-ప్రాజెక్టుల నిర్మాణ నాణ్యతలో రాజీ లేదు -ప్రాధాన్యతల వారీగా ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టాలి -ప్రాజెక్టులకు ఇవ్వాల్సిన నిధులపై ఆర్థిక శాఖ రూట్ మ్యాప్ సిద్దం చేసుకోవాలి -ప్రాజెక్టుల నిర్మాణాలు సుదీర్ఘ కాలం ఎన్నికల హామీలుగా మిగలకూడదు -ఇరిగేషన్ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో నాణత్య పాటించే అంశంపై రాజీ పడే ప్రసక్తే ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణాలు చేసే క్రమంలో ప్రజా భద్రత ముఖ్యమనే విషయాన్ని గుర్తు …
Read More »Daily Archives: March 6, 2026
ఉల్లాసంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక సంబరం
-ప్రజాప్రతినిధులు ఓ కుటుంబంలా కలిసి పనిచేయాలన్న సీఎం -క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన నేతలకు బహుమతులు ప్రదానం చేసిన సీఎం చంద్రబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాప్రతినిధుల మధ్య జరిగిన క్రీడా పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రొఫెషనల్స్ కు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. వారిని చూస్తుంటే తనకు పాత రోజులు గుర్తొస్తున్నాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకే పరిమితం కాకుండా ఆల్ రౌండర్లుగా నిలిచారని అన్నారు. విజయవాడలోని ఆంత్రా లక్స్ కన్వెన్షన్‌లో శుక్రవారం నిర్వహించిన ఎమ్మెల్యేలు, …
Read More »అభివృద్ధికి అవరోధంగా ఉన్న చట్టాల రద్దు
-13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ పై త్వరలో నిర్ణయం -ఫ్యాక్షనిజం, నక్సలిజం పోయి..రప్పా రప్పా రాజకీయం వచ్చింది -నాడు ప్రభువా క్షమించు అన్న జగన్..కల్తీ నెయ్యితో ఘోర అపచారం చేసి ఏడుకొండల వాడిని క్షమాపణ అడగలేదేం -5 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అసెంబ్లీలో చర్చలు, నిర్ణయాలు -ప్రజాప్రతినిధులు వ్యక్తిగత ప్రవర్తనతో ప్రభుత్వానికి ఇబ్బందులు తేవొద్దు ద్రవ్య వినిమయ బిల్లు సహా వివిధ అంశాలపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం -ఆత్మనిర్భర్- వికసిత్ భారత్ సంకల్పంపై చేసిన తీర్మానానికి శాసనసభ ఆమోదం …
Read More »రేపు ఢిల్లీలో రైసినా డైలాగ్ 2026 సదస్సుకు సీఎం చంద్రబాబు
-సాంకేతికత- సుపరిపాలనపై సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగం -సదస్సులో పాల్గొననున్న 110 దేశాలకు చెందిన 2,700 మంది ప్రతినిధులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ప్రతిష్టాత్మక ‘రైసినా డైలాగ్ 2026’ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం హాజరుకానున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సులో సాంకేతికత – సుపరిపాలన, భవిష్యత్ అంశాలపై సీఎం కీలక ఉపన్యాసం చేయనున్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ- అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక సదస్సును నిర్వహిస్తున్నాయి. ఇందులో పాల్గొనేందుకు రేపు ఉదయం …
Read More »మీ నియోజకవర్గంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూ ఎస్ అండ్ ఎస్, అటవీ పర్యావరణ శాఖల అభివృద్ధి ఇది
-తన శాఖల పరిధిలో నియోజకవర్గాలవారీగా చేపట్టిన అభివృద్ధి పనులతో బుక్ లెట్లు సిద్ధం చేసిన ఉప ముఖ్యమంత్రి -అసెంబ్లీలో స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలకు బుక్ లెట్ లు అందజేసిన పవన్ కళ్యాణ్ -తొలి ప్రతిని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కి అందజేసిన పవన్ కళ్యాణ్ -స్పీకర్ గారి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ. 312 కోట్ల మంజూరు -ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పంకి రూ. 487 కోట్ల కేటాయింపులు -పార్టీలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని …
Read More »వీరపాండ్య కట్టబొమ్మన పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన మంత్రి కందుల దుర్గేష్
-సాంస్కృతిక కార్యక్రమంలో అదరగొట్టిన పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్ -ముఖ్యమంత్రి,సహచర ప్రజాప్రతినిధుల ప్రశంసల జల్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిరంకుశత్వాన్ని ఎదిరించి, భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో విప్లవ జ్యోతిగా వెలిగిన వీరపాండ్య కట్టబొమ్మన పాత్రలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ అద్భుత నటనతో అలరించారు. అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడిన అనంతరం, శుక్రవారం సాయంత్రం విజయవాడ పట్టణం పటమటలోని ఆంత్రలాక్స్ హాల్‌లో ప్రజాప్రతినిధుల కోసం …
Read More »అక్రమ పశువుల రవాణా అరికట్టేందుకు చర్యలు
– డిజిటల్ ట్రాన్స్‌పోర్ట్ సర్టిఫికెట్ వ్యవస్థను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు పశుసంవర్ధక శాఖ కీలక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శుక్రవారం విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో పశువుల రవాణా సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్ ద్వారా జారీ చేసే డిజిటల్ ట్రాన్స్‌పోర్ట్ సర్టిఫికెట్ జనరేషన్ సిస్టమ్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ రూపొందించిన ఈ వ్యవస్థ ద్వారా …
Read More »మార్చి 25న షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ సమావేశం
-సెక్రటరీ జనరల్ టు లెజిస్లేచర్ సూర్యదేవర ప్రసన్నకుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ శాసనసభకు చెందిన ‘షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ’ (Committee on Welfare of Scheduled Tribes) సమావేశం మార్చి 25వ తేదీ, బుధవారం ఉదయం 11:00 గంటలకు, వెలగపూడి అమరావతిలోని అసెంబ్లీ భవన్ లో గల కమిటీ హాల్ నెం.1లో జరగనుందని సెక్రటరీ జనరల్ టు లెజిస్లేచర్ సూర్యదేవర ప్రసన్నకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశంలో రాష్ట్రంలోని షెడ్యూల్డ్ తెగల సంక్షేమం కోసం చేపడుతున్న అభివృద్ధి …
Read More »డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గం, 58వ డివిజన్, పైపుల రోడ్డు సెంటర్, ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఈరోజు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం గత రెండు సంవత్సరాల నుంచి నెలలో రెండు సార్లు కొనసాగిస్తూనే ఉన్నారు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు జరగాలని కోరుకుంటున్నారు. మనం చేసే ఏ మంచి పని అయినా ప్రజల గుండెల్లో గుర్తుండి పోయేలాగా చేస్తుందని మాకు …
Read More »బాలికల మనోధైర్యానికి ‘స్వచ్ఛ స్వేచ్ఛ – బాలికా జాగృతి’ అద్దం
– కస్తూరిబాయిపేట సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ముగింపు కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ, కస్తూరిబాయి పేటలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం నందు ‘పాత్ మోటివేషన్ సెంటర్’ (Path Motivation Center) ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘స్వచ్ఛ స్వేచ్ఛ – బాలికా జాగృతి’ అవగాహన కార్యక్రమం శుక్రవారం ఘనంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బాలికల వసతి గృహాల్లో విద్యార్థినులకు వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ …
Read More »
Prajavartha Online Telugu News