Breaking News

Daily Archives: January 13, 2026

ఎమ్మెల్యే సుజనా చౌదరి గోసేవ..

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి గుంటూరు జిల్లాలోని పెద వడ్లపూడి లోని గోశాల ను సందర్శించారు. బిజెపి నాయకుడు పాతూరి నాగభూషణం కి చెందిన గోశాల లో సుజనా చౌదరి గోమాతలకు ఆహారం పెట్టారు.. అదే విధంగా గోవులకు పూజ నీర్వహించారు.. వివిధ రకాల కూరగాయలు, పండ్లు, చిరు ధాన్యాలు సుజనా చౌదరి ఆవులకు ఆహారంగా అందించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవులను పూజించడం మాహా పుణ్య కార్యంగా తీసుకోవాలన్నారు.. గోసేవ చేయడం గోవిందుడు …

Read More »

వీఎంసీ పెండింగ్ ప్రాజెక్ట‌ల‌ను వేగ‌వంతం చేయండి…

-ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ స‌మీక్ష‌లో మంత్రి నారాయ‌ణ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి సంబందించిన అభివ్రిద్ది ప‌నుల పురోగ‌తి పై ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి క్యాంపు కార్యాల‌యంలో మంత్రి నారాయ‌ణ‌, ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి స‌మీక్ష నిర్వ‌హించారు. విజ‌య‌వాడ న‌గ‌రానికి చెందిన ఎమ్మెల్యేలు బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, గ‌ద్దె రామ్మోహ‌న్ రావు, పెన‌మ‌లూరు ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్ , మున్సిప‌ల్ శాఖ మంత్రి నారాయ‌ణ త‌దిత‌రులు తాడిగ‌డ‌ప లోని సుజ‌నా చౌద‌రి క్యాంపు కార్యాల‌యంలో ఆత్మీయ క‌లయిక జ‌రిగింది. అనంత‌రం మంత్రి …

Read More »

తెలుగు సంప్ర‌దాయాల‌ను కొన‌సాగించాలి…

-ముగ్గుల పోటీల బ‌హుమ‌తి ప్ర‌ధానంలో ఎమ్మ‌ల్యే సుజ‌నా చౌద‌రి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ న‌గ‌ర జ‌న‌సేన నేత బాడిత శంక‌ర్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల విజేత‌ల‌కు ప‌శ్చిమ ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి బ‌హుమ‌తులు అంద‌చేశారు. సంక్రాంతి సంబ‌రాల్లో భాగంగా భ‌వానీపురం పున్న‌మి ఘాట్ లో మ‌హిళ‌ల‌కు ముగ్గుల పోటీలు నిర్వ‌హించారు. మ‌హిళ‌లు ఈ పోటీల్లో పాల్గొని వివిధ రకాల వైవిధ్య‌మైన ముగ్గులు వేశారు. పోటీల‌లో విజేత‌ల‌కు ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి బ‌హుమ‌తి ప్ర‌ధానం చేశారు. ఈ సంద‌ర్భంగా …

Read More »

ఎన్టీఆర్ స్టేడియంలో  సంక్రాంతి సంబరాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్టీఆర్ స్టేడియంలో మంగళవారం చిన్నారులు, పెద్దలు గాలి పటాలు ఎగురవేయడం, మిమిక్రీ, రెయిన్ బో డ్యాన్స్ అకాడమీ చిన్నారుల డ్యాన్స్, ఆర్కెస్ట్రా, తంబోలా గేమ్ లు ప్రజలను అలరించాయి. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను నేటి తరానికి చాటేలా జర్గుతున్నజిఎంసి సంక్రాంతి సంబరాలు నగర ప్రజలను అమితంగా అలరిస్తున్నాయి. ఈ నెల 11 నుండి 16 వరకు జరిగే సంబరాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత వాతావరణంను గుంటూరు …

Read More »

సంక్రాంతి సంబరాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వెల్ఫేర్ సెంటర్లో అసాంఘీక కార్యక్రమాలు కట్టడి చేయాలన్న దశాబ్దాల కోరిక, సంక్రాంతి సంబరాలను తూర్పు నియోజకవర్గంలో కూడా ఘనంగా నిర్వహించాలన్నప్రజల అకాంక్ష ప్రస్తుత కూటమి ప్రభుత్వం హయాంలో నెరవేరిందని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. మంగళవారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వెల్ఫేర్ సెంటర్(నారా చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణం) లో గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తో కలిసి మేయర్ ప్రారంబించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ …

Read More »

ఖాళీ స్థలాల పన్ను బకాయిదారుల స్థలాలలో నోటీసు బోర్డులు ఏర్పాటు

-విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి. సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఖాళీ స్థలాల పన్ను బకాయిదారుల స్థలాలలో నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారని విజయవాడ నగరపాలక సంస్థల డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి. సృజన అన్నారు. మంగళవారం ఉదయం జోజి నగర్, విద్యార్థపురం, వెటర్నరీ కాలనీ, కండ్రిక, క్రీస్తు రాజు పురం ప్రాంతాలలో ఖాళీ స్థలాల పన్ను బకాయిదారుల స్థలాలలో నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) జి. సృజన మాట్లాడుతూ …

Read More »

ఇప్పటి వరుకు 28,000 ఉచిత పండ్ల మరియు పూల మొక్కల పంపిణీ చేసాం

-విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటివరకు 28 వేల మొక్కలను పంపిణీ చేశామని డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబునాయుడు శంకల్పిస్తున్న హరిత ఆంధ్ర ప్రదేశ్ లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ చేస్తున్న ఉచిత పండ్ల మరియు పూల మొక్కల పంపిణీ కార్యక్రమంలో ఇప్పటివరకు 28 వేల మొక్కలను పంపిణీ చేశామని అన్నారు. …

Read More »