-పోలీసుల అదుపులో మహిళపై దాడి కేసు నిందితుడు -మానసిక స్థితి సరిగ్గా లేదని ప్రాథమికంగా నిర్ధారణ -స్పష్టమైన ఆధారాలు లేకున్నా కేసు ఛేదించిన పోలీసులు -విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదన్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలో ఓ మహిళపై జరిగిన దాడి వెనుక వాస్తవాలను ఛేదించి, నిందితుణ్ని అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. రెండు రోజుల క్రితం విశాఖలో విజయదుర్గ అనే మహిళను జగదాంబ సెంటర్‌లో ఓ వ్యక్తి …
Read More »Daily Archives: January 11, 2026
యుద్ధ కళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు దక్కడంపై మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు
-3 దశాబ్దాల కఠోర సాధన, పరిశోధన, అంకితభావానికి నిదర్శనంగా జపాన్ కు చెందిన గోల్డెన్ డ్రాగెన్ సంస్థ ద్వారా టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ టైటిల్ దక్కడంపై మంత్రి దుర్గేష్ హర్షం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ కు మార్షల్ ఆర్ట్స్ (యుద్ధ కళలు) రంగంలో అత్యంత అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించడం ఆనందంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలకు పైగా ఆయన చూపిన …
Read More »‘చేనేత’లకు సంక్రాంతి శుభవార్త
-సహకార సంఘాలకు రూ.5 కోట్ల బకాయిల విడుదలకు మంత్రి సవిత ఆదేశం -బకాయిల చెల్లింపునకు ఆప్కో నిర్ణయం -రేపు చేనేత సహకార సంఘాల ఖాతాల్లో రూ.5 కోట్ల బకాయిల జమ -గత నెలలో రూ.2.42 కోట్ల బకాయిలను చెల్లించిన ఆప్కో -సీఎం చంద్రబాబుకు, మం త్రి సవితకు ధన్యవాదాలు తెలిపిన చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, నేతన్నలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత సంక్రాంతి ముంగిట శుభవార్త తెలిపారు. ఆప్కో …
Read More »ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 కి రెట్టించిన ఉత్సాహంతో భారీగా తరలి వచ్చిన ప్రజలు
-ఆకట్టుకుంటున్న పలు శాఖల, విభాగాల స్టాల్స్ -అదరహో అనే విధంగా యువతను, ప్రజలను ఆద్యంతం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు -కుటుంబ సభ్యులతో కలిసి ఫ్లెమింగో ఫెస్టివల్ కు తరలి వచ్చిన విద్యార్థినీ విద్యార్థులు, ప్రజలు -కేరింతల సందడితో జన సంద్రంగా మారిన సూళ్లూరుపేట జూనియర్ కాలేజీ ప్రాంగణం -వివిధ ఆటల పోటీలతో ఆకట్టుకున్న యువత సూళ్లూరుపేట, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 రెట్టించిన ఉత్సాహంతో భారీగా ప్రజలు తరలివచ్చారు. రెండవ రోజైన ఆదివారం …
Read More »ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలతో ప్రజలు సంతృప్తిగా ఇంటికి వెళ్లగలిగే పరిస్థితి రావాలి
-వైద్య సిబ్బందిలో జవాబుదారీతనం మరింత పెరగాలి -వైద్య సేవల్లో నిర్లక్ష్యం ఉపేక్షించం.. కఠిన చర్యలు తీసుకుంటాం -నూజివీడు ఏరియా ఆసుపత్రి అభివృద్ధి సమావేశంలో వైద్య సిబ్బందిని హెచ్చరించిన- మంత్రి కొలుసు పార్థసారధి -ఆసుపత్రిలో అన్ని వార్డులను పరిశీలించి వైద్య సేవలపై రోగులతో మాట్లాడిన మంత్రి పార్థసారధి ఏలూరు, నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : పేదల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వ ఏటా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదని అందుకుతగిన విధంగా ప్రజలకు అందించే సేవలలో ఫలితాలు రావాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార …
Read More »ఏపీలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం
-బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ నిర్మాణ పనుల్లో గిన్నిస్ రికార్డులు -6 రోజుల్లో 156 లేన్ కిలోమీటర్ల రహదారి నిర్మాణం చేపట్టిన NHAI -BKV ఎకనామిక్ కారిడార్ పనుల్లో నాలుగు గిన్నిస్ రికార్డులు -NHAI, నిర్మాణ సంస్థ రాజ్ పథ్ ఇన్ఫ్రాకాన్ కు సీఎం చంద్రబాబు అభినందనలు -మిగిలిన నిర్మాణ పనులను ఇదే స్పూర్తితో చేపట్టాలన్న ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం సరికొత్త చరిత్రను సృష్టించింది. బెంగళూరు – కడప – విజయవాడ (BKV) ఎకనామిక్ …
Read More »నీరు-చెట్టు బిల్లులను క్లియర్ చేసిన ఆర్థిక శాఖ
-ఈ వారంలో అప్ లోడ్ అయిన రూ. 40 కోట్ల బిల్లులను ప్రాసెస్ లో పెట్టిన ఆర్థిక శాఖ -గతంలోనే రూ. 800 కోట్ల మేర నీరు-చెట్టు బిల్లులకు చెల్లింపులు జరిపిన ఫైనాన్స్ విభాగం -జీఎస్టీ రిజిస్ట్రేషన్ల సమస్య వల్ల ఇంకా ఆర్థిక శాఖకు చేరని రూ. 60 కోట్ల బిల్లులు -రూ. 60 కోట్ల బిల్లుల సాంకేతిక సమస్య తీర్చేందుకు ఇరిగేషన్ ఈఈ ఆఫీసుల్లో ప్రత్యేక కౌంటర్లు -నీరు-చెట్టు బిల్లుల చెల్లింపులపై ఫైనాన్స్, ఇరిగేషన్, జీఎస్టీ అధికారులతో ఆర్థిక మంత్రి సమీక్ష అమరావతి, …
Read More »విజయవాడలో సూపర్‌స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ లెనిన్ సెంటర్ సూపర్‌స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఆదివారం పద్మాలయ సంస్థ అధినేత, కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కృష్ణ మనుమడు, రమేష్‌బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం కలిగించిన చిత్రాలను అందించిన సూపర్‌స్టార్ కృష్ణ నేటితరం హీరోలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు వంటి స్వాతంత్య్ర పోరాటయోధుడి గాథను తెలుగు …
Read More »ఎస్‌ఆర్‌కె టౌన్‌షిప్ శ్రీ సిటీ వైభవ్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్‌ఆర్‌కె టౌన్‌షిప్ వారు ఆదివారం సంక్రాంతి సంబరాలను శ్రీ సిటీ వైభవ్ పాతపాడులోని తమ వెంచర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎస్‌ఆర్‌కె టౌన్‌షిప్‌్ అధినేత అయిన మందలపు హనుమంతరావు జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. అనంతరం హనుమంతురావు మీడియాతో మాట్లాడుతూ పాతపాడులో 70 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల సౌకర్యాలతో కూడిన వెంచర్‌ను ప్రారంభించామని తెలియజేశారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలను తమ ప్రాజెక్టులలో నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహించామని …
Read More »పూర్వ విద్యార్దుల ఆత్మీయ సమ్మేళనం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గొల్లపూడిలోని పోసాని నరసింహారావు చౌదరి ఉన్నత పాఠశాలలో 1995-2000 సంవత్సరం మధ్య చదువుకున్న విద్యార్థుల సమావేశం గొల్లపూడిలోని పాఠశాల ప్రాంగణంలో ఆదివారం జరిగింది. 25 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు కలవటంతో వారంతా సంతోషంగా గడిపారు. పాఠశాల ఉపాధ్యాయులు రావూరి చలపతిరావు, బొప్పన నాగేశ్వరరావు, హనుమంతరావు, మధుసూదనరావు, జీవికే ప్రసాద్, నాగలక్ష్మి, భారతి, లక్ష్మీ, మురళీ ఉపాధ్యాయులను సన్మానించారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అందరూ కలిసి కట్టుగా భోజనాలు చేశారు. రోజంతా సంతోషంగా గడిపారు. పూర్వ …
Read More »
Prajavartha Online Telugu News