మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఎన్నికల అవార్డు అందుకున్నారు. ఆదివారం ఉదయం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చేతులమీదుగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తమ జిల్లా కలెక్టర్ అవార్డును స్వీకరించారు. 2002 ఓటర్ల జాబితా ను 2025 ఓటర్ల జాబితాతో అనుసంధానం చేసే ప్రత్యేక సవరణ కార్యక్రమం లో అత్యధికంగా …
Read More »Daily Archives: January 25, 2026
ఆల్ ఇండియా ఇంటర్-యూనివర్శిటీ నెట్‌బాల్ (మహిళలు) టోర్నమెంట్ కృష్ణ విశ్వవిద్యాలయం ఆతిథ్యం
-విజయవాడలోని మారిస్ స్టెల్లా కళాశాల ఫిబ్రవరి 14 నుండి 18 వరకు ఐదు రోజుల ఛాంపియన్‌షిప్: VC ప్రొఫెసర్ రామ్‌జీ -80 విశ్వవిద్యాలయాలు, దాదాపు 1,000 మంది క్రీడాకారులు పాల్గొంటారని అంచనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ విశ్వవిద్యాలయం (KRU), మచిలీపట్నం, ఫిబ్రవరి 14 నుండి 18 వరకు విజయవాడలోని మారిస్ స్టెల్లా కళాశాల (స్వయంప్రతిపత్తి)లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇండియా ఇంటర్-యూనివర్శిటీ నెట్‌బాల్ (మహిళలు) టోర్నమెంట్‌ను నిర్వహిస్తుందని వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ కె రామ్‌జీ ఆదివారం తెలిపారు. ఈ …
Read More »గత వైసీపీ సైకో పాలన రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టింది
-చంద్రబాబు నాయకత్వంతో మళ్లీ వెలుగుల బాట -కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నింటికీ కూడా క్రెడిట్ జగన్ కావాలని కోరుకోవడం వైసీపీ నాయకుల దివాళాకోరుతనానికి నిదర్శనం…మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్త్రీ శక్తి (ఉచిత బస్సు)పథకం, ఉచిత ఇసుక, డీఎస్సీ ద్వారా ఉద్యోగ కల్పన, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, పింఛన్ల పెంపు, యువతకు స్కిల్ డెవలప్మెంట్, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, గూగుల్, కాగ్నిజెంట్ వంటి అంతర్జాతీయ సంస్థల స్థాపన ఇవన్నీ కూటమి ప్రభుత్వమే చేసిన ఘనతలని మంత్రి …
Read More »వచ్చే నెల 17న ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
-జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం పురస్కరించుకుని -1-19 ఏళ్లలోపు ఉన్న 1.11 కోట్ల మందికి ఇవ్వాలని లక్ష్యం! -రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే నెల (ఫిబ్రవరి) 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 21వ ‘జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం’ జరగనుంది. ఏడాది నుంచి 19 ఏళ్లలోపు ఉన్న రాష్ట్రంలోని 1,11,63,762 మందికి అల్బెండజోల్ మాత్రలను ఉచితంగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ …
Read More »సీఎం సంస్కరణలతోనే డిస్కంలకు దేశస్థాయిలో మెరుగైన రేటింగ్‌లు
–విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైసీపీ హయాంలో నిర్వీర్యమైన రాష్ట్ర విద్యుత్ వ్యవస్థకు కూటమి ప్రభుత్వం పునర్జీవనం పోసిందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేపట్టిన సమగ్ర విద్యుత్ సంస్కరణల ఫలితంగానే రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) దేశ స్థాయిలో మెరుగైన రేటింగ్‌లు సాధించాయని మంత్రి తెలిపారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ …
Read More »గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రాజధాని అమరావతిలో మొట్ట మొదటిసారిగా నిర్వహిస్తున్న 77వ గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం అయింది. ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామల రావు, జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. సోమవారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర …
Read More »గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరులో జిల్లా స్థాయిలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదివారం పరిశీలించారు. ఏర్పాట్లు పక్కాగా చేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయి వేడుకలు గుంటూరులో పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. ఉదయం 11.30 గంటలకు వేడుకలు ప్రారంభం అవుతుందని తెలిపారు. జెండా వందనం, జిల్లా కలెక్టర్ ప్రసంగం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాల బహుకరణ ఉంటుంది. ఈ కార్యక్రమంలో …
Read More »డి.ఆర్.ఓ ఖాజావలికి రాష్ట్ర స్థాయి అవార్డు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి ఉత్తమ ఎలక్టోరల్ విధానాలను అమలు చేసినందుకు రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చేతుల మీదుగా అవార్డును ఆదివారం అందుకున్నారు. ఈ ఏడాది “నా భారత్ – నా ఓటు” (My India, My Vote) థీమ్ తో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రియాశీలకంగా పనిచేయడంతో జిల్లా …
Read More »ఓటుతో ప్రతీ ఒక్కరికీ సమానత్వం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఓటుతో ప్రతీ ఒక్కరికీ సమానత్వం లభించిందని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు.16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఓటరు అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిందన్నారు. కుల, మత బేధాలు లేకుండా వయోజనులందరికీ ఓటు హక్కును కల్పించడం ద్వారా సమాన అవకాశాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు. …
Read More »గణతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమం జిఎంసి PGRS రద్దు
-కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 26వ తేది సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు నగరపాలక సంస్థ జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల వలన “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం రద్దు చేయడమైనదని, నగర ప్రజలు గమనించి, ఏమైనా స్థానిక సమస్యలు ఉంటే జిఎంసి కాల్ సెంటర్ 0863 2345103 కి కాల్ చేయవచ్చని తెలిపారు .
Read More »
Prajavartha Online Telugu News