Breaking News

Monthly Archives: February 2026

రాష్ట్రవ్యాప్తంగా ‘సపోర్ట్ పర్సన్స్’ నియామకానికి ప్రభుత్వం నిర్ణయం…

 –బాలల సంక్షేమ శాఖ సంచాలకులు ఎం. వేణుగోపాల్ రెడ్డి. విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : లైంగిక వేధింపులకు గురైన బాలలకు అండగా నిలిచేందుకు, వారికి న్యాయపరమైన, మానసిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. పోక్సో (POCSO) చట్టం-2012, సెక్షన్ 39 ప్రకారం.. బాధితులకు కేసు విచారణకు ముందు, విచారణ సమయంలో మార్గదర్శకత్వం మరియు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు “సపోర్ట్ పర్సన్స్” (Support Persons)ను నియమించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బాలల సంక్షేమం, సంస్కరణల సేవలు మరియు వీధిబాలల సంక్షేమ శాఖ సంచాలకులు (FAC) …

Read More »

సహకార స్ఫూర్తితో కొండ‌ప‌ల్లి బొమ్మ‌కు స‌రికొత్త శోభ‌

– క‌ళాకారులు ఐక్యంగా అడుగులు వేసి క‌ళ‌ను కాపాడుకుందాం – ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్ క‌ళా తేజ‌స్సుకు స‌రైన వేదిక‌ – గ్రామీణ క‌ళాత్మ‌క ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి కృషి – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొండ‌ప‌ల్లి బొమ్మ‌ల క‌ళాకారుల జీవితాల‌ను ఉన్న‌తంగా తీర్చిదిద్ద‌డంతో పాటు ఈ క‌ళ‌ను త‌ర‌తరాల‌కు వార‌స‌త్వ సంప‌ద‌గా అందించేందుకు కృషిచేస్తున్నామ‌ని.. ఇదేవిధంగా క‌ళాకారులు కూడా స‌హ‌కార స్ఫూర్తితో ఐక్యంగా అడుగులు వేసి క‌ళ‌ను మ‌రింత విశ్వ‌వ్యాప్తం చేయ‌డంలో భాగ‌స్వాములు కావాల‌ని …

Read More »

మ‌హ‌నీయుల స్ఫూర్తి ప‌థంలో ప‌య‌నించండి

– ఇష్ట‌ప‌డి చ‌దువుతూ ఉన్న‌త‌స్థానాల‌కు ఎద‌గండి – ల‌క్ష్య సాధ‌న‌లో అడ్డంకుల‌ను ధైర్యంగా అధిగ‌మించండి – ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దువుకొని ఎంద‌రో గొప్ప‌వార‌య్యారు – కలెక్టర్ డా. జి.ల‌క్ష్మీశ‌, శాస‌న‌స‌భ్యులు వ‌సంత వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాద్‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : అబ్దుల్ క‌లాం వంటి మహనీయుల స్ఫూర్తి పథంలో నడుచుకుంటూ విద్యార్థులు ఇష్టపడి చదువుతూ ఉన్నత స్థానాలకు ఎదగాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. లక్ష్య సాధనలో ఎదురయ్యే అడ్డంకులను ధైర్యంగా అధిగమిస్తూ ముందుకు సాగాలని ఆయన విద్యార్థుల‌కు సూచించారు. శ‌నివారం …

Read More »

విద్యార్థుల కంటి ఆరోగ్యానికి భ‌రోసా

– ఉచితంగా కంటి ప‌రీక్ష‌లు, క‌ళ్ల‌ద్దాల పంపిణీ – కార్య‌క్ర‌మంలో పాల్గొన్న క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, శాస‌న‌స‌భ్యులు వ‌సంత వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాద్‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : గౌర‌వ ముఖ్య‌మంత్రి, విద్యాశాఖ‌, వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రివ‌ర్యుల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ప్ర‌భుత్వ‌, ప్ర‌భుత్వ ఎయిడెడ్ పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు కంటి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డంతో పాటు అవ‌స‌ర‌మైన వారికి క‌ళ్ల‌ద్దాలు పంపిణీ చేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, శాస‌న‌స‌భ్యులు వ‌సంత వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంధత్వ నివారణ సంఘం ద్వారా పాఠశాలల …

Read More »

గుంటూరు మునిసిపల్ కార్పోరేషన్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన ఎం.పోలేశ్వరరావు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు మునిసిపల్ కార్పోరేషన్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన ఎం.పోలేశ్వరరావు శనివారం స్థానిక ట్రావెలర్స్ బంగ్లా ప్రాంగణంలో జరిగిన ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా పోలేశ్వరరావు, జనరల్ సెక్రెటరి వసీం అలీ, వైస్ ప్రెసిడెంట్ జి.రంగారెడ్డి(పురుషులు), , ఐ.రాజ్యలక్ష్మీ(మహిళలు), జాయింట్ సెక్రెటరీ కె.రాజేంద్ర ప్రసాద్(పురుషులు), సిహెచ్.లీలా కుమారి (మహిళలు), ట్రెజరర్ గా పి.నాగ మల్లేశ్వరి లు ఎన్నికయ్యారు ఎన్నికల అధికారులుగా సూపరింటెండెంట్ లు రవి కిరణ్ రెడ్డి, మదన్ గోపాల్ వ్యవహరించారు.

Read More »

సర్వే విధుల్లో అలసత్వంపై 20 మంది సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు… కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకముగా చేపట్టిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే (UFS) నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 20 మంది వార్డు సచివాలయ కార్యదర్శులకు శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేశామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతిరోజూ నిర్దేశించిన లక్ష్యం మేరకు 100 శాతం సర్వే పూర్తి చేయాలని పలుమార్లు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించినప్పటికీ, పలువురు సెక్రటరీలు లక్ష్యం కంటే చాలా తక్కువ స్థాయిలో సర్వే పూర్తి చేసినట్లు …

Read More »

సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ కోరారు. శనివారం అంకిరెడ్డిపాలెంలోని జి.ఇమాన్యుయేల్ తన ఖాళీ స్థలానికి సంబంధించి రూ.7 లక్షలు పన్ను చెల్లించడంపై నగర కమిషనర్ తమ చాంబర్ లో అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరాభివృద్ధిలో పన్నులు ఎంతో కీలకమని, నగరపాలక సంస్థకు బకాయిఉన్న ప్రతి ఒక్కరూ చెల్లించాలన్నారు. ఇప్పటికే వార్డ్ ల వారీగా డిమాండ్ నోటీసులు, స్లిప్స్ పంపిణీకి అడ్మిన్ కార్యదర్శులకు అందించామన్నారు. పన్ను చెల్లింపుదారులకు వీలుగా …

Read More »

భివృద్ధి పనులను నిర్దేశిత ప్రమాణాలు పాటిస్తూ, గడువు మేరకు పూర్తి చేసేలా పర్యవేక్షణ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను నిర్దేశిత ప్రమాణాలు పాటిస్తూ, గడువు మేరకు పూర్తి చేసేలా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శనివారం నల్లపాడు మెయిన్ రోడ్ నుండి రైల్వే స్టేషన్ రోడ్ లో జరుగుతున్నమేజర్ డ్రైన్ నిర్మాణ పనులు, తెలగమాంబ చెరువుని పరిశీలించి, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నల్లపాడు రైల్వే స్టేషన్ రోడ్ లో జరుగుతున్న …

Read More »

అన్నక్యాంటీన్లలో పరిశుభ్రత పాటించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో పరిశుభ్రత పాటించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శనివారం చుట్టగుంట సెంటర్ లోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలోని అన్న క్యాంటీన్లలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆహార సరఫరా సమయంలో కింద పడకుండా, సరఫరా అనంతరం పరిసరాలను శుభ్రం చేయాలన్నారు. ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి, ఆహార నాణ్యత, రుచిపై అడిగి తెలుసుకొని, ఏమైనా …

Read More »

గుడిసెలో నాలుగు గంటలు ఉన్నా పశువులకు హాని చేయని పులి డి ఎఫ్ వో ప్రభాకర రావు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో శుక్రవారం రాత్రి ఒక గుడిసె ఇంట్లోకి ప్రవేశించిన పులి సుమారు నాలుగు గంటల పాటు అక్కడే , అదే పాకలో ఉన్నప్పటికీ, సమీపంలో ఉన్న రెండు గేదెలకు ఎలాంటి హాని కలగలేదని జిల్లా అటవీ అధికారి బి. ప్రభాకర రావు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గ్రామంలో ఉన్న పశువులను లేదా ప్రజలను పులి ఎలాంటి విధంగా హానిచేయకుండా ప్రశాంతంగా అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనించదగ్గ విషయమని …

Read More »