మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని పోలీస్ కవాతు మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 26వ తేదీన నగరంలోని పోలీసు కవాతు మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఇందుకోసం ఏర్పాట్లు సజావుగా చేపట్టాలన్నారు. …
Read More »Daily Archives: January 13, 2026
కలెక్టర్లతో జనాభా లెక్కల సేకరణ పై వీడియో కాన్ఫరెన్స్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే ఏప్రిల్ మాసం నుండి 30 రోజులపాటు ఇంటింటి జనాభా లెక్కల సేకరణ చేపట్టాలని కేంద్ర జనాభా లెక్కల సేకరణ డైరెక్టర్ జే నివాస్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఉదయం మంగళవారం ఉదయం ఆయన న్యూఢిల్లీ నుండి రాష్ట్ర సచివాలయంలోని రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, జిల్లాల ప్రధాన జనాభా లెక్కల అధికారులైన జిల్లా కలెక్టర్లతో జనాభా లెక్కల సేకరణ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జె …
Read More »కొల్లేరు సరస్సు పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై వీడియో కాన్ఫరెన్స్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ డాక్టర్ పి. కృష్ణయ్య మంగళవారం విజయవాడ నుంచి కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాకారులతో కొల్లేరు సరస్సు పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో నగరంలోని తన క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొన్నారు. కొల్లేరు సరస్సు పరిరక్షణలో భాగంగా కాలుష్యాన్ని అరికట్టడం, నీటి నాణ్యతను మెరుగుపరచడం, సిల్టేషన్ నివారణ, జీవవైవిధ్యాన్ని కాపాడడం వంటి …
Read More »సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేట్ బస్సుల అధిక ఛార్జీలపై కఠిన చర్యలు
–జిల్లా రవాణా శాఖ సంయుక్త కమిషనర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో, ప్రైవేట్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేయకుండా నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ కఠిన చర్యలు చేపట్టిందని జిల్లా రవాణా శాఖ సంయుక్త కమిషనర్ తెలిపారు. * గత ఐదు రోజులుగా RTGS పర్యవేక్షణతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన Fare Monitoring Teams ద్వారా అన్ని ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫార్ములు (అభి బస్, రెడ్ …
Read More »సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో రూ.10,000 కోట్లకు పైగా జమ
-స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్‌కు నిదర్శనం -ధాన్యం కొనుగోలులో చారిత్రక విజయం సాధించిన కూటమి ప్రభుత్వం- -అమరావతిపై జగన్మోహన్ రెడ్డి ది దుష్ప్రచారం- -రాష్ట్ర ప్రజలకు, రైతు సోదరులకు సంక్రాంతి -శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్ సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 50 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి గాను, రాష్ట్రంలో ఇప్పటివరకు 6,76,848 మంది రైతుల నుంచి 41.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు & …
Read More »మేరీ స్టెల్లా కళాశాలలో ఫ్రీ ఐ చెకప్ క్యాంప్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మేరీ స్టెల్లా కళాశాలలోని యన్ యస్ యస్ యూనిట్ల ఆధ్వర్యంలో ఫ్రీ ఐ చెకప్ క్యాంప్ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ ఉచిత కంటి శిబిరాన్ని ప్రారంభిస్తూ సర్వేంద్రీయానం నయనం ప్రధానం అని కళ్ల పరిరక్షణ ఎంతో ప్రముఖ మైనదని కళ్ళ కు సంబంధించిన వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్స్ ను నిర్లక్ష్యం చేయరాదని తెలిపారు. ముఖ్య అతిథిగా డాక్టర్ బషీర్ అహ్మద్ ఆప్థోమాలజిస్ట్, అయాన్ ఐ హాస్పిటల్ విచ్చేశారు. కంటి చికిత్స లో అనేక …
Read More »మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఎం.హెచ్.పి.ఎస్ కేంద్ర కార్యాలయం వద్ద జనాబ్ మొహమ్మద్ ఫారూఖ్ షిబ్లి సంక్రాంతి సమైక్యతా సంబరాలను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి అనేది తెలుగు ప్రజల పండగ, మన సంస్కృతి సంప్రదాయాలను తెలుగు ప్రజలైన మనమందరం కాపాడుకోవటం మనందరి బాధ్యత. ఎం.హెచ్.పి.ఎస్ కేంద్ర కార్యాలయం నందు నిర్వహించిన కార్యక్రమంలో అనేకమంది సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తెలుగువారి తెలుగుదనాన్ని తెలియపరిచే విధంగా చెరుకు గడలతో, బ్రహ్మాండమైన తోరణాలతో, గంగిరెద్దులతో, హరిదాసులతో కీర్తనలతో పాటుగా …
Read More »పేదల కళ్ళలో సం’క్రాంతి’ వెలుగులు…
-సంక్రాంతి కానుకగా పేదలకు ఇళ్ల పట్టాలు.. -నెరవేరిన నాలుగు దశాబ్దాల పేదల కల… -అంతులేని ఆనందం… -తడిబారిన కళ్ళతో లబ్దిదారుల హర్షాతిరేకాలు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భావోద్వేగాలను అదుపు చేసుకోలేని ఒక ఆనందకరమైన పరిస్థితి. నాలుగు దశాబ్దాల కాలంగా నెరవేరని కల నేడు నిజమైంది. విజయవాడ నగరంలో మధ్య నియోజకవర్గంలో 58 డివిజన్ ప్రజలకు దశాబ్దాల పాటు ఎటువంటి చట్టబద్ధతలేని స్థలంలో గూడు నిర్మించుకుని నివాసం ఉంటున్న నిరుపేదలకు ఆనందాన్ని పంచే సంక్రాంతి పండుగ ముందే వచ్చింది. నాలుగున్నార దశాబ్దాల తర్వాత …
Read More »సమర్థవంతంగా జన గణనకు సన్నద్ధత
-మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ఏర్పాట్లు -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో సమర్థవంతంగా జన గణన చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. మంగళవారం అమరావతి నుంచి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (జీపీఎం & ఏఆర్) ఎస్.ఎస్.రావత్.. అన్ని జిల్లాల కలెక్టర్లతో జనగణన కార్యక్రమాల సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సెన్సస్ రెండు దశల్లో జరగనున్న నేపథ్యంలో హౌస్ లిస్టింగ్, హౌస్ టు హౌస్ సర్వేల …
Read More »జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ -భోగభాగ్యాలతో “భోగి” -సిరి సంపదలతో “మకర సంక్రాంతి” విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కనువిందుగా “కనుమ” పండుగను జిల్లా ప్రజలు కుటుంబ సభ్యులు బందు మిత్రుల తో ఆనందం గా జరుపు కోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలందరి జీవితాల్లో మకర సంక్రాంతి వెలుగులు నింపాలని, సిరి సంపదలు పాడి పంటలు సుఖ సంతోషాలు తో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం నింపాలని ఈ ఏడాది అన్ని రంగాలలో అగ్ర భాగాన …
Read More »
Prajavartha Online Telugu News