Breaking News

Monthly Archives: January 2026

గణతంత్ర దినోత్సవ వేళ విద్యుత్ దీప కాంతులు విరజిమ్ముతున్న అసెంబ్లీ, సచివాలయ భవనాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మరియు సచివాలయ భవనాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.రాష్ట్ర సచివాలయంలోని 5 భవనాలు సహా అసెంబ్లీ భవనాన్ని వివిధ రకాల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించడంతో రాత్రి సమయంలో ఆభవనాలన్నీ విద్యుత్ కాంతులతో మిరుమిట్లు గొలుపుతూ విద్యుత్ కాంతులు వెదజల్లుతున్నాయి.ఆయా భవనాలతో పాటు అసెంబ్లీ, సచివాలయం ప్రాంగణాల్లోని రోడ్లకు ఇరువైపుల గల రహదారులు, సెంట్రల్ పార్కులో వివిధ రంగులతో కూడిన ప్రత్యేక …

Read More »

నేడు రాష్ట్ర శాసన మండలి, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టుల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని 26వ తేది సోమవారం ఉ.8 గం.లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ భవనం ప్రాంగణంలో జరిగే వేడుకల్లో శాసన మండలి అధ్యక్షులు కె.మోషేన్ రాజు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఉ.8.15 గం.లకు రాష్ట్ర అసెంబ్లీ భవనం వద్ద రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. సచివాలయం మొదటి భవనం: ఎపి సచివాలయం మొదటి భవనం వద్ద సోమవారం …

Read More »

వచ్చే నెల 17న ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

-1-19 ఏళ్లలోపు ఉన్న 1.11 కోట్ల మందికి ఇవ్వాలని లక్ష్యం! -రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే నెల( ఫిబ్రవరి ) 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 21వ ‘జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం’ జరగనుంది. ఏడాది నుంచి 19 ఏళ్లలోపు ఉన్న రాష్ట్రంలోని 1,11,63,762 మందికి అల్బెండజోల్ మాత్రలను ఉచితంగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. ఏడాది నుంచి ఐదేళ్లలోపు …

Read More »

నెల్లూరు జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు

-రాష్ట్ర స్థాయిలో దక్కిన 5వ స్థానం -ఉత్తమ ఎన్నికల నిర్వహణ – స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో విశేష ప్రతిభ కు గుర్తింపుగా అవార్డ్ నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో అత్యుత్తమ ఎన్నికల మ్యాపింగ్‌ను సమర్థవంతంగా అమలు చేసినందుకు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లకు రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ చేతుల మీదుగా ఈ …

Read More »

ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు చాలా విలువైన ఆయుధమని, దేశ భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం ఉదయం నగరంలోని లక్ష్మీ టాకీస్ కూడలి నుండి జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా మరల లక్ష్మి టాకీస్ కు చేరుకునే విధంగా తొలుత పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రారంభించి స్వయంగా సైకిల్ తొక్కారు. …

Read More »

కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తమ జిల్లా కలెక్టర్ అవార్డు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఎన్నికల అవార్డు అందుకున్నారు. ఆదివారం ఉదయం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చేతులమీదుగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తమ జిల్లా కలెక్టర్ అవార్డును స్వీకరించారు. 2002 ఓటర్ల జాబితా ను 2025 ఓటర్ల జాబితాతో అనుసంధానం చేసే ప్రత్యేక సవరణ కార్యక్రమం లో అత్యధికంగా …

Read More »

ఆల్ ఇండియా ఇంటర్-యూనివర్శిటీ నెట్‌బాల్ (మహిళలు) టోర్నమెంట్ కృష్ణ విశ్వవిద్యాలయం ఆతిథ్యం

-విజయవాడలోని మారిస్ స్టెల్లా కళాశాల ఫిబ్రవరి 14 నుండి 18 వరకు ఐదు రోజుల ఛాంపియన్‌షిప్‌: VC ప్రొఫెసర్ రామ్‌జీ -80 విశ్వవిద్యాలయాలు, దాదాపు 1,000 మంది క్రీడాకారులు పాల్గొంటారని అంచనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ విశ్వవిద్యాలయం (KRU), మచిలీపట్నం, ఫిబ్రవరి 14 నుండి 18 వరకు విజయవాడలోని మారిస్ స్టెల్లా కళాశాల (స్వయంప్రతిపత్తి)లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇండియా ఇంటర్-యూనివర్శిటీ నెట్‌బాల్ (మహిళలు) టోర్నమెంట్‌ను నిర్వహిస్తుందని వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ కె రామ్‌జీ ఆదివారం తెలిపారు. ఈ …

Read More »

గత వైసీపీ సైకో పాలన రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టింది

-చంద్రబాబు నాయకత్వంతో మళ్లీ వెలుగుల బాట -కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నింటికీ కూడా క్రెడిట్ జగన్ కావాలని కోరుకోవడం వైసీపీ నాయకుల దివాళాకోరుతనానికి నిదర్శనం…మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్త్రీ శక్తి (ఉచిత బస్సు)పథకం, ఉచిత ఇసుక, డీఎస్సీ ద్వారా ఉద్యోగ కల్పన, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, పింఛన్ల పెంపు, యువతకు స్కిల్ డెవలప్మెంట్, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, గూగుల్, కాగ్నిజెంట్ వంటి అంతర్జాతీయ సంస్థల స్థాపన ఇవన్నీ కూటమి ప్రభుత్వమే చేసిన ఘనతలని మంత్రి …

Read More »

వచ్చే నెల 17న ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

-జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం పురస్కరించుకుని -1-19 ఏళ్లలోపు ఉన్న 1.11 కోట్ల మందికి ఇవ్వాలని లక్ష్యం! -రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే నెల (ఫిబ్రవరి) 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 21వ ‘జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం’ జరగనుంది. ఏడాది నుంచి 19 ఏళ్లలోపు ఉన్న రాష్ట్రంలోని 1,11,63,762 మందికి అల్బెండజోల్ మాత్రలను ఉచితంగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ …

Read More »

సీఎం సంస్కరణలతోనే డిస్కంలకు దేశస్థాయిలో మెరుగైన రేటింగ్‌లు

–విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైసీపీ హయాంలో నిర్వీర్యమైన రాష్ట్ర విద్యుత్ వ్యవస్థకు కూటమి ప్రభుత్వం పునర్జీవనం పోసిందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేపట్టిన సమగ్ర విద్యుత్ సంస్కరణల ఫలితంగానే రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) దేశ స్థాయిలో మెరుగైన రేటింగ్‌లు సాధించాయని మంత్రి తెలిపారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ …

Read More »