-100 కు పైగా స్టాల్స్ లో గ్రామీణ, ఖాదీ ఉత్పత్తుల ప్రదర్శన -రేపు సా. 5 గంటలకు ఎగ్జిబిషన్ ను ప్రారంభించనున్న పార్లమెంట్ సభ్యులు -ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ ఎస్. గ్రీప్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఖాదీ పరిశ్రమల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యంతోపాటు, గ్రామీణ కళాకారుల జీవనోపాధి ప్రోత్సహించి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేలా ఖాదీ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ రాష్ట్ర సంచాలకులు డా. ఎస్. గ్రీప్ తెలిపారు. స్థానిక పడమట …
Read More »Monthly Archives: January 2026
వైద్య విద్యార్థుల్లో ఆత్మహత్యల నియంత్రణకు ప్రత్యేక శిక్షణ
-క్యూపీఆర్ ఇండియా సంస్థతో ఎన్టీఆర్ ఆరోగ్య వర్శిటీ ఒప్పందం -దేశంలోనే తొలిసారి ఏపీలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం -రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, ఆత్మహత్యలను తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. అమెరికాకు చెందిన “క్వశ్చన్, పర్స్యూవేడ్ రిఫర్ ఇన్స్టిట్యూట్ ఇండియా (క్యూపీఆర్ ఐ) సంస్థతో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం ఒప్పందాన్ని చేసుకుంది. దీని ప్రకారం.. ఎంబీబీఎస్ లో ప్రథమ సంవత్సరం …
Read More »రెవెన్యూ సమస్యల వేగవంత పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్
– ఫిర్యాదులను వేగంగా, నాణ్యతతో పరిష్కరించేందుకు వీలు – సమస్య పరిష్కారానికి సానుభూతితో పాటు స్పష్టత, పారదర్శకత ముఖ్యం – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రెవెన్యూ ఫిర్యాదులను వేగంగా, నాణ్యతతో పరిష్కరించేందుకు రెవెన్యూ క్లినిక్‌లు ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు ఈ క్లినిక్‌లు …
Read More »చదువుల సిరితో కుటుంబానికి కొత్త వెలుగు
– బాగా చదువుకొని తల్లిదండ్రుల కష్టానికి తగిన ఫలితాలివ్వండి – మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నతంగా ఎదగండి – బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలి – పదో తరగతి విద్యార్థులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగడం ద్వారా కుటుంబంలో కొత్త వెలుగులు నింపొచ్చని.. డా. బీఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం, కల్పనాచావ్లా వంటి గొప్ప వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విద్యార్థులతో అన్నారు. …
Read More »భూ యాజమాన్య వ్యవస్థలో సరికొత్త మైలురాయి..
– ఆధునిక సాంకేతికత, రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు – కొత్త సంవత్సరం, సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ – రైతుల తరఫున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశానికే ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య వ్యవస్థను మరింత పారదర్శకంగా, రైతుల శ్రేయస్సు లక్ష్యంగా తీర్చిదిద్దుతోందని.. ఆధునిక సాంకేతికత అనుసంధానంతో భూమి యాజమాన్య హక్కు పత్రం, పట్టాదారు పుస్తకాలను రాజముద్రతో అందిస్తోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. …
Read More »కాంట్రాక్టర్ ఏజెన్సీలకు వృత్తిపరమైన ఆరోగ్యం, భద్రత మరియు కార్మిక నిర్వహణపై శిక్షణా కార్యక్రమం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) ఆధ్వర్యంలో వృత్తిపరమైన ఆరోగ్యం & భద్రత (OHS) మరియు కార్మిక నిర్వహణపై శుక్రవారం మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:45 వరకు ఏపీసీఆర్‌డీఏ ఏవీ సెమినార్ హాల్‌లో ఒక అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. నిర్మాణ ప్రాంతాలలో భద్రతా సంస్కృతిని బలోపేతం చేయడం, చట్టబద్ధమైన కార్మిక నిబంధనలను అమలు చేయడం మరియు ప్రామాణిక నిర్వహణ విధానాలను (SOPs) పటిష్టం చేయడంలో భాగంగా కెపాసిటీ బిల్డింగ్ టీమ్ సభ్యులు …
Read More »శంకర్ విల్లాస్ బ్రిడ్జ్ పనులు నిర్ణీత కాల వ్యవధిలోనే పూర్తవుతాయి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరులో నిర్మితమవుతున్న శంకర్ విల్లాస్ బ్రిడ్జ్ పనులు నిర్ణీత కాలవ్యవధిలోనే పూర్తవుతాయని కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. పెమ్మసాని మాట్లాడుతూ… బ్రిడ్జ్‌కు సంబంధించి GGH వైపు నిర్మాణంలో భాగంగా 9 పిల్లర్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని, తాను స్వయంగా ఈ ప్రాంతాన్ని పరిశీలించామని తెలిపారు. అవసరమైన టెక్నికల్ క్లియరెన్సులు ఇప్పటికే పొందామని, సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి మరో రెండు మూడు రోజుల్లో తుది అనుమతి రానుందని చెప్పారు. క్లియరెన్స్ వచ్చిన …
Read More »రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ సక్రంగా జరగాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రెవెన్యూ సంబంధిత సమస్యలను వీలైనంత వరకూ తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ఈ నెల 2 నుండి 9 వరకూ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నందున ఆ పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరిగేలా జిల్లా కలక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలక్టర్లను ఆదేశించారు. రైల్వే అండర్ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వేకు సంబంధించి పెండింగ్ భూసేకరణ కేసులకు సంబంధించిన అంశాలు, పట్టాదారు …
Read More »పొగాకు రైతుల సంక్షేమానికి, అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ పొగాకును ప్రోత్సహించడానికి టుబాకో బోర్డ్ కృషి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పొగాకు బోర్డు కేవలం నియంత్రణ సంస్థగానే కాకుండా పొగాకు, రైతుల సంక్షేమానికి, అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ పొగాకును ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుందని టుబాకో బోర్డు చైర్మన్ యస్వంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు లోని శ్రీ కన్వెన్షన్ లో జరిగిన పొగాకు బోర్డు వ్యవస్థాపక దినోత్సవం మరియు స్వర్ణ జయంతి వేడుకలలో పొగాకు బోర్డు చైర్మన్ యస్వంత్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ, ఐసీఎఆర్ – ఎన్ఐఆర్సీఎ డైరెక్టర్ డా. ఎం …
Read More »పట్టణానికి ప్రముఖుల రాక
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు పట్టణానికి పలువురు ప్రముఖులు రానున్నారు. మారిషస్ అధ్యక్షులు ధరమ్ బీర్ గోకుల్ (Dharambeer Gokhool, Hon’ble President of the Republic of Mauritius) ఈ నెల 3వ తేదీన పట్టణానికి రానున్నారు. 4వ తేదీ ఉదయం 10.30 గంటలకు బొమ్మిడాల నగర్ శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్ లో ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహిస్తున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొంటారు. ఒడిశా గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు 3వ తేదీ సాయంత్రం 4.45 …
Read More »
Prajavartha Online Telugu News