప్రారంభించారు. …
Read More »
Prajavartha Online Telugu News