మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ పర్వదినం పురస్కరించుకొని జిల్లాలోని ముస్లిం లు ప్రార్ధనలు చేసుకునేందుకు వీలుగా వారు నివసించే ప్రాంతాలు, మసీదులు ప్రార్థన మందిరాలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా మంచినీరు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై వివిధ శాఖల జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం నడుస్తున్న పవిత్ర రంజాన్ …
Read More »Daily Archives: March 1, 2026
ఈ నెల 2వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం..
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 2వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి మీకోసం –ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ …
Read More »విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్
-ఘన స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు.. గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి, ఎన్టీఆర్ జిల్లాలో పర్యటన నిమిత్తం ఆదివారం మధ్యాహ్నం 1:35 విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కు ఘన స్వాగతం లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ …
Read More »గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని స్కిల్ హబ్‌లో ఉచిత శిక్షణా తరగతులకు దరఖాస్తుల ఆహ్వానం
-ఉచిత స్కిల్ ట్రైనింగ్‌కు యువత ముందుకు రావాలి -నైపుణ్యాభివృద్ధి ద్వారానే మెరుగైన ఉపాధి అవకాశాలు -జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ, ఐఏఎస్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ, ఐఏఎస్ తెలిపారు. ఈ స్కిల్ హబ్‌లో Customer Care Sr. Executive కోర్సుపై ఉచిత శిక్షణ ఈ నెలలో …
Read More »8 వేలు దాటిన సైకిళ్ల పంపిణీ మహా క్రతువు
-మంచి పనులకు దాతల సాకారం ఉంటుదనడానికి సైకిళ్ల పంపిణీ నిదర్శనం -దాతల సాయంతో త్వరలోనే పాఠశాలల్లో రక్షిత తాగునీటి ప్లాంట్లు -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : అద్దంకి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 8 వేలకు పైగా విద్యార్థులకు ఉచితంగా అందజేసినట్లు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురువ మండలంలోని వేమవరం ఉన్నత పాఠశాలలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు పర్యటించి 44 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను …
Read More »ఘనంగా “ఉద్యమి – క్రియాశీలక సభ్యత్వ దిశానిర్దేశ సభ”
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన “ఉద్యమి – క్రియాశీలక సభ్యత్వ దిశానిర్దేశ సభ” ఘనంగా జరిగింది. ఈ సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి, జనసేన పార్టీ PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి శాసనసభ్యులు మరియు పార్లమెంట్ సమన్వయకర్త ఆరాణి …
Read More »అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి : యార్లగడ్డ
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అంగన్వాడి టీచర్లు,హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గతంలో ఎన్నడు లేని విధంగా చరిత్రలో తొలిసారి అంగన్వాడీ టీచర్ల వేతనాలను రెండుసార్లు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. అంగన్వాడీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృత …
Read More »మన నగరం సుందరంగా పరిశుభ్రంగా ఉండాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మన నగరం ఎల్లప్పుడూ సుందరంగా, పరిశుభ్రంగా ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఆదివారము ఉదయం తన పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ రోడ్ పటమట బెంజ్ సర్కిల్ హైవే ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరం సుందరంగా, పరిశుభ్రంగా ఉండాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, రోడ్డుపైన గుంతలు పడితే, వెంటనే ప్యాచ్ వర్క్లు చేయాలని, …
Read More »ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి …
Read More »విశాఖపట్నంలో ‘సండే ఆన్ సైకిల్’
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న Fit India Movement కార్యక్రమంలో భాగంగా, ‘సండే ఆన్ సైకిల్’ 63వ ఎడిషన్ ను పురస్కరించుకుని ఆర్కే బీచ్, విశాఖపట్నం వద్ద ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది. ఈ ర్యాలీలో క్రీడా అధికారులు, సిబ్బంది మరియు ప్రజలు ఉత్సాహంగా పాల్గొని “ఫిట్నెస్ ఫర్ ఆల్” అనే సందేశాన్ని విస్తృతంగా వ్యాప్తి చేశారు. కార్యక్రమం ఫిట్ ఇండియా ఉద్యమ నినాదమైన “ఫిట్నెస్ పర్ ఆల్”ను పునరుద్ఘాటిస్తూ, ప్రతి పౌరుడు ఆరోగ్యకరమైన మరియు చురుకైన …
Read More »
Prajavartha Online Telugu News