Breaking News

Monthly Archives: February 2026

రెవెన్యూ క్లినిక్ అర్జీల‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టండి

– అర్జీదారుల స‌మ‌స్య‌ను వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రించండి – జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్య‌క్ర‌మానికి 211 అర్జీలు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం జిల్లాస్థాయిలో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) సంద‌ర్భంగా ప్ర‌తి సోమ‌వారం నిర్వ‌హిస్తున్న రెవెన్యూ క్లినిక్ ద్వారా అందుతున్న అర్జీల‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌ని, వీలైనంత త్వ‌ర‌గా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. సోమ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌, డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహంతో …

Read More »

PMSYM/E-Shrama and NPS ప్రభుత్వ పథకాలపై అవగాహన అసంఘటిత, వలస కార్మికుల అవగాహనకు ప్రచార రథం ప్రారంభం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త PMSYM/E-Shrama and NPS ప్రభుత్వ పథకాలపై అవగాహన అసంఘటిత, వలస కార్మికుల అవగాహనకు ప్రచార రథం ప్రారంభం ఎన్టీఆర్ జిల్లాలో అసంఘటిత రంగ కార్మికులు మరియు వలస కార్మికులకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ప్రచార రథాన్ని ఎన్టీఆర్ జిల్లా అసిస్టెంట్ లేబర్ కమిషనర్  ధనలక్ష్మి  చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాయని, వాటిపై ప్రతి …

Read More »

బాయిలర్ అటెండెంట్ మొదటి, రెండవ తరగతి పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం

-బాయిలర్ల సంచాలకులు బి. ఉమామహేశ్వరరావు విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త ప్రభుత్వ బాయిలర్ల శాఖలో బాయిలర్ అటెండెంట్ పరీక్షల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని చైర్‌పర్సన్, కమిటీ ఆఫ్ ఎగ్జామినర్స్, బాయిలర్ల సంచాలకులు బి. ఉమామహేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది మే/జూన్ నెలల్లో నిర్వహించబోయే మొదటి, రెండవ తరగతి (First & Second Class) పరీక్షల నిర్వహణ కు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నామన్నారు. అర్హతలు, విద్యార్హత, వయస్సు, పని అనుభవం వంటి పూర్తి వివరాల కోసం …

Read More »

ఎన్టీఆర్ జిల్లాలో హెయిర్ పికర్లకు జీవనోపాధి సహాయ కార్యక్రమం నిర్వహించిన డీబీఆర్‌సీ

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త ఎన్టీఆర్ జిల్లా — Dalit Bahujan Resource Centre (డీబీఆర్‌సీ) ఆధ్వర్యంలో ఈ రోజు ఎన్టీఆర్ జిల్లాలో హెయిర్ పికర్ల కోసం జీవనోపాధి సహాయ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ద్వారా 33 మంది మహిళా హెయిర్ పికర్లకు అల్యూమినియం పాత్రలను జీవనోపాధి సాధనాలుగా అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు ఇళ్లకు వెళ్లి హెయిర్‌ను కొనుగోలు చేసి, దానికి ప్రతిగా ఉపయోగపడే అల్యూమినియం పాత్రలను ఇవ్వడం ద్వారా తమ సంప్రదాయ వృత్తిని కొనసాగిస్తూ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం …

Read More »

బాల్య వివాహ ర‌హిత స‌మాజ నిర్మాణానికి కృషిచేద్దాం

– పిల్ల‌ల బంగారు భ‌విష్య‌త్తుకు చేయీచేయీ క‌లుపుదాం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త బాల్య వివాహ ర‌హిత జిల్లాగా ఎన్‌టీఆర్ జిల్లాను తీర్చిదిద్ది, ఆద‌ర్శంగా నిల‌ప‌డంలో ప్ర‌తిఒక్క‌రూ చేయీచేయీ క‌ల‌పాల‌ని, పిల్ల‌ల‌కు బంగారు భ‌విష్య‌త్తు అందించేందుకు నిబ‌ద్ధ‌త‌తో కృషిచేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. వాస‌వ్య మ‌హిళా మండ‌లి (వీఎంఎం) – బాల్య వివాహ విముక్తి ర‌థాన్ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లో జెండా ఊపి ప్రారంభించారు. బాల్య వివాహాల‌కు వ్య‌తిరేకంగా సంత‌కం చేసి …

Read More »

సుస్థిర ఆర్థిక వృద్ధికి చేయూత‌గా ఆర్‌టీఐహెచ్

– వినూత్న ఆలోచ‌న‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టేందుకు కృషి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త గౌర‌వ ముఖ్య‌మంత్రి దార్శ‌నిక‌త‌కు ప్ర‌తిరూప‌మైన ఒక కుటుంబం-ఒక పారిశ్రామిక‌వేత్త నినాదాన్ని సాకారం చేసేందుకు ర‌త‌న్‌టాటా ఇన్నొవేష‌న్ హ‌బ్ (ఆర్‌టీఐహెచ్‌) అడుగులు వేస్తోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. సోమ‌వారం జిల్లా క‌లెక్ట‌రేట్‌లో ఏర్పాటుచేసిన ఇగ్నైట్ సెల్‌లో ఆర్‌టీఐహెచ్ ఆధ్వ‌ర్యంలో మూడు స్టార్ట‌ప్‌లు, రెండు ఎంఎస్ఎంఈలు త‌మ ఉత్ప‌త్తుల‌ను ప్ర‌ద‌ర్శించాయి. సింటాక్స్ లెన్స్‌, ఈటీ ఆర్గానిక్స్ త‌దిత‌ర సంస్థ‌ల ఉత్ప‌త్తుల‌ను క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ …

Read More »

7 కోట్ల రూపాయలతో రూరల్ నియోజకవర్గంలో రోడ్లకు మహర్దశ

-రెండు ప్రధాన రహదారులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త రూరల్ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి రూ.7 కోట్ల నిధులతో విస్తృత పనులు చేపడుతున్నామని, ఈ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. సోమవారం బాలాజీ పేట బొమ్మూరు నుంచి రాజవోలు శివారు వరకు రూ.3.5 కోట్లతో నూతనంగా నిర్మించనున్న సిసి మరియు బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అలాగే ఎన్‌హెచ్–5 నుంచి పాత బొమ్మూరు వరకు (పోలీస్ క్వార్టర్స్, …

Read More »

స్కూల్ ఆటోలపై ఆర్‌టీఏ అధికారుల కొరడా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త తూర్పుగోదావరి జిల్లాలో స్కూల్ పిల్లలను తరలిస్తున్న వాహనాలపై జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సోమవారం రవాణా శాఖ అధికారులు వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి స్కూల్ పిల్లలను తరలిస్తున్న మొత్తం 11 ఆటోలపై కేసులు నమోదు చేయగా, అందులో 7 ఆటోలను సీజ్ చేసినట్లు జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ తెలిపారు. ఆటోలలో పరిమితికి మించి పిల్లలను ఎక్కించడం రోడ్డు భద్రతా నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించటమేనని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి నిర్లక్ష్యపు …

Read More »

బాల వివాహ రహిత తూర్పుగోదావరి జిల్లాగా మారాలి

-విస్తృత ప్రచారంతో బాల్య వివాహాల నిర్మూలనకు కృషి -జెండా ఊపి ప్రచార రథాన్ని ప్రారంభించడం జరిగింది – ఇంచార్జి కలెక్టర్ వై మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాల వివాహ్ విముక్త్ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో జిల్లాలో చేపట్టిన అవగాహన ప్రచార కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా చేరాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ మేఘ స్వరూప్ పిలుపు ఇచ్చారు. జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, చైల్డ్ రైట్స్ అడ్వకసి ఫౌండేషన్ …

Read More »

సోమవారం (02.02.2026) కలెక్టరేట్‌లో నిర్వహించిన PGRSలో మొత్తం 322 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందనీ ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ తెలియ చేశారు.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త సోమవారం (02.02.2026) కలెక్టరేట్‌లో నిర్వహించిన PGRSలో మొత్తం 322 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందనీ ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ తెలియ చేశారు. అందులో భాగంగా రెవెన్యూ (రెవెన్యూ క్లినిక్) శాఖకు అత్యధికంగా 148, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు 100 దరఖాస్తులు అందాయి. పోలీసు శాఖ 15, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్‌కు 8, పర్యావరణం–అటవీ–శాస్త్ర సాంకేతిక శాఖకు 5 దరఖాస్తులు వచ్చాయి. మహిళలు, పిల్లలు, వికలాంగులు & సీనియర్ సిటిజన్లు, వ్యవసాయం …

Read More »