Breaking News

Daily Archives: January 12, 2026

రాష్ట్ర వ్యాప్తంగా 110 రక్తదాన శిబిరాలు

-2వేల యూనిట్ల రక్తం సేకరణ -విజయవాడలో ప్రారంభించిన వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రక్తదానం చేసేందుకు యువత మరింత ముందుకు రావాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపు ఇచ్చారు. యువత ఔదార్యంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారి ప్రాణాలకు భరోసా ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఒక యూనిట్‌ రక్తం ముగ్గురు ప్రాణాల్ని కాపాడుతుందన్నారు. నూటికి నూరు శాతం రక్తదానం వాలంటరీగా జరగాలన్నారు. రక్త దానం ప్రాధాన్యoపై యువత లో మరింత అవగాహన …

Read More »

రాష్ట్ర మెడికల్ కౌన్సెల్ ద్వారా ఏఐ ఆధారిత వాట్సప్ సేవలను ప్రారంభించిన మంత్రి సత్యకుమార్

-వీడియోల ద్వారా కూడా తెలుసుకునే అవకాశం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి (ఏపీ మెడికల్ కౌన్సెల్) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో సేవలకు శ్రీకారంచుట్టింది. వైద్యుల రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్, ఇతర సేవల సమాచారం కోసం విజయవాడలోని కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఫోన్లు చేయాల్సిన అవరం లేకుండా వాట్సప్ నెంబరు 9030999616 ద్వారా పూర్తి సమాచారాన్ని ఏఐ ద్వారా తెలుసుకునే సదుపాయాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. వైద్య మండలి అధ్యక్షుడు …

Read More »

అభివృద్ది ప‌రంగా రాష్ట్రంలో ప్రతి రోజు పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది

-ఎంపీ కేశినేని శివ‌నాథ్ , ప్ర‌భుత్వ విప్ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు వెల్ల‌డి -రామ‌వ‌రప్పాడు లో సంక్రాంతి సంబ‌రాలు, ఎగ్జిబిష‌న్ ప్రారంభం -సంబ‌రాల్లో భాగంగా ముగ్గుల పోటీలు, శాస్త్రీయ నృత్య పోటీలు -ముగ్గుల పోటీలో పాల్గొన్న దివ్యాంగురాల‌కు ప్ర‌త్యేక అభినంద‌న‌లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అభివృద్ధి పరంగా రాష్ట్రంలో ప్రతి రోజు పండుగ వాతావరణం నెలకొందని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజ‌య‌వాడ రామ‌వ‌రప్పాడు బ్రిడ్జ్ ద‌గ్గ‌ర గ‌ల అంబిట్స్ స్కూల్ ప‌క్క‌న …

Read More »

2026లోనూ ఉత్తమ ఫలితాలే సాధిద్ధాం

-స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సుతో బెస్ట్ రిజల్ట్స్ -పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానం ఏపీ -16 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా కార్యాచరణ -విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.1.19 తగ్గించటం లక్ష్యం -ఈ ఏడాదిలోనే ల్యాండ్ రికార్డుల పూర్తి ప్రక్షాళన -వీబీ జీ రామ్‌జీ ఉపాధి హామీ సమర్ధ వినియోగంతో కమ్యూనిటీ ఆస్తుల పెరుగుదల -గత పాలకులది తిరుమల పవిత్రను దెబ్బతీసే కుట్ర -తిరుమలలో మద్యం బాటిళ్లు పెట్టి దుర్మార్గానికి పాల్పడ్డారు -మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లతో సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి …

Read More »

నారావారిపల్లె కు సీఎం చంద్రబాబు

-కుటుంబ సమేతంగా రేపు సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న సీఎం -నేటి నుంచి నాలుగు రోజుల పాటు స్వగ్రామంలో సీఎం -రేపు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లారు. ఏటా కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకునే సీఎం చంద్రబాబు…ఈ ఏడాది కూడా స్వగ్రామానికి చేరుకున్నారు. సోమవారం మంత్రులు, సెక్రటరీలు, కలెక్టర్లతో సచివాలయంలో సమీక్షా సమావేశం అనంతరం సాయంత్రం …

Read More »

హైవే నిర్మాణంలో ప్రపంచ రికార్డులు గర్వకారణం

-బీకేవీకి అమరావతి-బెంగుళూరు కారిడార్ పేరు పెట్టండి: సీఎం చంద్రబాబు -సీఎం చంద్రబాబు నాయకత్వంలో వేగంగా పనులు -చంద్రబాబు తన జీవితాన్ని ప్రజా శ్రేయస్సుకు అంకితం చేశారు : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ -బీకేవీ గిన్నీస్ రికార్డు వర్చువల్ కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరైన సీఎం, కేంద్రమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాయకత్వంలో రహదారుల నిర్మాణంలో ప్రపంచ స్థాయిలో రికార్డులను సాధించటం గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బెంగుళూరు- విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో నాలుగు గిన్నీస్ రికార్డులు …

Read More »

భక్తుల మనోభావాలపై జగన్ దండయాత్ర చేస్తున్నాడు

-కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంతృప్తే లక్ష్యంగా పనిచేస్తోంది. -ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు సీఎం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారు. -గతంలో గోబెల్స్ ప్రచారం గురించి విన్నాం.. ఇప్పుడు అబద్ధాలతో ‘జగన్ బెల్స్’ ప్రచారం చూస్తున్నాం. -రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా జగన్ అండ్ టీమ్ విషం చిమ్ముతోంది. -వెంకటేశ్వర స్వామిని నల్లరాయి అని కించపరిచిన భూమన.. ఇప్పుడు నామాలు పెట్టుకుని మొసలి కన్నీరు కారుస్తున్నారు. -రాష్ట్ర ఆదాయానికి కీలకమైన ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని దెబ్బతీయాలని వైసీపీ కంకణం కట్టుకుంది. -సమాచార …

Read More »

అన్ని సేవ‌లూ మ‌న‌మిత్ర‌, ఆన్‌లైన్‌లోనే అందివ్వాలి

-అవేర్ ను అన్ని శాఖ‌లు స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకోవాలి -ఏప్రిల్ ఆఖ‌రుక‌ల్లా 98 ఏఐ ఆధారిత యూస్ కేసెస్ సిద్ధం -ఐటీ, ఆర్టీజీ శాఖ‌ల కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని అమ‌రావ‌తి, విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వంలోని ప్ర‌తి శాఖ ప్ర‌జ‌ల‌కు అందించే అన్ని సేవ‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా ఆన్‌లైన్‌లోనూ, మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌లోనే అందించాల‌ని ఐటీ, ఆర్టీజీ శాఖ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని కోరారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలో స‌చివాల‌యంలో మంత్రులు, ప్ర‌భుత్వ శాఖ‌ల కార్య‌ద‌ర్శుల‌తో జ‌రిగిన స‌ద‌స్సులో ఆయ‌న డేటా డ్రివ‌న్ …

Read More »

స్వామి వివేకానంద బోధనలు యువతకు ఆదర్శం

-భవిష్యత్ లో ప్రపంచాన్ని శాసించే శక్తి దేశ యువతదే -లక్ష్య సాధనలో యువత తమ సంకల్పబలాన్ని పెంపెందించుకోవాలి -రామకృష్ణ మఠం సహాయ కార్యదర్శి స్వామి స్థితి కంఠానంద విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వామి వివేకానంద బోధనలను యువత రోల్ మోడల్‌గా తీసుకుని, తమ నైపుణ్యాలను, వ్యక్తిత్వాన్ని పెంపెందించుకోవాలని రామకృష్ణ మఠం సహాయ కార్యదర్శి స్వామి స్థితి కంఠానంద పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద 163 వ జయంతిని పురస్కిరించుకొని యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తుమ్మలపల్లి కళా క్షేత్రంలో జాతీయ …

Read More »

వివాదాలు వద్దు-ఐక్యతే ముద్దు.

-పరస్పర సహకారంతోనే ప్రగతి సాధ్యం. -పోలవరం-నల్లమల సాగర్ వల్ల ఎవరికీ నష్టం ఉండదు. -జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి నదికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం – నల్లమల సాగర్ ప్రాజెక్ట్ వల్ల ఎవరికీ నష్టం లేదని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు సిజేఐ సూచనల మేరకు ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ వేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకున్న …

Read More »