Breaking News

Daily Archives: January 19, 2026

అర్జీల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

-అర్జీలు పరిష్కార తీరు పారదర్శకంగా, నాణ్యతతో ఉండాలి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజలు సమర్పించిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఆర్డీవో కార్యాలయ పరిపాలన అధికారి యం.సుజాత సూచించారు. సోమవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో డివిజన్ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అందజేసిన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయా శాఖల వారీగా వచ్చిన …

Read More »

యోగి వేమన బోధనలు నేటికీ దారి చూపుతున్నాయి

-వేమన జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఘన నివాళులు – ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 18న యోగి వేమన జయంతిని పురస్కరించుకుని సోమవారం రాజమహేంద్రవరం లోని జిల్లా కలెక్టరేట్‌లో యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి జిల్లా కలెక్టర్ (ఎఫ్‌ఏసీ) / జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ పాల్గొని వేమన సందేశాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఇంచార్జి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర …

Read More »

గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య పనుల వేగవంతానికి ఆదేశాలు

-డీడబ్ల్యూఎస్‌ఎం సమావేశంలో ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య పనులను మరింత వేగవంతం చేయాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా నీరు మరియు పారిశుద్ధ్య మిషన్‌ (DWSM) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ మిషన్ (SBM), వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు, జల్ జీవన్ మిషన్ (JJM) పనుల పురోగతిని సమీక్షించారు. …

Read More »

నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన

-రహదారి నిర్మాణ పనుల పరిశీలన – నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశం -గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు ఈ దుస్థితిలో ఉన్నాయని మంత్రి దుర్గేష్ విమర్శ -సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి బాటలు నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ సోమవారం నిడదవోలు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను, ముఖ్యంగా రహదారి నిర్మాణాలను …

Read More »

ఆరోగ్యాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం

– రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు క్యాంపు కార్యాలయంలో 35 మంది బాధితులకు రూ.22.07 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీ పత్రాలు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్  ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి క్రింద 591 మందికి రూ.4.31 కోట్ల లబ్ధి చేకూర్చామని మంత్రి దుర్గేష్ వెల్లడి ఆపత్కాలంలో నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఆపన్న హస్తం అందిస్తోందని తెలిపిన మంత్రి దుర్గేష్ నిడదవోలు: పేదల సంక్షేమమే ధ్యేయంగా, …

Read More »

పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్ అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి

– ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఆదేశాలు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రీవెన్స్ ద్వారా అందిన అర్జీలు మళ్లీ రీ–ఓపెన్ కాకుండా ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సర్వే శాఖకు సంబంధించిన రీ–ఓపెన్ కేసులు అధికంగా ఉన్నాయని పేర్కొంటూ, వాటిని అత్యవసర ప్రాతిపదికన పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (PGRS)తో …

Read More »

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 40 గంటల మధ్యవర్తిత్వ శిక్షణా తరగతులు

-న్యాయవాదులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వ విధానాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడంలో భాగంగా 40 గంటల మధ్యవర్తిత్వ శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు.  సోమవారం ఉదయం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో సుప్రీం కోర్టు మధ్యవర్తిత్వం మరియు రాజీ ప్రాజెక్టు కమిటీ (MCPC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మధ్యవర్తిత్వ శిక్షణా కార్యక్రమానికి ఆమె …

Read More »

సంక్షేమ ప‌థ‌కాల‌కు ఆద్యుడు ఎన్టీ రామారావు

-భావిత‌రాల భ‌విష్య‌త్తు కోస‌మే సీఎం చంద్ర‌బాబు పోరాటం* -18 నెల‌ల్లో అద్దంకికి రూ.90 కోట్ల‌తో రోడ్లు -రాబోయే 30 ఏళ్లు ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేస్తున్నాం -ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌స్తుతం అమ‌లవుతున్న అనేక సంక్షేమ ప‌థ‌కాల‌కు మాజీ ముఖ్య‌మంత్రి, స్వ‌ర్గీయ ఎన్టీ రామారావు ఆద్యుడ‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం నాడు అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి గొట్టిపాటి ప‌ర్య‌టించారు. కొప్ప‌రం, ప‌త్తేపురం గ్రామాల్లో నందమూరి …

Read More »

ఆటిజం సపోర్ట్ సెంటర్ సందర్శన

-బడి బయట విద్యార్థి తండ్రికి కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి విద్యార్ధిని బడిలో చేర్పించిన పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ IAS., గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో చినకాకాని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘ఆటిజం సపోర్ట్ సెంటర్’ ను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ IAS., సోమవారం సందర్శించారు. కేంద్రంలో విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులతో ముచ్చటించారు. ఆటిజం సపోర్ట్ సెంటర్ అందిస్తోన్న సేవలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్శనలో సమగ్ర శిక్ష …

Read More »

సామాజిక విప్లవాది యోగి వేమన

– రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత – అచ్చమైన తెలుగు వాడుక భాషలో వేమన పద్యాలు – సామాజిక రుగ్మతల నిర్మూలనకు కలం ఝుళిపించిన యోగి – కళలకు, కళాకారులకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం : మంత్రి సవిత – కటారుపల్లిలో జరిగిన యోగి వేమన రాష్ట్ర స్థాయి జయంత్యోత్సవం – పాల్గొన్న మంత్రి సవిత, ఎంపీ, ఎమ్మెల్యేలు – వేమన సమాధి వద్ద ప్రత్యేక పూజలు, ఘన నివాళులు కదిరి, నేటి పత్రిక ప్రజావార్త : కుల, మత భేదాలకతీతంగా …

Read More »