Breaking News

Monthly Archives: January 2026

అంగరంగ వైభవంగా వెంకమ్మ పేరంటాల అమ్మవారి రథోత్సవం – పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

రామవరప్పాడు, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ పరిధిలోని రామవరప్పాడు గ్రామంలో వెలసిన శ్రీ వెంకమ్మ పేరంటాల అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా, అత్యంత ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రథోత్సవం ప్రారంభానికి ముందు రథానికి శాస్త్రోక్తంగా పూజలు చేసి, కర్పూర హారతులు సమర్పించి, కొబ్బరికాయ కొట్టి ఊరేగింపు ను ప్రారంభించారు. ఈ …

Read More »

జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో యార్లగడ్డ ప్రత్యేక ప్రార్థనలు

​గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పెదఅవుటపల్లిలోని ప్రసిద్ధ బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. క్షేత్ర నిర్వాహకుల ప్రత్యేక ఆహ్వానం మేరకు బుధవారం రాత్రి పుణ్యక్షేత్రానికి చేరుకున్న ఎమ్మెల్యే వెంకట్రావ్ కు క్రైస్తవ మత పెద్దలు, భక్తులు ఘనస్వాగతం పలికారు. ​ముందుగా ఎమ్మెల్యే పుణ్యక్షేత్రంలో తంబి సమాధిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం క్షేత్ర బాధ్యులు పాలడుగు జోసఫ్ ఫాదర్, యార్లగడ్డ వెంకట్రావును శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. ఈసందర్బంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ కులమతాలకు …

Read More »

అయ్యప్పకు ప్రత్యేక పూజలు చేసిన యార్లగడ్డ

హనుమాన్ జంక్షన్, నేటి పత్రిక ప్రజావార్త : మకర జ్యోతి దర్శనాన్ని పురస్కరించుకుని అయ్యప్ప ఆలయంలో ప్రభుత్వ విప్,గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాపులపాడు మండలం పెరికిడు గ్రామంలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో భోగి పండుగ సందర్భంగా బుధవారం రాత్రి మకర జ్యోతి దర్శనం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యార్లగడ్డ ముఖ్య అతిధిగా హాజరు కాగా ఆలయ నిర్వహకులు నూలు నరసింహారావు ఆధ్వర్యంలో అర్చకులు ఎమ్మెల్యే యార్లగడ్డ కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం గణపతి పూజ, అష్టాదశ …

Read More »

బకాయిలు కొండంత… చెల్లింపులు గోరంత!

-పి.ఆర్.సి కమిటీ ఏర్పాటు,ఐ.ఆర్, ఆర్థిక బకాయిల చెల్లింపు కొరకు ఎస్ టి యు దశల వారి ఉద్యమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పి.ఆర్.సి అమలు, మద్యంతర భృతి మంజూరు, ఆర్థిక బకాయిల చెల్లింపు వంటి మేనిఫెస్టో హామీల అమలు కోరుతూ రాష్ట్రోపాధ్యాయ సంఘం.ఆం.ప్ర (ఎస్‌.టి.యు) ఆధ్వర్యంలో దశలవారి ఉద్యమం చేపడుతున్నట్టు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథ రెడ్డి,ఎల్‌.సాయి శ్రీనివాస్‌ తెలిపారు. సిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామని, ఉద్యోగులకు మెరుగైన పిఆర్సి అమలు చేస్తామని, ప్రభుత్వం …

Read More »

చిట్టినగర్ హనుమత్ దీక్ష పీఠం పునర్నిర్మాణం కు అంకురార్పణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిట్టినగర్ లో హనుమత్ దీక్షా పీఠం లో ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఆలయ పునర్నిర్మాణం కు భూమి పూజ నిర్వహించారు. అభయాంజనేయ స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హనుమత్ దీక్షా పీఠం ముఖ మండపానికి శంకుస్థాపన చేశారు.. కార్యక్రమంలో పీఠాధిపతి దుర్గా ప్రసాద్ స్వామి, బిజెపి నాయకులు అడ్డూరి శ్రీరామ్ , డాక్టర్ శ్రీలక్ష్మి.. రెడ్డిపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు..

Read More »

విజయ డైరీ ని మరింత ఆధునీకరించాలి…

-డైరీ లో భోగి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే సుజనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి బుధవారం ఉదయం చిట్టినగర్ లోని విజయ పాల డైరీ ను సందర్శించారు..l మిల్క్ ప్రాజెక్ట్ లో ఏర్పాటుచేసిన సంక్రాంతి సంబరాలలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి పాల్గొన్నారు. అక్కడ గోమాతకు పూజలు నిర్వహించిన అనంతరం కురియన్, కాకాని వెంకటరత్నం, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విజయ డైరీ యాజమాన్యంతో కలిసి ప్లాంటును సందర్శించారు. పాల …

Read More »

సంక్రాంతి అందరి జీవితాలలో వెలుగులు నింపాలి .. భోగి వేడుకల్లో పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర ప్రజలకు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి బోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. .కూటమి ప్రభుత్వం పాలనలో రాష్ట్ర ప్రజలు ఈ సంక్రాంతి పండుగను ఆనంద ఉత్సాహాలతో జరుపుకుంటున్నారని తెలిపారు . అమరావతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భవానిపురం లోని శివాలయం సెంటర్లో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి అతిథిగా విచ్చేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. తొలుత పిడకలను భోగి మంటల్లో వేసి …

Read More »

డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోగి పండుగ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భోగి పండుగ సందర్భంగా ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్లో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 40 మంది పిల్లలకి భోగి పండుగను పోసి చాక్లెట్స్ బిస్కెట్స్ తో పాటు పిల్లలు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని సేవింగ్స్ చేసుకోవడానికి టెడ్డీబేర్ లాంటి కిడ్డీ బ్యాంక్ ని డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు అవుటుపల్లి విజయ కుమారి ప్రతి ఒక్కరికి బహుమతిగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో డొక్కా సీతమ్మ కమిటీ సభ్యులు పల్లా …

Read More »

అనదికార లే-అవుట్లు మరియు ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం, అనధికార భవన నిర్మాణ క్రమబద్ధీకరణ పథకం సద్వినియోగం చేసుకోండి…

-ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు జనవరి 23, 2026 చివరి తేదీ -విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్న కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనదికార లే-అవుట్లు మరియు ప్లాట్ల క్రమబద్ధీకరణ మరియు అనధికార భవన నిర్మాణ క్రమబద్ధీకరణ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్ అన్నారు .30-06-2025 వరకు వేసిన అనదికార లే-అవుట్లు / ప్లాట్లను నిర్ణీత అపరాధ రుసుము మరియు 14% ఓపెన్ స్పేస్ చెల్లించి క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించుటకు జనవరి 23, …

Read More »

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగి శుభాకాంక్షలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి ముగ్గులతో అలరారుతున్న తెలుగు లోగిళ్లలో భోగి పండుగ జరుపుకుంటున్న తెలుగు ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దేదీప్యమానంగా వెలిగే భోగి మంటలు మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. ఆశావహ దృక్పథంతో సాగే మీ ఆలోచనలు సాకారం కావాలని… అందుకు మీకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. మీ జీవితం భోగభాగ్యాలతో తులతూగాలని కోరుకుంటూ, మరొక్కమారు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.

Read More »