Breaking News

Monthly Archives: February 2026

క‌చ్చిత‌త్వంతో ఏకీకృత కుటుంబ స‌ర్వే

– సేవ‌ల పంపిణీని మెరుగుప‌రిచేందుకు వీలు – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ పథకాల లక్ష్యసాధన, సమర్థవంతమైన అమలు, పర్యవేక్షణ, సేవ‌ల పంపిణీని మరింత మెరుగుపరచడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎఫ్‌బీఎంఎస్‌)ను అభివృద్ధి చేస్తోంద‌ని.. ఇందులో భాగంగా అత్యంత క‌చ్చిత‌త్వంతో ఏకీకృత కుటుంబ స‌ర్వే నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ శుక్ర‌వారం విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న ఏకీకృత కుటుంబ …

Read More »

స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో ప్రతి ఉద్యోగి భాగస్వాములవ్వాలి

– పేదరికంలేని సమాజ నిర్మాణానికి తమ వంతు సేవలందించాలి – నూతన సాంకేతిక విధానంతో పారదర్శకంగా ప్రజలకు దగ్గరవ్వాలి -రాష్ట్ర సాంఘిక సంక్షేమ, వికలాంగుల, సీనియర్ సిటిజన్ల సంక్షేమ, స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర 2047 లక్ష్యసాధనలో ప్రతి ఉద్యోగి భాగస్వామ్యం కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. …

Read More »

RTIH–ఉషారామా ఇంజినీరింగ్ కళాశాల మధ్య అవగాహన ఒప్పందం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎనికేపాడు, విజయవాడలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) మరియు ఉషారామా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ మధ్య 06-02-2026న అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. విద్యార్థుల్లో నవోత్తేజం, ఉపాధి సృష్టి మరియు స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశ్యం. ఈ MoUపై RTIH ముఖ్య కార్యనిర్వాహక అధికారి జి. కృష్ణన్, పార్ట్‌నర్‌షిప్స్ హెడ్ నందన్ టాండి , ఉషారామా కాలేజ్ ప్రిన్సిపాల్ డా. జి.వి.కె.ఎస్.వి. ప్రసాద్ మరియు డా. కె.వి. శివ …

Read More »

పదో తరగతి పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే

-విద్యార్థులు పరీక్షల దృష్ట్యా ఒత్తిడి, భయాందోళన చెందవద్దు -విద్యార్థులతో కలిసి పరీక్షా పే చర్చ కార్యక్రమం వీక్షించిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్ విజయ్ రామరాజు. వి IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పదో తరగతి పరీక్షలు జీవితంలో ఒక భాగమేనని, పరీక్షల విషయంలో విద్యార్థులు ఎలాంటి భయాందోళన, ఒత్తిడి చెందవద్దని, సమాధానాలు రాసేటప్పుడు ప్రశ్నాపత్రం సమాధానాలు మూల్యాంకనం చేసే వ్యక్తి ఆ ప్రశ్న ద్వారా విద్యార్థుల విషయ అవగాహనను ఏమి ఆశిస్తున్నారు తెలుసుకొని సమాధానాలు రాయాలని, ప్రశ్నకు సంబంధించి ముఖ్యమైన విషయాలను …

Read More »

దేశవ్యాప్తంగా సిజేరియన్ డెలివరీల పెరుగుదలపై లోక్‌సభలో ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి లోక్‌సభ సభ్యులు మద్దిల గురుమూర్తి నేడు పార్లమెంట్‌లో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ డెలివరీలు అధికంగా జరుగుతున్న అంశంపై కీలక ప్రశ్న లేవనెత్తారు. ఇది తల్లులు, శిశువులు, వారి కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్న ప్రజా సమస్య అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ లోక్‌సభలో సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో …

Read More »

మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమాలు, విద్యార్థి సంఘ నాయకులపై దాడి ఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలి

– వడిత్యా శంకర్ నాయక్ డిమాండ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు తాడేపల్లి లోని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ (APHER&MC) మెంబర్ సెక్రటరీ & సీఈఓ డి. సూర్యచంద్రరావు ని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా, వడిత్యా శంకర్ నాయక్ — ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు మరియు గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా — తిరుపతి జిల్లాలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న …

Read More »

డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ అన్నదాన కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్ పైపుల్ రోడ్డు సెంటర్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర డొక్కా సీతమ్మ గారి చారిటబుల్ ట్రస్ట్ అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే తనయుడు బోండా సిద్ధార్థ  హాజరయ్యారు. అన్నదాన కార్యక్రమం రెండు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా పైపుల రోడ్డు సెంటర్లో 400 నుండి 500 మందికి స్వయంగా ట్రస్ట్ మెంబర్స్ వంటలు వండి వడ్డించడం జరుగుతుంది. ఆ మహనీయురాలు డొక్కా సీతమ్మ పేరు పెట్టుకుని …

Read More »

కరువుభత్యం (డి.ఎ.) పొందడం ఉద్యోగుల చట్టబద్ధ హక్కు అన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

-కరువుభత్యం (డి.ఎ.) చెల్లింపు భారత రాజ్యాంగంలోని 21 అధికరణ కోణమన్న కలకత్తా హైకోర్టు తీర్పు మార్చకపోవడం శుభ పరిణామం -ఆర్ధిక నిధుల కొరత పేరుతో రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన చెల్లింపులు నుండి రాష్ట్రాలు తప్పించుకోలేవన్న సుప్రీంకోర్టు తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా శిరోధార్యం -బెంగాల్ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు స్పూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షవర్ల బాకీల చెల్లింపులకు ఒక కమిటీ నియమించాలి -ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్. సూర్యనారాయణ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

ఏపీ జేఏసీ అమరావతి నాల్గవ రాష్ట్ర మహా సభను జయప్రదం చేసిన ప్రతి ఉద్యోగికి ధన్యవాదాలు

-ఉద్యోగులు ఏపిజేఏసి అమరావతి పై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేస్తాం -ఏపిజేఏసి అమరావతి రాష్ట్ర కమిటీగా 21మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న వివిధ శాఖాపరమైన సంఘాల నాయకులకు ధన్యవాదాలు..బొప్పరాజు & పలిశెట్టి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రధేశ్ లో గడచిన పది సంవత్సరాల కాలంలోనే మెజారిటీ ఉద్యోగులు మనస్సులు గెలుచుకొని ఉద్యోగులలో ఏపి జేఏసి అమరావతి పై నమ్మకాన్ని నింపగలిగామన్నదానికి నిదర్శనమే ఈనెల 5 న గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో జరిగిన ఏపి జేఏసి అమరావతి నాల్గవ రాష్ట్రమహాసభ …

Read More »

బోధనాసుపత్రుల్లో హెర్బల్ గార్డెన్స్

-రోగులు, వారి సహాయకులకు ఆహ్లాదాన్ని పంచేలా..! -వాకింగ్ ట్రాక్ తోపాటు ఇతర సౌకర్యాలు! -స్థలాల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం! అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ఔషధ మొక్కల తోటల (హెర్బల్ గార్డెన్స్) ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రోగులు, వారి సహాయకులకు ఆహ్లాదాన్ని పంచేలా ఈ తోటల్లో పూల, ఔషధ మొక్కలను నాటతారు అలాగే వాకింగ్ ట్రాక్, బెంచీలు, మంచినీటి సదుపాయాన్ని కల్పించేందుకు అనువైన స్థలాలను అదికారులు పరిశీలిస్తున్నారు. తొలివిడతలో డైరెక్టరేటు ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో ఉన్న అన్ని …

Read More »