గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో ఆహార సరఫరా నిర్దేశిత సమయానికి అందించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అక్షయపాత్ర సిబ్బందిని ఆదేశించారు. బుధవారం చుట్టగుంట సెంటర్ లోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలోని అన్న క్యాంటీన్లలో ఆహార సరఫరా నిర్దేశిత సమయానికి జరిగేలా నోడల్ అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. క్యాంటీన్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, వ్యర్ధాలను నేరుగా డ్రైన్ …
Read More »Daily Archives: February 4, 2026
పీకలవాగుని సమగ్రంగా సర్వే చేసి, నివేదిక ఇవ్వాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో మురుగుపారుదలకు కీలకమైన పీకలవాగుని సమగ్రంగా సర్వే చేసి, నివేదిక ఇవ్వాలని సిటి ప్లానర్ ని, పూడికతీతకు ప్రతిపాదనలు అందించాలని ఎస్ఈని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. బుధవారం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్లా మాధవితో కలిసి బ్రాడీపేట, కంకరగుంట ఆర్యూబీ, కోబాల్ట్ పేట, దేవాపురం ప్రాంతాల్లో పీకలవాగుని కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పీకలవాగు అత్యంత ప్రధానమైన డ్రైన్ అని, ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆక్రమణల వలన వర్షాకాలం పొంగి …
Read More »ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ లేని పి.బి.టి.జి గృహాల కోసం రూ.8.37 కోట్లు మంజూరు, రూ.0.36 కోట్లు విడుదల
-కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యెస్సో నాయక్ వెల్లడి -ఆంధ్రప్రదేశ్‌లో సౌర లైట్లు గిరిజన గృహాల విద్యుదీకరణపై ప్రశ్నించిన ఎంపీకేశినేని శివనాథ్ (చిన్ని) ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ లేని పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ( పి.బి.టి.జి) గృహాల కోసం రూ.8.37 కోట్లు మంజూరు చేయగా, ఇప్పటివరకు రూ.0.36 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యెస్సో నాయక్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద మొత్తం రూ.44.1 కోట్లు …
Read More »ఆంధ్రప్రదేశ్ రైల్వే అభివృద్ధిపై ఎంపీ కేశినేని శివనాథ్ కీలక ప్రతిపాదనలు
-రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానానికి ఎంపీ కేశినేని శివనాథ్ మద్దతు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంపై లోక్ సభలో బుధవారం ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానానికి ఎంపీ కేశినేని శివనాథ్ సంపూర్ణ మద్దతు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగం దేశం దేశం మౌలిక వసతుల ఆధారిత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందనే అంశం ప్రతిబింబిస్తోందన్నారు. ఈ మేరకు ఎంపీ కేశినేని శివనాథ్ ప్రసంగం (లెడ్ ఆన్ ది టెబుల్) సభకు దాఖలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దూరదృష్టి గల నాయకత్వంలో …
Read More »శివరాత్రి భక్తులకు కోటప్ప “కొండంత” ఏర్పాట్లు
-అన్ని శాఖల అధికారులూ అప్రమత్తంగా ఉండాలి -భక్తులందరికీ మంచి దర్శనం అందించాలి -ప్రభల ఊరేగింపుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి -పల్నాడు జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పల్నాడు, నేటి పత్రిక ప్రజావార్త : మహా శివరాత్రిని పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీన కోటప్ప కొండకు వచ్చే భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులూ లేకుండా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి బుధవారం నాడు …
Read More »6,500 మందికి విద్యార్థులకు సైకిళ్లు అందజేత
-విద్యార్థులు నడిచే ఇబ్బంది తప్పించేందుకే సైకిళ్ల పంపిణీ -ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య -తల్లికి వందనం కోసమే రూ.10,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఇంటి నుంచి పాఠశాలలకు నడిచి వచ్చే ఇబ్బందిని తప్పించేందుకే సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నియోజకవర్గంలో ప్రారంభించినట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అద్దంకి నియోజకవర్గంలోని కొమ్మినేనివారి పాలెం జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన …
Read More »అరుగోలను జడ్పీ హైస్కూల్ వార్షికోత్సవం
-రూ.58.5 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జడ్‌పీ స్కూల్ ప్రహరీ గోడ, సిమెంటు రోడ్డు ప్రారంభోత్సవం మరియు పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవాణా రోడ్లు మరియు భవనాల శాఖ మౌలిక సదుపాయాలు–పెట్టుబడుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంపీ కృష్ణబాబు, ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, కృష్ణా జిల్లా కలెక్టర్ …
Read More »విఎంసి డైరీ ఆవిష్కరించిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి బుధవారం తమ చాంబర్లో అధికారులతో విజయవాడ నగర పాలక సంస్థ డైరీను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ఈ డైరీ మున్సిపల్ కార్పొరేషన్ సేవలన్నింటినీ సమగ్రంగా ప్రజలకు అందుబాటులోకి తేవడానికి రూపొందించబడిందని, నగరవాసులకు ఉపయోగపడే అన్ని ముఖ్యమైన సమాచారాన్ని ఇందులో పొందుపరిచారని తెలిపారు. VMC డైరీ ద్వారా ప్రజలకు మున్సిపల్ సర్వీసుల గురించి పూర్తి సమాచారం అందించారని, శుభ్రత, మౌలిక వసతులు, ఆరోగ్య, మరియు పర్యావరణ పరిరక్షణ వంటి …
Read More »నగరంలో ఉచిత సర్వకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షా శిబిరం, అవగాహన కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఫిబ్రవరి 4వ తేదీ ప్రపంచ కాన్సర్ దినోత్సవ సందర్భంగా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ మరియు శ్రీ జైన్ శ్వేతంబార్ తెరా పంత్ మహిళా మండల్ ఆధ్వర్యంలో ఉచిత సర్వకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షా శిబిరం మరియు అవగాహన కార్యక్రమం గురునానక్ కాలనీనందు నిర్వహించారు. ఈ సందర్భంగా రూట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ మాట్లాడుతూ సర్వకల్ క్యాన్సర్ వలన ప్రతి సంవత్సరం 79,000 మంది మరణిస్తున్నారన్నారు. ఈ క్యాన్సర్‌ను పాప్స్మెయర్ ఈపరీక్ష ద్వారా సులభంగా …
Read More »కొనసాగుతున్న మీటర్ రీడర్స్ యూనియన్ “మహాధర్నా”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ సంస్థలలోని మూడు డిస్కంలలో పనిచేస్తున్న మీటర్ రీడర్స్ అందరికి విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న “మహాధర్నా” కార్యక్రమం 3వ రోజుకు చేరింది. గతమూడు రోజులుగా రాత్రి, పగలు ధర్నా చౌక్‌లోనే నిద్రాహారాలు లేకుండా నిరసన తెలియజేస్తున్న మీటర్ రీడర్స్‌ను ప్రభుత్వం, యాజమాన్యము పట్టించుకోకపోవడం అన్యాయం. విపరీతమైన దోమలు, మంచు కురుస్తున్నా చలిలో నడిరోడ్డుపై మీటర్ రీడర్స్ తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. వెంటనే యాజమాన్యం, ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని …
Read More »
Prajavartha Online Telugu News