గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జూన్ 30, 2025 లోపు ఏర్పాటైన అనధికార, అక్రమ లే ఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడానికి దరఖాస్తులు అందించడానికి మరో 3 నెలలు కాలపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం జిఓ ఆర్టీ నం.49 ద్వారా పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, అర్హత కలిగిన ప్లాట్ల కొనుగోలుదారులు, లే అవుట్ యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ …
Read More »Monthly Archives: January 2026
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కల్గి ఉండాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కల్గి ఉండాలని, బిఎల్ఓలు ఎప్పటికప్పుడు ఓటు నమోదుపై అవగాహన కల్గించాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్ఓ), నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో పశ్చిమ నియోజకవర్గ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి చల్లా ఓబులేసుతో కలిసి నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బందితో ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో …
Read More »స్వర్ణ ఆంద్ర – స్వచ్చ ఆంద్ర కార్యక్రమం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణ ఆంద్ర – స్వచ్చ ఆంద్ర కార్యక్రమంలో భాగంగా శనివారం (ఈ నెల 24వతేదీ) గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో “జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర’’ థీమ్ తో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఎదురు, జిఎంసి ఎదురు, పివికే నాయుడు మార్కెట్ లోని టాయ్ లెట్స్ లను శుభ్రపరిచే కార్యక్రమం జరుగుతుందని, అలాగే నగరంలోని వార్డ్ సచివాలయాల వారీగా కూడా జరిగే కార్యక్రమాల్లో నగర ప్రజలు విరివిగా పాల్గొనాలని నగర …
Read More »అన్నక్యాంటీన్లలో మౌలిక వసతులపై నోడల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో మౌలిక వసతులపై నోడల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శుక్రవారం అమరావతి రోడ్ లోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలోని అన్న క్యాంటీన్లలో లైట్లు, ఫ్యాన్ లు, త్రాగునీరు, పారిశుధ్యంపై నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజు వచ్చే ప్రజల సంఖ్యకు అనుగుణంగా …
Read More »అభివృద్ధి పనుల్లో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు, కాలపరిధి పాటించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ చేపట్టే అభివృద్ధి పనుల్లో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు, కాలపరిధి పాటించాలని, ప్రతి పనికి థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ తప్పనిసరని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. శుక్రవారం ముత్యాలరెడ్డి నగర్, కోదండరామయ్య నగర్, ఇన్నర్ రింగ్ రోడ్, నగరాలులోని పలు ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో అందులోనూ …
Read More »పరాక్రమ్ దివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “మేరా యువ భారత్-మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ” ఆధ్వర్యంలో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినోత్సవం లో భాగంగా పరాక్రమ్ దివాస్ అనే కార్యక్రమాన్ని K.G.R.L డిగ్రీ కాలేజ్ భీమవరం లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కళాశాల ప్రిన్సిపాల్ ఇంటి రామచంద్రమూర్తి గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస గారిని అందరూ ఆదర్శంగా తీసుకొని ఎదగాలని కోరుకున్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస గారి జీవితంలో జరిగిన కొన్ని …
Read More »ఈ వసంత పంచమి నాడు జ్ఞాన కాంతులను పంచుతూ విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జ్ఞానానికి, వివేకానికి ప్రతీక అయిన వసంత పంచమీ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని, కేంద్ర, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డా. చంద్ర శేఖర్ ఎమ్మసాని ప్రేరణతో తపాలా శాఖ 4 మరియు 5వ తరగతి చదువుతున్న బడుగు విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని వసంత పంచమి నాడు అనగా శుక్రవారం ఫిలాటలీ బ్యూరో, విజయవాడ జి.పి.ఒ. కాళేశ్వర రావు మార్కెట్, విజయవాడ వద్ద తపాలా శాఖ నిర్వహించింది. ప్రతి పుస్తకంతో పాటుగ్రామీణాభివృద్ధి మరియు …
Read More »ఎస్ఆర్కె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నందు సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ మై భారత్ కృష్ణాజిల్లా ఆధ్వర్యంలో ఈరోజు గన్నవరం నియోజవర్గం ఎనికెపాడు ఎస్ఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెమినార్ హాల్ నందు నేతాజీ జయంతి సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని ఎన్ఎస్ఎస్ యూనిట్ తో కలిసి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు సుభాష్ చంద్రబోస్ పటానికి పూలమాలలు అర్పించి కార్యక్రమమును ప్రారంభించారు. మైభారత్ జిల్లా యువ అధికారి సుంకర రాము మాట్లాడుతూ …
Read More »ప్రజల క్షేమమే ధ్యేయంగా, నగరాభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ ఉండాలి
-విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల క్షేమమే ధ్యేయంగా, నగరాభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో శాఖాధిపతులతో 2026-2027 బడ్జెట్ అంచనాలపై స్టాండింగ్ కమిటి సమావేశం లో చర్చించారు. ఈ సమావేశంలో అకౌంట్ ఎగ్జామినర్ చక్రవర్తి, అకౌంట్స్ ఆఫీసర్ బి.సత్యనారాయణమూర్తి రెవెన్యూ , క్యాపిటల్, ఆదాయం, ఖర్చుల పై సమీక్షించారు. నగరాభివృద్ధికి, శాఖల …
Read More »రోడ్లపై చెత్త వేస్తే జరిమానా
-నిబంధనలు ఉల్లంఘిస్తే మొబైల్ కోర్టులో హాజరు కావాల్సిందే విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆదేశాలతో రోడ్ల పైన చెత్త వేసిన వారికి, కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ప్రతి శుక్రవారం నిర్వహించే మొబైల్ కోర్టులో 8వ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ గోలీ లెనిన్ బాబు, శుక్రవారం ఉదయం సర్కిల్-2 కార్యాలయం, నందు సర్కిల్-2 పరిధిలోని శానిటరీ ఇన్స్పెక్టర్లు నమోదు చేసిన 16 కేసులపై విచారణ జరిపి వారికి Rs. 4,830/- రూపాయలు …
Read More »
Prajavartha Online Telugu News