-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పెరుగుతున్న దోమల సమస్యలను నివారించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ “స్పాట్ మస్కిటో ఎలిమినేటర్” మెషిన్ను ట్రయిల్ లో భాగంగా కరెన్సీ నగర్, 14వ సచివాలయంలో ఏర్పాటు చేశారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. బుధవారం సాయంత్రం కరెన్సీ నగర్ లో ఏర్పాటు చేసిన ఈ యంత్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న దోమల సమస్యలను ఆధునిక సాంకేతికతతో నివారించేందుకు …
Read More »Daily Archives: March 4, 2026
గ్యాంగ్ వర్కర్లతో విస్తృతంగా డీసిల్టింగ్ పనులు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్యాంగ్ వర్కర్లతో విస్తృతంగా డీసిల్టింగ్ పనులను చేస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, భవానిపురం, వన్ టౌన్, పటమట ప్రాంతాలలో విస్తృతంగా డీసిల్టింగ్ పనులు చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరం మొత్తం శరవేగంగా డీసిల్టింగ్ పనులను చేస్తున్నామని, అందులో భాగంగా ప్రతి చిన్న డ్రైన్ నుంచి మేజర్ ఔటఫాల్ డ్రైన్ వరకు పారిశుధ్య, ఇంజనీరింగ్ …
Read More »మేజర్ డిఫాల్టర్లకు రెడ్ నోటీసులు జారీ చేయాలి…
గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థకు బకాయి ఉన్నమేజర్ డిఫాల్టర్లకు రెడ్ నోటీసులు జారీ చేయాలని, పన్నువసూళ్లకు ఆర్ఐల వారీగా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లు, అడ్మిన్ కార్యదర్శులతో పన్ను వసూళ్ల పురోగతిపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత రోజువారీ వసూళ్లు చేయాల్సిన …
Read More »పాత్ హోల్ ఫ్రీ సిటిగా తీర్చిదిద్దడానికి ఇంజినీరింగ్ అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్దం
గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాన్ని 45 రోజుల్లో పాత్ హోల్ ఫ్రీ సిటిగా తీర్చిదిద్దడానికి ఇంజినీరింగ్ అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. బుధవారం కమిషనర్ చాంబర్ లో అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, విభాగాధిపతులతో ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వార్డ్ సచివాలయాల వారీగా పాత్ హోల్స్ మరమత్తుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. సోమవారం కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన …
Read More »గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు, పాటించాలని, పనుల్లో లోపాలు గుర్తిస్తే కాంట్రాక్టర్ తోపాటు పర్యవేక్షణ అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. బుధవారం ఆకులవారితోట, శ్రీనివాసరావుతోట, నల్ల చెరువు, పొన్నూరు రోడ్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత ఆకులవారి తోటలో నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్ పనులను తనిఖీ చేసి, టెండర్, అగ్రిమెంట్ …
Read More »జిల్లాలో 20 రోజులపాటు మహిళా దినోత్సవ వేడుకలు
-రేపు పుష్కర్ ఘాట్ నుంచి దేవిచౌక్ వరకు ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మహిళా సాధికారత, సంక్షేమం మరియు పిల్లల పరిరక్షణపై అవగాహన పెంపొందించడానికి 20 రోజులపాటు జిల్లా వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లూ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి టి. శ్రీదేవి తెలిపారు. బుధవారం స్థానిక రాజమహేంద్రవరం అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా …
Read More »ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మార్చి 7, 8 తేదీల్లో జాతీయ అనుసూచిత జాతుల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా (Kishor Makwana) జిల్లా పర్యటన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ షెడ్యూల్ జాతుల కమిషన్ (National Commission for Scheduled Castes) చైర్మన్, కేంద్ర కేబినెట్ మంత్రి హోదా కలిగిన కిషోర్ మక్వానా (Kishor Makwana) 07-03-2026 నుండి 08-03-2026 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు రానున్నారనీ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటన సందర్భంగా 07-03-2026న జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సెక్రటరీ గుడే శ్రీనివాస్, డైరెక్టర్; …
Read More »రవాణా కార్మికులకు మాదకద్రవ్యాల నివారణ
-రహదారి భద్రతపై విస్తృత అవగాహన ప్రచారం – జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : NCORD (నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ) కార్యకలాపాలలో భాగంగా బుధవారం రాజమహేంద్రవరం నగరంలోని పలు ప్రాంతాలలో రవాణా కార్మికులకు మాదకద్రవ్యాల నివారణ, రహదారి భద్రత మరియు బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌పై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ ప్రచారం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (GGH) పరిధిలోని గణపతి ఆటో & అంబులెన్స్ యజమానులు/ కార్మికుల సంఘం, అనం కళా కేంద్రం సమీపంలోని శ్రీ శివ …
Read More »ఒడిశాలో వీల్‌చైర్ క్రికెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ద్వితీయ స్థానం – తూర్పుగోదావరి క్రీడాకారుల ప్రతిభకు కలెక్టర్ అభినందనలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : Divyang Cricket Control Board of India ఆధ్వర్యంలో, సమీర్ దివ్య సాహిత్య ట్రస్ట్ నిర్వహణలో ఒడిశా రాష్ట్రంలో ఫిబ్రవరి 21 నుండి 23 వరకు జరిగిన వీల్‌చైర్ క్రికెట్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ జట్టు ద్వితీయ స్థానం సాధించింది. ఈ జట్టులో మొత్తం 8 మంది క్రీడాకారులు తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు కావడం విశేషం. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి క్రీడాకారులను అభినందించారు. దివ్యాంగ క్రీడాకారులు ప్రతిభతో రాష్ట్రానికి కీర్తి తీసుకువచ్చారని …
Read More »సహజ వ్యవసాయానికి జిల్లా పరిపాలన ప్రాధాన్య
-కలెక్టరేట్‌లో అవగాహన – శిక్షణా కార్యక్రమం నిర్వహణ – కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టరేట్ PGRS మీటింగ్ హాల్, బొమ్మూరు నందు సహజ వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ద్వారా కలిగే ఆరోగ్య, పోషణ ప్రయోజనాలపై అవగాహన – శిక్షణా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న APCNF రైతు సాధికార సంస్థ సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి …
Read More »
Prajavartha Online Telugu News