Breaking News

Daily Archives: January 12, 2026

బదిర విద్యార్థుల కేరింతలతో అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు…

-బదిర విద్యార్థులకు సంక్రాంతి కానుకగా 50వేల రూపాయలు అందించిన ఎమ్మెల్యే గోరంట్ల… -పలుకు సంస్థ నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల, ఎమ్మెల్సీ వీర్రాజు… రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక స్వరాజ్య నగర్ సంకల్పమ్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలుకు బదిరుల ఆశ్రమ పాఠశాల స్థాపించి 15 వ వార్షికోత్సవము మరియు సంక్రాంతి సంబరాలు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్యమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాజరయ్యారు. వారితోపాటు ది.ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ …

Read More »

అన్నక్యాంటీన్లలో పరిశుభ్రత పాటించాలి…

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్నక్యాంటీన్లలో పరిశుభ్రత పాటించాలని, ఆహారం సరఫరా అనంతరం శుభ్రం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. సోమవారం నల్లచెరువు లోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో ఆహారం తీసుకునేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని, కొందరు క్యాంటీన్ లోపల స్థలం సరిపోక కాంపౌండ్ లోపల కూర్చొని భోజనం చేస్తున్నందున పరిసరాలను …

Read More »

పిజిఆర్ఎస్ కు అన్ని విభాగాల అధికారులు హాజరు కావాలి…

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్ కు అన్ని విభాగాల అధికారులు హాజరు కావాలని, ప్రజలు అందించే ఫిర్యాదులు, అర్జీలను విభాగాధిపతులు క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దేశిత గడువు మేరకు పరిష్కరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు విభాగాధిపతులకు స్పష్టం చేశారు. సోమవారం డయల్ యువర్ కమిషనర్, నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో జరిగిన పిజిఆర్ఎస్ లో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను …

Read More »

ముగిసిన ‘ఖాదీ మహోత్సవం’ 10 రోజుల్లో రికార్డు స్థాయి అమ్మకాలు..

-దాదాపు రూ. 2 కోట్ల 20 లక్షలకు పైగా అమ్మకాలు.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత కళాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో గత పది రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహించిన ‘ఖాదీ మహోత్సవం’ ప్రదర్శన నేటితో విజయవంతంగా ముగిసిందని, ప్రదర్శనకు నగర ప్రజల నుండి అనూహ్య స్పందన లభించడమే కాకుండా, విక్రయాల్లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ రాష్ట్ర సంచాలకులు డా. ఎస్. గ్రీప్, సహాయ సంచాలకులు ఆర్.ఎల్.ఎన్. మూర్తి లు తెలిపారు. జనవరి 3వ తేదీన మేరిస్ …

Read More »

పీజీఆర్ఎస్ అర్జీల‌ను నాణ్య‌త‌తో ప‌రిష్క‌రించండి

– జిల్లాస్థాయి పీజీఆర్ఎస్‌-రెవెన్యూ క్లినిక్‌కు 88 అర్జీలు – కార్య‌క్ర‌మానికి 85 రెవెన్యూ యేత‌ర అర్జీలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) ద్వారా వ‌చ్చిన ప్ర‌తి అర్జీని క్షుణ్నంగా ప‌రిశీలించి, నిబ‌ద్ధ‌త‌తో, నాణ్య‌త‌తో ప‌రిష్క‌రించాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ అన్నారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో రెవెన్యూ క్లినిక్‌, మ‌రో స‌మావేశ మందిరంలో నాన్ రెవెన్యూ పీజీఆర్ఎస్ అర్జీల స్వీక‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ ఇల‌క్కియ‌, డీఆర్‌వో …

Read More »

సమాచార శాఖ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగ కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయత, అనురాగాలను పెంచి నూతనోత్సాహంతో ముందుకు సాగుతూ, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మరిన్ని విజయాలను సాధించాలని సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు ఎల్. స్వర్ణలత ఆకాంక్షించారు.. సమాచార పౌర సంబంధాల శాఖ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎన్టీఆర్ పరిపాలనా భవనం రెండో అంతస్ధు డైరెక్టరేట్ కార్యాలయంలో ఉద్యోగులు సాంప్రదాయ దుస్తులతో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంప్రదాయబద్ధంగా రంగోలీ ముగ్గులు, రంగవల్లులు, …

Read More »

Dr. NTR University of Health Sciencesలో పరిశోధనా దినోత్సవ వేడుకలు మరియు డా. యెల్లాప్రగడ సుబ్బారావు విగ్రహ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ వైద్య విజ్ఞానానికి ఎనలేని సేవలందించిన మహా శాస్త్రవేత్త Dr. Yellapragada Subbarow జయంతి సందర్భంగా, డా. ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (డా. ఎన్టీఆర్ యూహెచ్‌ఎస్), విజయవాడలో సోమవారం ఉదయం 11 గంటలకు పరిశోధనా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా డా. యెల్లాప్రగడ సుబ్బారావు విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ & వైద్య విద్య శాఖ గౌరవ మంత్రి సత్య కుమార్ యాదవ్ అధికారికంగా ఆవిష్కరించారు. ఆధునిక వైద్య …

Read More »

జిల్లా కలెక్టర్ డా. జి.ల‌క్ష్మీశ గారిచే ఉచిత పశు వైద్య శిబిరాల పోస్టర్లు, క‌ర‌ప‌త్రాల ఆవిష్క‌ర‌ణ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 19వ తేదీ నుంచి 31వ తేదీ వ‌ర‌కు జిల్లాలోని అన్ని గ్రామాలలో “ఉచిత పశు వైద్య శిబిరాలు” నిర్వహింపబడును. అన్ని మండలాల్లో పశువైద్యాధికారుల సారథ్యంలో రెండు బృందాల‌ను ఏర్పాటుచేసి ఈ శిబిరాలను నిర్వహింపబడును. ఈ ఉచిత పశువైద్య శిబిరాలలో గొర్రెలు, మేకలకు, పెద్ద పశువులకు, లేగ దూడలకు ఉచితంగా నట్టల నిర్మూలన మందులు త్రాపించబడును. గొర్రెలకు బొబ్బ వ్యాధి నిరోధక టీకాలు, కోళ్లలో కొక్కెర తెగులు నివారణ టీకాలు వేయబడతాయి. అనారోగ్య పశువులకు వైద్య పరీక్షలు …

Read More »

సేవ‌ల పంపిణీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్‌

– ప్ర‌జ‌ల సంతృప్తి స్థాయి గీటురాయిగా ముందడుగు – పేద‌రిక నిర్మూల‌న దగ్గ‌రి నుంచి డీప్ టెక్ వ‌ర‌కు ప‌ది సూత్రాల‌పై ప్ర‌త్యేక దృష్టి – స‌మ‌ష్టి కృషితో జీడీడీపీ, త‌ల‌స‌రి ఆదాయ వృద్ధికి కార్యాచ‌ర‌ణ‌ – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గౌర‌వ ముఖ్య‌మంత్రి దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా పాల‌న‌లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ స్ఫూర్తితో జిల్లాలో ప్ర‌భుత్వ సేవ‌ల పంపిణీలో వేగాన్ని అందిపుచ్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. సోమ‌వారం గౌర‌వ …

Read More »

స్వామి వివేకానంద బోధనలు యువతకు ఆదర్శం

– భవిష్యత్ లో ప్రపంచాన్ని శాసించే శక్తి దేశ యువతదే – లక్ష్య సాధనలో యువత తమ సంకల్పబలాన్ని పెంపెందించుకోవాలి – రామకృష్ణ మఠం సహాయ కార్యదర్శి స్వామి స్థితి కంఠానంద విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వామి వివేకానంద బోధనలను యువత రోల్ మోడల్‌గా తీసుకుని, తమ నైపుణ్యాలను, వ్యక్తిత్వాన్ని పెంపెందించుకోవాలని రామకృష్ణ మఠం సహాయ కార్యదర్శి స్వామి స్థితి కంఠానంద పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద 163 వ జయంతిని పురస్కిరించుకొని యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తుమ్మలపల్లి …

Read More »