Breaking News

Daily Archives: February 4, 2026

APCRDA సౌజన్యంతో విస్తృతంగా ఉచిత శిక్షణ & ఉపాధి కల్పన కార్యక్రమాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 1. అమరావతిలో భవన నిర్మాణ కార్మికుల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమం స్కిల్ డెవలప్మెంట్ & ట్రైనింగ్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పన భవన నిర్మాణ రంగంలో కేవలం స్వల్ప వ్యవధిలోనే ఉచిత శిక్షణ & ఉపాధి పొందే సదవకాశము ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC)ద్వారా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(NAC) సంస్థ కల్పించుచున్నది. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(NAC) వారు APSSDC, APCRDA సంయుక్త …

Read More »

31వ తేదీ నాటికి తొలిదశ నాలుగు బెర్తుల ఓడరేవు నిర్మాణం పూర్తవుతుంది…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది డిసెంబరు 31వ తేదీ నాటికి తొలిదశ నాలుగు బెర్తుల ఓడరేవు నిర్మాణం పూర్తవుతుందని మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ తులసీదాసు సింగపూర్ బృందం సభ్యులకు వివరించారు. బుధవారం సింగపూర్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చొంగ్ పూ షీన్ నేతృత్వంలో జిల్లాలో ఒకరోజు పర్యటనకు వచ్చిన సింగపూర్ బృందం కలెక్టరేట్లో సమావేశం అనంతరం బందరు ఓడరేవును సందర్శించారు. ఆక్కడ జరుగుతున్న ఓడరేవు నిర్మాణ పనులను పరిశీలించారు. మొదటి దశ …

Read More »

జిల్లా అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లుగా దోహదపడతాయి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వ్యవసాయం, ఆక్వా కల్చర్, పరిశ్రమలు, ఓడరేవు ప్రధానంగా జిల్లా అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లుగా దోహదపడతాయని జిల్లా కలెక్టర్ డీ జే బాలాజీ సింగపూర్ బృందానికి వివరించారు. బుధవారం ఉదయం సింగపూర్ వ్యాపార, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చొంగ్ పూ షీన్ నేతృత్వంలో సింగపూర్ బృందం సభ్యులు డిప్యూటీ సీఈవో తే లియాన్ చెన్ , చువా టైక్ హిం, నిషా షర్డా జిల్లాను అమరావతి ఆర్థిక కారిడార్ లో చేర్చి ఆర్థికంగా …

Read More »

ముందస్తు వైద్య పరీక్షలతో క్యాన్సర్ నివారణ…. : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ముందస్తు వైద్య పరీక్షలతో క్యాన్సర్ ను అరికట్టగలమని, దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ, మచిలీపట్నం జిజిహెచ్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని కోనేరు సెంటర్ నుండి బెల్ కంపెనీ వరకు వైద్య కళాశాల విద్యార్థులు, వైద్యాధికారులు, వైద్యులు తదితరులతో కలసి నిర్వహించిన అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఖైనీ గుట్కా నమలొద్దు.. క్యాన్సర్ బారిన పడొద్దు, …

Read More »

నవ భారత నిర్మాతల వికాసం

-రచయిత – కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది జరుగుతున్న ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం మన దేశ విద్యా ప్రయాణంలో ఒక నిశ్శబ్దమైన, చాలా బలమైన మార్పును తీసుకొస్తోంది. ప్రధానమంత్రి నాయకత్వంలో 2018లో ఒక చిన్న సమావేశంగా మొదలైన ఈ కార్యక్రమం, నేడు ప్రజలందరూ భాగస్వాములయ్యే ఒక పెద్ద ఉద్యమంగామారింది. విద్యార్థుల సంపూర్ణ ఎదుగుదలను దృష్టిలో పెట్టుకుని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కూడా ఇందులో ముఖ్యమైన భాగస్వాములయ్యారు. ఈసారి ఏకంగా 4.5 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు …

Read More »

అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసిన కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (KDCCB) చైర్మన్ నెట్టెం రఘురాం ఈ రోజు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసి, కేడీసీసీ బ్యాంక్ పరిధిలో పనిచేస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS) మరియు వాటిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు పరిపాలనా అంశాలపై పరిష్కారాన్ని కోరుతూ ముఖ్యమంత్రి వినతిపత్రం సమర్పించారు కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పరిధిలో PACS సంఘాల్లో సీఈఓ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల …

Read More »

ఉగాది, కళారత్న పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ఆధ్వర్యంలో మార్చి 19న నిర్వహించనున్న శ్రీ “పరాభవ” నామ సంవత్సర ఉగాది వేడుకల సందర్భంగా వివిధ రంగాల్లోని ప్రముఖులకు ‘ఉగాది’, ‘కళారత్న’ పురస్కారాలను ప్రధానం చేయడం జరుగుతుందని రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్. మల్లిఖార్జునరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1. సాహిత్యం 2. సంగీతం 3. నృత్యం 4. చిత్రలేఖనం 5. శిల్పం 6. నాటకం 7. జానపదం 8. మిమిక్రీ 9. అవధానం 10. వైద్యం …

Read More »

రాజ‌ధాని ప‌నుల్లో కీల‌క భాగ‌స్వాములు కావాలి!

– మౌలిక వ‌స‌తుల ప‌నుల‌కు మైన్స్ శాఖ కృషి అవ‌స‌రం – క్వారీ లీజుల ద‌ర‌ఖాస్తుల‌పై స‌మ‌న్వ‌య శాఖ‌లు దృష్టిపెట్టండి – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న‌వ్య రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని.. మౌలిక వ‌స‌తులకు సంబంధించిన ప‌నుల వేగ‌వంతానికి మైన్స్ శాఖతో పాటు రెవెన్యూ, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణం వంటి స‌మ‌న్వ‌య శాఖ‌ల కృషి కూడా కీల‌క‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న జిల్లాస్థాయి …

Read More »

వ‌న్‌స్టాప్ సెంట‌ర్ల‌తో మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు భ‌రోసా

– బాధిత మహిళలకు గౌరవం, న్యాయం కల్పించేందుకు కృషి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ‌న్ స్టాప్ సెంట‌ర్లు (ఓఎస్‌సీ).. మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు భ‌రోసా క‌ల్పిస్తున్నాయ‌ని.. బాధిత మ‌హిళ‌ల‌కు గౌర‌వం, న్యాయం క‌ల్పించేందుకు కృషిచేస్తున్నాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. బుధ‌వారం జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో క‌లెక్ట‌రేట్ ప్రాంగ‌ణంలో ఇగ్నైట్ సెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ.. సఖి వన్ స్టాప్ సెంటర్‌కు కేటాయించిన ప్రత్యేక వాహనాన్ని జెండా …

Read More »

నగరాన్ని గార్బేజ్ వల్నర్బుల్ పాయింట్స్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాన్ని గార్బేజ్ వల్నర్బుల్ పాయింట్స్ (జివిబి) ఫ్రీ నగరంగా తీర్చిదిద్దుకోవాలని, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల నూరు శాతం వసూళ్లు కావాలని, ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులు పనితీరు మెరుగుపరుచుకోకుంటే కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. బుధవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమవేశ మందిరంలో ప్రజారోగ్య విభాగ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత వార్డ్ ల వారీగా మైక్రో ప్యాకెట్స్, కార్మికుల హాజరు, రోజువారీ సేకరించాల్సిన …

Read More »