Breaking News

Daily Archives: January 20, 2026

రేపటిలోగా (జనవరి 21) శాఖల వారీ పనుల జాబితా, అంచనాలకు తుది రూపం అందించాలి

-గోదావరి పుష్కరాల సన్నాహక సమీక్షలో ఇంచార్జి జిల్లా కలెక్టర్, కమిషనర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో గోదావరి పుష్కరాలు–2027 నేపథ్యంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈలోగా అన్ని శాఖల వారీగా చేపట్టాల్సిన పనుల జాబితా, అంచనాలకు తుది రూపం దిద్దాల్సిన అవసరం ఉందని ఇంచార్జి జిల్లా కలెక్టర్ / జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. పుష్కరాల నిర్వహణకు అవసరమైన బడ్జెట్‌లో తగిన కేటాయింపులు జరగాలంటే, అందుకు …

Read More »

జనవరి 28 న పిడిఎస్ బియ్యం బహిరంగ వేలం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా పరిధిలో నిత్యావసర వస్తువుల చట్టం–1955 కింద 6-A కేసులలో స్వాధీనపరచుకున్న 3335.8286 క్వింటాళ్ల ప్రజా పంపిణీ (PDS) బియ్యంను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు జిల్లా కలెక్టర్ (పౌర సరఫరాలు) వై. మేఘా స్వరూప్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలం జనవరి 28న మధ్యాహ్నం 3 గంటలకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ (పౌర సరఫరాలు) కార్యాలయం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ వద్ద నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వేలంలో పాల్గొనదలచిన వారు జనవరి 27న …

Read More »

ఓఎన్‌జీసీ సిఎస్ఆర్ నిధులతో గ్రామాలలో మౌలిక సదుపాయాలు… : జిల్లా కలెక్టర్

కృత్తివెన్ను, నేటి పత్రిక ప్రజావార్త : కార్పొరేట్ సామాజిక బాధ్యత(సిఎస్ఆర్) కింద ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ) అందించే నిధులతో గ్రామాలలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన కృత్తివెన్నులోని మండల తహసీల్దారు కార్యాలయంలో పెడన నియోజకవర్గ శాసనసభ్యుడు కాగిత కృష్ణ ప్రసాద్ కలిసి ఓఎన్‌జీసీ సిఎస్ఆర్ నిధుల వినియోగంపై సంబంధిత అధికారులతో చర్చించారు. చినపాండ్రాకలోని ఓఎన్‌జీసీ కార్యాచరణ ప్రాంతంలో (ఆపరేషనల్ ఏరియా) ఉన్న కృత్తివెన్ను, బంటుమిల్లి …

Read More »

బాల్య వివాహ నిర్మూలనకు 100 రోజుల జాతీయ ప్రచార కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో బాల్య వివాహాలు జరగకుండా నిరోధించేందుకు అందరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మత పెద్దలను కోరారు. మంగళవారం ఉదయం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో బాల్య వివాహ నిర్మూలనకు 100 రోజుల జాతీయ ప్రచార కార్యక్రమం లో భాగంగా జిల్లా ఉన్నతాధికారులు, మత పెద్దలతో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా జిల్లా పేద జిల్లా …

Read More »

వ్యవసాయ అధికారులు, అభ్యుదయ రైతులతో సంయుక్త సమావేశం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా తొలకరి వర్షాలు రాక మునుపే విత్తనపు బంతుల (సీడ్ బాల్స్) వెదజల్లే కార్యక్రమాన్ని( పీఎండిఎస్ )జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో ప్రకృతి వ్యవసాయంపై వ్యవసాయ అధికారులు, అభ్యుదయ రైతులతో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వనరులను వినియోగించుకొని వ్యవసాయం చేస్తే సుస్థిరంగా ఉంటుందని, …

Read More »

28వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్‌ పోస్టర్‌ ఆవిష్కరన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 28 నుంచి 30 వరకు నిర్వహించనున్న ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ స్టేట్ మీట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారిని తిరుపతి ఎస్.వి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సిబ్బంది మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆహ్వానించారు. ఈ సందర్భంగా 28వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్‌ (2025–26) కు సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. జనవరి 28న ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానున్న …

Read More »

బర్డ్స్ హాస్పిటల్ లో రహదారి భద్రత అవగాహన సదస్సు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రహదారి భద్రత మాసో త్సవాల్లో భాగంగా తిరుపతి నగరంలోని BIRRD (బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది డిసేబుల్డ్) హాస్పిటల్‌లో డైరెక్టర్ శ్రీ జగదీష్ గారి ఆధ్వర్యంలో రవాణా శాఖ అధికారులు రహదారి భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జోన్ ప్రాంతీయ సంయుక్త రవాణా కమిషనర్ శ్రీమతి డాక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలో అత్యవసర ట్రామా కేర్ ఇన్‌స్టిట్యూట్‌ను పూర్తి సిబ్బందితో స్థాపించాల్సిన అవసరం గురించి …

Read More »

నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించుటకు పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలి

-జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని, నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని, పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు సక్రమంగా అమలు అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫిరెన్స్ హాలు నందు జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డి.ఐ.ఈ.పి.సి) జరిగిన …

Read More »

తిరుపతిలో రహదారి భద్రత హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీ,

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో తిరుపతిలో రహదారి భద్రత మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల నుంచి TUDA మునిసిపల్ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ విజయవంతంగా నిర్వహించారు. రవాణా శాఖ, పోలీస్ శాఖ, బాలాజీ బైక్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో వాహనదారులు పాల్గొన్నారు.ఈ ర్యాలీలో అధికారులు, వాహనదారులు రోడ్డు భద్రతా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం, …

Read More »

జాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కోనేటి ఆదిమూలం, శాసనసభ్యులు ,సత్యవేడు నియోజకవర్గం వారి చేతుల మీదుగా జాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ మరియు సిడాప్ ఆధ్వర్యంలో కోనేటి ఆదిమూలం ఆదేశాల మేరకు 22-1-2026 తేదీన అనగా ఈ గురువారం ఉదయం 8 గంటల నుంచి మండల ప్రజా పరిషత్ కార్యాలయం(MPDO Office, నాగలాపురం, తిరుపతి జిల్లా, 517589 నందు జాబ్ మేళా నిర్వహించబడును. ఇందులో భాగంగా ఎమ్మెల్యే, కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ సత్యవేడు …

Read More »