విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భూగర్భ జల మరియు జలగణన శాఖ సంచాలకులుగా కొంపెల్ల సుబ్బరాయ శాస్త్రి విజయవాడ హనుమాన్ పేటలోని భూగర్భ జలశాఖ సంచాలకుల కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(కాడా)లో జాయింట్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్న ఆయనను భూగర్భ జలశాఖ సంచాలకులుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయన భూగర్భ జలశాఖ సంచాలకులుగా బాధ్యతలు చేపట్టారు. భూగర్భ జలాల అంచనా, వర్గీకరణ, మೌಲ్యాంకనం రంగాలలో …
Read More »Daily Archives: January 14, 2026
వైభవోపేతంగా గోదాదేవి కళ్యాణం…
-దైవిక అనుభూతితో పులకించిన భక్తజనులు… -పెద్ద సంఖ్యలో భక్తుల హాజరు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పున్నమ్మ తోటలోని దేవస్థానంలో నిర్వహించిన గోదాదేవి కళ్యాణం భక్తుల హృదయాలను పరవశింపజేసింది. శ్రీవైష్ణవ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఈ పుణ్యకార్యక్రమం ఆధ్యాత్మిక శోభతో, వేద మంత్రోచ్చారణల నడుమ అత్యంత ఘనంగా సాగింది. ఆలయ ప్రాంగణం అంతటా మంగళవాయిద్యాల నాదాలు, సుగంధ పుష్పాల అలంకరణలు భక్తుల్లో ప్రత్యేకమైన ఆనందాన్ని నింపాయి. ధనుర్మాసం ఆరంభం నుంచి దేవస్థానంలో నిత్యం గోదాదేవి, శ్రీకృష్ణుల స్వామివార్లకు …
Read More »గొల్లపూడిలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు
– భోగి మంటలు అంటేనే చెడును విడిచి మంచిని ఆహ్వానించడం – తెలుగు ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు – సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వంలో జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలతో రైతులు ఎదుర్కొన్న క్షోభను త్యజించి వాటిని సంక్రాంతి భోగి మంటల్లో వేసి కొత్త ఆశలకు నాంది పలుకుతున్నారని సమాచార, పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. …
Read More »ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా బుధవారం సాయంత్రం మహిళల కోలాట ప్రదర్శన, చెక్క భజన, శాస్త్రీయ నృత్యాలు, తంబోలా ఆటల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆస్వాదించారు. తూర్పు నియోజకవర్గంలోని వెల్ఫేర్ సెంటర్(నారా చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణం)లో తంబోలా, కోలాటం, కూచిపూడి, భరత నాట్య ప్రదర్శనలతో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమలో తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహ్మద్ నసీర్, పశ్చిమ నియోజకవర్గ …
Read More »జిఎంసి సంక్రాంతి సంబరాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భోగి పండుగ ప్రతి ఇంటిలో భోగ భాగ్యాలు అందించాలని కోరుకుంటున్నామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్టీఆర్ స్టేడియంలో బుధవారం ఎమ్మెల్యే గల్లా మాధవి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి జిఎంసి సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి పండుగ సందర్భంగా భోగి మంటలు వేయడం, చిన్నారులకు భోగి పళ్ళు పోయడం, గంగిరెద్దుల విన్యాసాలు, సన్నాయి మేళం, హరిదాసుల కీర్తనలతోపాటు టగ్ ఆఫ్ వార్ లో పాల్గొని ప్రజలను …
Read More »సంక్రాంతి సంబరాల క్రికెట్ పోటీలలో విజేతలుగా నిలిచిన నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ కార్యదర్శులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ సంక్రాంతి సంబరాలలో భాగంగా నగర పాలక సంస్థ వివిధ విభాగాల సిబ్బంది టీంలు, విలేఖరుల టీం మరియు డాక్టర్స్ టీంలతో ఈ నెల 13, 14 తేదీలలో బి.ఆర్ స్టేడియంలో నిర్వహించిన క్రికెట్ పోటీలలో నగర పాలక సంస్థ ప్లానింగ్ కార్యదర్శులు విజేతలుగా నిలిచి నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ను వారి క్యాంపు కార్యాలయాల్లో కలవగా వారు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సంక్రాంతి …
Read More »అంగరంగ వైభవంగా వెంకమ్మ పేరంటాల అమ్మవారి రథోత్సవం – పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
రామవరప్పాడు, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ పరిధిలోని రామవరప్పాడు గ్రామంలో వెలసిన శ్రీ వెంకమ్మ పేరంటాల అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా, అత్యంత ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రథోత్సవం ప్రారంభానికి ముందు రథానికి శాస్త్రోక్తంగా పూజలు చేసి, కర్పూర హారతులు సమర్పించి, కొబ్బరికాయ కొట్టి ఊరేగింపు ను ప్రారంభించారు. ఈ …
Read More »జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో యార్లగడ్డ ప్రత్యేక ప్రార్థనలు
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పెదఅవుటపల్లిలోని ప్రసిద్ధ బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. క్షేత్ర నిర్వాహకుల ప్రత్యేక ఆహ్వానం మేరకు బుధవారం రాత్రి పుణ్యక్షేత్రానికి చేరుకున్న ఎమ్మెల్యే వెంకట్రావ్ కు క్రైస్తవ మత పెద్దలు, భక్తులు ఘనస్వాగతం పలికారు. ముందుగా ఎమ్మెల్యే పుణ్యక్షేత్రంలో తంబి సమాధిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం క్షేత్ర బాధ్యులు పాలడుగు జోసఫ్ ఫాదర్, యార్లగడ్డ వెంకట్రావును శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. ఈసందర్బంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ కులమతాలకు …
Read More »అయ్యప్పకు ప్రత్యేక పూజలు చేసిన యార్లగడ్డ
హనుమాన్ జంక్షన్, నేటి పత్రిక ప్రజావార్త : మకర జ్యోతి దర్శనాన్ని పురస్కరించుకుని అయ్యప్ప ఆలయంలో ప్రభుత్వ విప్,గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాపులపాడు మండలం పెరికిడు గ్రామంలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో భోగి పండుగ సందర్భంగా బుధవారం రాత్రి మకర జ్యోతి దర్శనం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యార్లగడ్డ ముఖ్య అతిధిగా హాజరు కాగా ఆలయ నిర్వహకులు నూలు నరసింహారావు ఆధ్వర్యంలో అర్చకులు ఎమ్మెల్యే యార్లగడ్డ కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం గణపతి పూజ, అష్టాదశ …
Read More »బకాయిలు కొండంత… చెల్లింపులు గోరంత!
-పి.ఆర్.సి కమిటీ ఏర్పాటు,ఐ.ఆర్, ఆర్థిక బకాయిల చెల్లింపు కొరకు ఎస్ టి యు దశల వారి ఉద్యమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పి.ఆర్.సి అమలు, మద్యంతర భృతి మంజూరు, ఆర్థిక బకాయిల చెల్లింపు వంటి మేనిఫెస్టో హామీల అమలు కోరుతూ రాష్ట్రోపాధ్యాయ సంఘం.ఆం.ప్ర (ఎస్.టి.యు) ఆధ్వర్యంలో దశలవారి ఉద్యమం చేపడుతున్నట్టు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథ రెడ్డి,ఎల్.సాయి శ్రీనివాస్ తెలిపారు. సిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామని, ఉద్యోగులకు మెరుగైన పిఆర్సి అమలు చేస్తామని, ప్రభుత్వం …
Read More »
Prajavartha Online Telugu News