Breaking News

Daily Archives: January 21, 2026

రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా ఎలక్ట్రోల్ మ్యాపింగ్ విషయంలో రాష్ట్రంలోని ఇతర అర్బన్ నియోజకవర్గాలతో పోలిస్తే 95 గుంటూరు తూర్పు, 94 పశ్చిమ నియోజకవర్గాల్లో 50 శాతంకి పైగా మ్యాపింగ్ చేసినందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రత్యేకంగా అధికారులు, బిఎల్ఓలకు అభినందనలు తెలిపారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఈఆర్ఓ, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. బుధవారం జిఎంసి ప్రధాన కార్యాలయంలోని అదనపు కమిషనర్ చాంబర్ లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ …

Read More »

శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు పనుల వేగావంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు పనుల వేగావంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, స్థలాలు లేదా భవనాలు కోల్పోతున్న ప్రతి ఒక్కరికీ నిబందనల ప్రకారం టిడిఆర్ బాండ్లు, నష్ట పరిహారం అందిస్తామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో కమిషనర్ కె.మయూర్ అశోక్ తో కలిసి శంకర్ విలాస్ వంతెన నిర్మాణంకు సంబందించి ప్రభావిత భవన యజమానులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ శంకర్ విలాస్ …

Read More »

అన్నక్యాంటీన్లలో అవసరం లేని వస్తువులను తొలగించి, పరిశుభ్రం ఉంచాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో వినియోగించని లేదా అవసరం లేని వస్తువులను తొలగించి, పరిశుభ్రం ఉంచాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. బుధవారం ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలోని అన్న క్యాంటీన్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. ఉపయోగించని వస్తువులను తొలగించాలన్నారు. ఆహారం వడ్డించే ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలన్నారు. మౌలిక వసతులకు సంబంధించి …

Read More »

ప్రతి అసెస్మెంట్ నుండి పన్ను నూరు శాతం వసూళ్లు కావాలి

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ప్రతి అసెస్మెంట్ నుండి పన్ను నూరు శాతం వసూళ్లు కావాలని, ఆర్ఐల వారీగా ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. బుధవారం పెద్దపలకలూరులోని పలు ప్రాంతాల్లో పర్యటించి, ఆస్తి పన్ను వసూళ్లు, పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా తదితర అంశాలపై పరిశీలించి, అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డ్ సచివాలయాల వారీగా ఆస్తి, ఖాళీ స్థల, నీటి …

Read More »

పెమ్మసాని కలిసిన జిఎంసి కమిషనర్ మయూర్ అశోక్

– నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర కార్పొరేషన్ కమిషనర్‌గా నూతనంగా పదవీ బాధ్యతలను స్వీకరించిన కే. మయూర్ అశోక్  బుధవారం నాడు గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణ సౌకర్యాల మెరుగుదల వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. నగరాభివృద్ధికి …

Read More »

ఇంటర్మీడియట్ పబ్లిక్ & ప్రాక్టికల్ పరీక్షలు–2026 సజావు నిర్వహణకు సమన్వయ సమావేశం

-ఫిబ్రవరి/మార్చి–2026 పరీక్షల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు – డి ఆర్వో టి సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టరేట్‌లోని జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్‌లో బుధవారం ఇంటర్మీడియట్ పబ్లిక్ మరియు ప్రాక్టికల్ పరీక్షలు–2026 నిర్వహణపై సమన్వయ సమావేశం జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఫిబ్రవరి/మార్చి–2026లో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలు ఎలాంటి అవాంతరాలు లేకుండా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు …

Read More »

సీతానగరంలో 22న IOCL లెవల్–III ఆఫ్‌సైట్ విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్

-పైప్‌లైన్ భద్రత, అత్యవసర చర్యలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం -మిథున్ కుమార్ శీలం, చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) పరిధిలోనిపారదీప్–హైదరాబాద్ పైప్‌లైన్ (PHPL) – రాజమహేంద్రవరం యూనిట్ ఆధ్వర్యంలో లెవల్–III ఆఫ్‌సైట్ ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆగ్నేయ ప్రాంత పైప్‌లైన్స్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ మిథున్ కుమార్ శీలం తెలిపారు. ఈ మాక్ డ్రిల్‌ను తూర్పు గోదావరి జిల్లా, సీతానగరం మండలం, సీతానగరం గ్రామ …

Read More »

వ్యాధుల నియంత్రణలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెంపు

-కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 3 విడతలుగా 9 రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు -క్షేత్రస్థాయి పర్యటనలకు కూడా ఏర్పాట్లు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యాధుల వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా సదరు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెంచేందుకు, అధికారులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ‘ఒన్ హెల్త్ ‘ ప్రోగ్రాం కింద నిర్దేశించిన మార్గదర్శకాలు అనుసరించి వ్యాధుల నివారణలో సంబంధిత శాఖల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని నేషనల్ సెంటర్ ఫర్ డీసిజ్ …

Read More »

అధికారులు టాక్స్ బేస్ ను పెంచాల్సిన అవసరం ఉంది

– ఆటో అప్రూవల్ (14ఏ) దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలి – 90 శాతం రిటర్న్ ఫైలింగ్ ను 100 శాతానికి చేర్చాలి – రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యాపారస్తులపట్ల స్నేహ భావంతో వ్యవహరిస్తూ రాష్ట్రంలో పన్నుల రాబడిని పెంచి రాష్ట్ర పురోభివృద్ధికి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనాఉందని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. …

Read More »

గ‌ణ‌తంత్ర స్ఫూర్తితో వేడుక‌ల‌కు సిద్ధంకండి

– ప్ర‌గ‌తి ప‌థం, ప్ర‌జ‌ల‌ను చైత్య‌వంతుల‌ను చేసేలా శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న‌ – అధికారులు స‌మ‌న్వయంతో ప‌నిచేయండి – ఎన్‌టీఆర్ జిల్లాస్థాయి గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌పై క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాస్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలను గణతంత్ర స్ఫూర్తికి అనుగుణంగా ఘనంగా నిర్వ‌హించేందుకు అన్ని శాఖ‌ల అధికారులు స‌మన్వయంతో పనిచేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తిచేయాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. ఈ నెల 26న విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మునిసిప‌ల్ మైదానంలో ప్ర‌ప‌థంగా ఎన్‌టీఆర్ …

Read More »