Breaking News

Daily Archives: January 13, 2026

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగి శుభాకాంక్షలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి ముగ్గులతో అలరారుతున్న తెలుగు లోగిళ్లలో భోగి పండుగ జరుపుకుంటున్న తెలుగు ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దేదీప్యమానంగా వెలిగే భోగి మంటలు మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. ఆశావహ దృక్పథంతో సాగే మీ ఆలోచనలు సాకారం కావాలని… అందుకు మీకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. మీ జీవితం భోగభాగ్యాలతో తులతూగాలని కోరుకుంటూ, మరొక్కమారు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.

Read More »

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులాల విద్యార్థుల ప్రతిభకు రాష్ట్ర స్థాయి గుర్తింపు

-82 మంది మెరిట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 1 లక్ష చొప్పున బహుమతులు అందించిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులాలకు చెందిన ప్రతిభావంతులైన 82 మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరికి రూ. 1 లక్ష చొప్పున నగదు బహుమతులు అందించారు. విద్యా రంగంలో గురుకులాలు సాధిస్తున్న ఘన విజయాలకు ఇది స్పష్టమైన నిదర్శనమని సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రసన్న వెంకటేష్ వి., ఐఏఎస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ …

Read More »

ప్రజారోగ్య ప్రాజెక్టు సంజీవని చిత్తూరుకు విస్తరణ

-సీహెచ్‌సీలో డిజి నెర్వ్ సెంటర్‌ను ప్రారంభం -నీవా బ్రాంచ్ కెనాల్ పనులకు సీఎం శంకుస్థాపన -నారావారిపల్లెలో స్కిల్ బిల్డింగ్ సెంటర్ సహా వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం -సంక్రాంతి పండుగ వేళ స్వగ్రామం, తిరుపతిలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నారావారిపల్లె, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్య ప్రాజెక్టు సంజీవనిని చిత్తూరు జిల్లాకు విస్తరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిజినెర్వ్ సెంటర్ సేవల్ని ప్రారంభించారు. గత ఏడాది కుప్పంలో పైలట్ గా ప్రారంభించిన డిజి నెర్వ్ సెంటర్ డిజిటల్ హెల్త్ రికార్డుల …

Read More »

ఆటల్లో విజేతలకి బహుమతులు

నారావారిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్, బ్రాహ్మణి పాల్గొన్నారు. సంబరాల్లో భాగంగా గ్రామంలోని చిన్నారులకు మ్యూజికల్ చైర్స్, బ్యాలెన్స్ వాకింగ్, గన్నీ బ్యాగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్, కాక్ ఫైట్, త్రీలెగ్ రేస్, గ్లాస్ అండ్ బెలూన్ రన్ వంటి పలు క్రీడలను నిర్వహించారు. వీటన్నింటినీ సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించి సంతోషంగా గడిపారు. క్రీడల్లో …

Read More »

సార్లంకపల్లె అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష

-బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందించాలని ఆదేశం -ప్రత్యేక క్యాంప్‌ ద్వారా ఆధార్ కార్డులు, ఇతర కీలక పత్రాలు జారీ చేయాలని సూచన నారావారిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : కాకినాడ జిల్లా సార్లంకపల్లెలో సంక్రాంతి పండుగ సమయంలో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ఘటనపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అగ్ని ప్రమాదంలో గ్రామంలోని మొత్తం 38 తాటాకు ఇళ్లు పూర్తిగా కాలిపోయాయని అధికారులు వివరించగా… నష్టపోయిన బాధిత …

Read More »

జిల్లాలో ఎటువంటి ఎరువుల కొరతా లేదు

-ప్రతిపక్షాలు కావాలని వదంతులు సృష్టించి రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి -చాట్రాయి నరసింహరావుపాలెం లో ఎరువుల నిల్వలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు/ చాట్రాయి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరతా లేదని రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు. చాట్రాయి మండలం నరసింహరావుపాలెం లోని ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాల గోడౌన్ ను, ఎరువుల …

Read More »

మార్షల్ ఆర్ట్స్ లో మీ విజయం స్ఫూర్తిదాయకం

-దశాబ్దాల సాధనతో యువతరానికి అద్భుత సందేశం ఇచ్చారు -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని అభినందించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జపనీస్ కత్తి సాము కళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందడం ద్వారా అరుదైన ఘనత సాధించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ మేరకు సందేశాన్ని పంపారు. “జపనీస్ మార్షల్ ఆర్ట్స్ రంగంలో మీరు సాధించిన విజయాలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నాను. కెంజుట్సు లో …

Read More »

సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక సూచనలు.

-సంక్రాంతికి అదనపు బస్సు చార్జీలు లేవు…మంత్రి -సొంత, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలి : మంత్రి -ప్రైవేట్ బస్సులు చార్జీలు పెంచి అక్రమ వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తాం..మంత్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు. పండుగ రద్దీ దృష్ట్యా …

Read More »

‘ఈ ఆఫీస్’ అమలులో అలసత్వాన్ని ప్రదర్శిస్తే కఠిన చర్యలు!

-సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకాడేదిలేదు -రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ స్పష్టీకరణ -జిల్లా అధికారులతో సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఆఫీస్ (కాగిత రహిత) విధానంలో అధికారిక కార్యకలాపాలు నిర్వహించని వైద్యులు, అధికారులపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, ఆర్జేడీ కార్యాలయాల వరకు అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, వైద్య, ఇతర సిబ్బంది సర్వీస్ వ్యవహారాలు, …

Read More »

భోగి, సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు… : నక్కా వీరభద్రరావు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ భారత దేశ ప్రాంతాలలో జరుపుకునే అతి పెద్ద పండగ సంక్రాంతి పండుగని ప్రజలకు నక్కా వీరభద్రరావు, సిపిఐ నగర సహాయ కార్యదర్శి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ… జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో తులతూగుతూ ఉండాలని, భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా జరుపుకోవాలన్నారు. సంక్రాంతి అనగా నూతన క్రాంతి అని, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారని, ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారన్నారు. సంక్రాంతి పండుగను మొదటి రోజు భోగి …

Read More »