Breaking News

Daily Archives: January 26, 2026

APCRDA ప్రధాన కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన కమిషనర్ కె.కన్నబాబు ఐ.ఏ.ఎస్. 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి- రాయపూడిలోని ఏపిసిఆర్డిఏ ప్రధాన కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. వేడుకలలో కమిషనర్ కె.కన్నబాబు ఐ.ఏ.ఎస్., అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవ తేజ ఐ.ఏ.ఎస్.  పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కమిషనర్‌  జెండా ఆవిష్కరించి, మన రాజ్యాంగం, అది నేర్పిన విలువలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని నడుచుకోవాలని, రాజ్యాంగ స్పూర్తితో విధులు నిర్వర్తించాలని దిశానిర్దేశం చేశారు. అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నందుకు ఉద్యోగులుగా గర్వించాలన్నారు. ఈ బృహత్తర నిర్మాణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ …

Read More »

బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో తోకల రామకృష్ణ

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : భారత చైతన్య యువజన పార్టీ జనవరి 26 సోమవారం 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీవై పార్టీ కైకలూరు నియోజకవర్గం నాయకులు, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల రామకృష్ణ హాజరయ్యారు. ముందుగా రామకృష్ణ భరతమాత చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం జండా ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది. అనంతరం …

Read More »

ఘనంగా బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 26 సోమవారం ఉదయం మంగళగిరి భారత చైతన్య యువజన పార్టీ కేంద్ర కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాను ఆవిష్కరించి మన దేశ మహనీయులకు నివాళులు అర్పించి వారి త్యాగాలను స్మరించుకుంటూ భారత దేశ రాజ్యాంగ స్ఫూర్తిని పొందారు. అనంతరం పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ బ్రిటిష్ వారి దగ్గర …

Read More »

దేశ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, నగరి ఎమ్మెల్యే భాను, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ జాతీయ జెండాకు వందనం చేసి, తిరుపతి జిల్లాలో …

Read More »

మీ ఆరోగ్యం – మా బాధ్యత

-నవరత్నం కేశవరావు ఛారిటబుల్ ట్రస్ట్ ‘వరుణ్ హెల్త్ సెంటర్స్’ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కస్టమర్ దేవుళ్ళకి ఎప్పుడూ పెద్దపీట వేసే వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ప్రజల ఆరోగ్య భద్రత కోసం నవరత్నం కేశవరావు ఛారిటబుల్ ట్రస్ట్ ‘వరుణ్ హెల్త్ సెంటర్స్’ స్థాపించిన విషయం విదితమే. దానిలో భాగంగా ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా కొనసాగేందుకు అవగాహనతో పాటు వైద్య సేవలు, వైద్యపరీక్షలు, ఎక్సరే & ఈసిజి, మందుల షాప్ ప్రవేశపెట్టి సేవలు అందిస్తున్నారు. మనలో చాలామంది 45 ఏళ్లు దాటుతూ 50 …

Read More »

లౌకిక రాజ్యాంగ ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడుకుందాం

-సామ్యవాద, లౌకిక పదాల తొలగింపునకు మోదీ, అమిత్‌షా కుట్ర -స్వేచ్ఛా, సమానత్వంతోనే ప్రజాస్వామ్యానికి మనుగడ -రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా నేతృత్వాన రాజ్యాంగంపైన, రాజ్యాంగ హక్కులపైన దాడులు జరుగుతున్నాయని, ఈ తరుణంలో భారత రాజ్యాంగ సంరక్షణ కోసం మనమంతా పునరంకితమవ్వాలని, లౌకిక ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడుకోవాలని, రాజ్యాంగ పీఠిక ప్రకటించిన ఆశయాలకు బద్ధులమై ఉండాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య …

Read More »

ఐకమత్యంతోనే నగరాభివృద్ది సాధ్యం – రాయన భాగ్యలక్ష్మి, నగర మేయర్

-ప్రజలందరికీ స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం అందించింది మన రాజ్యాంగ్యం – డాక్టర్ డి చంద్రశేఖర్, ఇంచార్జ్ కమిషనర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధుల ఐకమత్యంతోనే నగరాభివృద్ది సాధ్యమన్నారు విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి. సోమవారం ఉదయం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాన కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు, ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ …

Read More »