Breaking News

Daily Archives: January 16, 2026

ఆటోమేటిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ అమలుకు గాను APSRTC కు గవర్నెన్స్ నౌ జాతీయ అవార్డు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందిస్తూ ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకున్న Andhra Pradesh State Road Transport Corporation (ఏ.పి.ఎస్.ఆర్.టి.సి.)తాజాగా మరో గౌరవప్రదమైన జాతీయ అవార్డును తన ఖాతాలో వేసుకుంది. 2025 సంవత్సరానికి గాను “గవర్నెన్స్ నౌ – 6వ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సమ్మిట్స్&అవార్డ్స్”కార్యక్రమంలోఆటోమేటిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్అమలుకు గాను ఏ.పి.ఎస్.ఆర్.టి.సి.కి ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. వివిధ ప్రాంతాలు, భాషలకు చెందిన ప్రయాణికులు నిత్యం అనేక అవసరాలు, పనుల నిమిత్తం బస్ స్టేషన్లను ఆశ్రయిస్తుంటారు. …

Read More »

ఆత్మీయులందరికి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మార్తాండుడి మకరరాశి ప్రవేశం మకర సంక్రాంతికి ఆహ్వానం. ఉత్తరాయణం పుణ్యకాలం ఉత్తమ గతులకు శ్రేయస్కరం.. పుష్యమి పలకరింపులు ప్రకృతి పులకరింపులు… భోగి, సంక్రాంతి, కనుమ ముచ్చటగా మూడు రోజుల పండుగే ఈ మకర సంక్రాంతి.. భోగి మంటలో చెడుని పారద్రోలి, మంచికి ఆహ్వానం పలుకుదాం.. ప్రాతః కాలంలో పిల్లలు పెద్దలు అందరూ కలసి, భోగి మంటలు వేసి, కేరింతలు కొడుతూ ఆట, పాటలతో నృత్యాలు చేస్తారు… ఇంటి ముంగిట కన్నె పిల్లలు వేసే ముగ్గులు,ఆ ముగ్గులలో పెట్టె …

Read More »

గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా కె.మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా కె.మయూర్ అశోక్ ఐఏఎస్ శనివారం భాధ్యతలు స్వీకరించనున్నారు. మయూర్ అశోక్ గతంలో తెనాలి సబ్ కలెక్టర్, విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహించి, ప్రస్తుతం విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వం ది.12.1.2026న జిఓ ఆర్టీ నం.63 మేరకు గుంటూరు నగర కమిషనర్ గా బదిలీ అయ్యారు.

Read More »

అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు భవిష్యత్ లో మరింత ఉన్నత బాధ్యతలు పొందాలని కోరుకుంటున్నామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా బదిలీపై పై వెళ్తున్న సందర్భంగా ఆయనకు శుక్రవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశమందిరంలో నగర పాలక సంస్థ అధికారులు సిబ్బంది ఆధ్వర్యంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు అధ్యక్షతన అభినందన …

Read More »

అత్యద్భుతంగా కొనసాగిన సాంస్కృతిక ప్రదర్శనలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సరస్ మేళా ప్రాంగణం లోని కళా వేదికపై శుక్రవారం సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు అత్యద్భుతంగా కొనసాగాయి. గుజరాత్ రాష్ట్ర కళాకారులు గూమర్ సాంప్రదాయ నృత్యాలు అద్భుతంగా ప్రదర్శించారు. పొన్నూరు శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్, కళాకారులు భక్తి, సినీ, డీజే పాటలకు హుషారుగా కోలాట ప్రదర్శన చేశారు. ఫిరంగిపురం కార్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థకు చెందిన బాలికలు జానపద, డప్పు , నృత్యాలు, కోలాటం ప్రదర్శించారు. డీఆర్డీఏ ఎపీఎం నాగేశ్వరరావు సినీ గీతాలు, రేష్మా జానపద నృత్యం …

Read More »

అధిక సంఖ్యలో మేళాను సందర్శిస్తున్న ప్రజలు

-నాచురల్ ఫార్మింగ్, బ్యాంబో మరియు అగ్రి మార్కెటింగ్ పై శిక్షణ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మినీ భారత్ గా భారతదేశ సాంస్కృతి, సాంప్రదాయాల ప్రతీకగా దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలు సభ్యులు తయారుచేసిన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలకు నిర్వహిస్తున్న సరస్ మేళా అఖిలభారత డ్వాక్రా బజార్ ను శుక్రవారం కనుమ పర్వదినం రోజు అత్యధిక సంఖ్యలో ప్రజలు సందర్శించారు. ఉదయం నుంచే ప్రజల రద్దీ కొనసాగింది సాయంత్రం సమయంలో ఇది మరింత ఎక్కువైంది. ప్రజలు అత్యధిక సంఖ్యలో వస్తుండటంతో జిల్లా కలెక్టర్ …

Read More »

న్యాయ సేవాధికార సంస్ధలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా న్యాయ సేవాధికార సంస్ధలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ కార్యదర్శి మరియు సివిల్ జడ్జి సయ్యద్ జియో ఉద్దీన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. న్యాయ సేవాధికార సంస్ధలో ఒక రికార్డు అసిస్టెంట్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఒక ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టును ఓపెన్ కేటగిరీలో రెగ్యులర్ ప్రాతిపదికన నియమించుటకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ కు పదవ …

Read More »

సరస్ మేళా కు ప్రజల నుంచి అనూహ్య స్పందన

-గురువారం నాటికి 12 లక్షలకు పైగా ప్రజలు సందర్శన -ఆదివారం తో ముగియనునున్న సరస్ మేళా -ఏర్పాట్లపై సందర్శకులు పూర్తి సంతృప్తి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యుల కళా నైపుణ్యం, వ్యాపార దక్షతను ప్రతిబింబించేలా నల్లపాడు రోడ్డు రెడ్డి కళాశాల సమీపంలో  జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సరస్ మేళా అఖిలభారత డ్వాక్రా బజార్ కు ప్రజల నుంచి  అనుహ్య స్పందన లభిస్తుంది. జనవరి ఆరవ తేదీ నుంచి సరస్ మేళాలో అమ్మకాలు ప్రారంభవగా, …

Read More »

ఉద్యోగులను నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం

-సంక్రాంతికి డీఏ, ఐఆర్‌, పీఆర్సీ ఏదీ ? -రూ.35వేల కోట్లకుపైగా బకాయిలుంటే..ఇచ్చింది గోరంతా? -ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఎన్నికల హామీలు అమలు చేయాలి -సీపీఎస్‌/జీపీఎస్‌ విధానాన్ని పున:సమీక్షించాలి -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం నమ్మించి నట్టేట ముంచుతోందని, ఉద్యోగుల ఇంట సంక్రాంతి లేకుండా వారి బకాయిలు పూర్తిస్థాయిలో విడుదల చేయకుండా నిరాశ చూపిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పేరొకనానరు. కూటమి ప్రభుత్వం …

Read More »

ఖమ్మం బహిరంగ సభకు భారీగా తరలిరావాలి

-ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం -వాడవాడలా భాగస్వాములు కావాలి -సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ -ఇంటికొకరు పార్టీ శ్రేణులు నూతనుత్తేజంతో కదలిరావాలి -కోటి మందికి చేరేలా శతాబ్ది ఉత్సవాల ప్రచారం -బస్సులు, వాహనాలు, రైళ్ల ఏర్పాట్లు -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఖమ్మంలో ఈనెల 18వ తేదీన జరగనున్న సీపీఐ శతాబ్ధి వార్షికోత్సవ భారీ బహిరంగ సభ, ప్రదర్శన ఒక చారిత్రాత్మకంగా నిలవనుందని, ఆంధ్రప్రదేశ్‌ నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు ఉత్సాహంగా తరలిరావాలని సీపీఐ జాతీయ …

Read More »