Breaking News

Daily Archives: January 3, 2026

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 

-ఆలయం వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం తమ ఇలవేల్పు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి పూర్వకంగా ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం 2024లో పవన్ కళ్యాణ్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంలో కొండగట్టు అంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం …

Read More »

సమష్టిగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేద్దాము

-గిరి ప్రదక్షిణ మార్గం సాకారం కావాలి -మీరు పనులు మొదలుపెడితే స్వయంగా వచ్చి కరసేవ చేస్తా -ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించిన టీటీడీకి ధన్యవాదాలు -కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : “ఆంజనేయస్వామి అందరి దేవుడు, విశ్వాంతర్యామి. ఆయన ఓ ప్రాంతానికి మాత్రమే దేవుడు కాదు. మా ఇలవేల్పు ఆంజనేయ స్వామి వారికి సేవ చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కొండగట్టు శ్రీ …

Read More »

పెట్టుబ‌డుల‌కు గ‌మ్య‌స్థానంగా ఏపీ.. రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్

-సీఎం చంద్ర‌బాబు నాయుడు, మంత్రి లోకేష్ నాయ‌క‌త్వంతోనే ఇది సాధ్యం -సంక్షేమం, అభివృద్ధి బ్యాలెన్స్ చేస్తూ పాల‌న సాగిస్తున్నాం క‌ర్నూల్, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో పెట్టుబ‌డుల‌కు గ‌మ్య‌స్థానంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ మారిపోయింద‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. క‌ర్నూల్లోని ఆయ‌న కార్యాల‌యంలో మంత్రి మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ బరోడా సీ.ఎం.ఐ.ఈ డేటా ఆధారంగా విడుదల చేసిన నివేదిక‌లో దేశవ్యాప్తంగా గ‌త తొమ్మిది నెలల్లో వ‌చ్చిన పెట్టుబ‌డుల్లో 25.3 శాతం వాటాతో ఏపీ అగ్రస్థానంలో ఉందని …

Read More »

ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహానికి వాషింగ్‌ మెషిన్‌ను అందజేసిన కలెక్టర్

-జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లకు విద్యాసామగ్రిని పంపించిన జిల్లా కలెక్టర్ -నూతన సంవత్సరం సందర్భంగా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల -పేద విద్యార్థులకు మంచి చేయాలనే కలెక్టర్ ఆలోచన పట్ల సర్వత్రా హర్షం నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సర కానుకగా బాలికల వసతి గృహాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టుతూ, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల బీ.వీ. నగర్‌లోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహానికి వాషింగ్‌ మెషిన్‌ను అందజేశారు. బాలికల సౌకర్యార్థం, …

Read More »

మారిషస్ దేశాధ్యక్షులు ధరంబీర్ గోకుల్ జిసిఎస్కే కి ఘన స్వాగతం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మారిషస్ దేశాధ్యక్షులు ధరంబీర్ గోకుల్ జిసిఎస్కే కి గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఈ నెల 3 వ తేదీ నుంచి 8 తేదీ వరకు 6 రోజుల భారతదేశ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయానికి శనివారం సాయంత్రం కుటుంబ సమేతంగా చేరుకున్న మారిషస్ దేశాధ్యక్షులు గౌరవ ధరంబీర్ గోకుల్ జి సి ఎస్ కే గారికి రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చం …

Read More »

సావిత్రిభాయి పూలే స్ఫూర్తితో కూటమి పాలన

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అణగారిన వర్గాల ఆశా జ్యోతి సావిత్రిభాయి పూలే స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఆమె ఆశయాల సాధనే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. సావిత్రభాయి పూలే జయంతి సందర్బంగా విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె విగ్రహానికి పూల మాలలు వేసి మంత్రి సవిత ఘన …

Read More »

కూట‌మి పాల‌న‌లో న‌గ‌దు ర‌హిత వైద్య సేవ‌ల్లో భారీ పురోగ‌తి

-డాక్ట‌ర్ ఎన్టీఆర్ వైద్య సేవ వ్య‌యంలో 60 శాతం పెరుగుద‌ల‌ -21 శాతం పెరిగిన ల‌బ్దిదారులు -నిర్దేశిత స‌మ‌యంలో రోగుల వ‌ద్ద‌కు చేరుకుంటున్న 108 వాహ‌నాలు -అగ్రిమెంట్ ప్ర‌కారం 95 శాతం రోగుల‌ను గంట‌లో ఆసుప‌త్రుల‌కు చేరుస్తున్న 108 అంబులెన్సులు -104 వాహ‌నాల ద్వారా త్వ‌ర‌లో ఇంటి వ‌ద్ద‌నే 41 వైద్య ప‌రీక్ష‌లు -అమ‌లు, నిర్వ‌హ‌ణ‌ను స‌మీక్షించిన మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కూట‌మి ప్ర‌భుత్వ నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌తో ప్ర‌జ‌ల‌కు డాక్ట‌ర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత …

Read More »

ఆలయాల భద్రతపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు : గురుమూర్తి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అధికారులను వేధించడం, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వ్యక్తులపై బురద జల్లడం పరమావధిగా మారిందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి విమర్శించారు. టీటీడీ పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని పేర్కొంటూ, దీనికి అనేక ప్రత్యక్ష నిదర్శనాలు ఉన్నాయని ఆయన తెలిపారు. గత వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన దురదృష్టకర ఘటనలో కొంతమంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఎంక్వయిరీ కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ, ఏడాది …

Read More »

సావిత్రీబాయి పూలే స్ఫూర్తిని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి విద్యా సంస్కరణలు – ఎంపీ గురుమూర్తి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి బి.సి. సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కూడలిలో సావిత్రీబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి హాజరయ్యారు. ఎంపీతో పాటు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీషా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన సభలో ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రసంగిస్తూ, మహిళల సాధికారత, అందరికీ విద్య అనే మహోన్నత లక్ష్యాలతో సావిత్రీబాయి పూలే గారు సుమారు …

Read More »

సావిత్రిబాయి పూలే ఆశయాల సాధనే లక్ష్యం… : పొనుగుపాటి శ్రీనివాస్‌

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సావిత్రభాయి పూలే జయంతి సందర్బంగా విజయవాడలోని ఆలిండియా బహు జన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయం లో ఆలిండియా బహు జన్ సమాజ్ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షులు పొనుగుపాటి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పొనుగుపాటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే గొప్ప సంఘ సంస్కర్త, సామాజిక విప్లవకారిణి అని కొనియాడారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, మహిళల హక్కుల కోసం పోరాటం చేసిన ధీశాలన్నారు. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా …

Read More »