విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష ఐఏఎస్ ఆదేశాల మేరకు జిల్లా లోని ఎస్ఆర్ఆర్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పివి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ మరియు ఆదిత్య డిగ్రీ కళాశాల కు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థులు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయం నందు ప్రతిష్టాత్మ జరుగుతున్న మహా కుంభాభిషేకంలో భక్తులకు సేవలు అందించడానికి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు స్వచ్ఛంద సేవకు విరివిగా పాల్గొన్నట్లు ఎన్టీఆర్ జిల్లా సీఈవో …
Read More »Daily Archives: March 6, 2026
వుమెన్స్ డే వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు తమ సామర్థ్యాన్ని గుర్తించి ధైర్యంగా ముందుకు సాగితే ఏ రంగంలోనైనా అగ్రస్థానానికి చేరుకోవచ్చని అన్నారు ఐపీఎస్ అధికారిణి మలికా గార్గ్. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మహిళా అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం గురునానక్ కాలనీలోని ఓ ప్రయివేట్ హోటల్ లో జరిగిన వుమెన్స్ డే వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏపీపీసీబీ ఛైర్మన్ డా. పి. కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్రవంతి హాస్పిటల్స్ వ్యవస్థాపకురాలు డాక్టర్ స్రవంతి …
Read More »స్వయం ఉపాధి.. సాధికారతకు బలమైన పునాది
-ఆదాయ వనరు మాత్రమే కాదు ఆత్మవిశ్వాసానికి మార్గం కూడా.. -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు స్వయం ఉపాధి రంగంలో ముందడుగు వేస్తే కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడటమే కాకుండా సమాజ అభివృద్ధికి కూడా బలమైన పునాది ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం, కిలేశపురంలో పి.ఉమ అనే మహిళ .. పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ స్కీమ్ (పీఎంఎఫ్ఎంఈ) పథకం చేయూతతో ఇప్పటికే ఒక ఎద్దు గానుగ యూనిట్‌ను …
Read More »డాక్టర్.బి.ఆర్.అంబేడ్కర్ గురుకులాల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి 08.03.2026 న ప్రవేశ పరీక్ష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ మరియు ఎన్‌టిఆర్ ఉమ్మడి జిల్లాలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 10 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి ఈ నెల 08.03.2026 న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి అంగడి మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు https:///apbragcet.apcfss.in వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 13 అంబేడ్కర్ గురుకుల పాఠశాలలుండగా.. 6, 7 తరగతుల్లో ప్రవేశాలకు ఆదివారం ఉదయం 10.00 గంటల నుండి 11.30 …
Read More »ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా – 2026
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా – 2026 ను ఈనెల 9వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు ప్రభుత్వ ఐటిఐ విజయవాడ నందు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఎం. కనకారావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా – 2026 లో వివిధ కంపెనీలు హాజరై అర్హులైన ఐటిఐ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని అయన తెలిపారు. ప్రభుత్వ ఐటిఐ లో ఉత్తీర్ణులైన విద్యార్థులతో పాటు గత ఏడాది (2025) తుది సంవత్సరం పరీక్షలు …
Read More »పెనుగంచిప్రోలు మండలంలో NITI Aayog అధికారి పర్యటన విజయవంతం
పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : NITI Aayog ఆధ్వర్యంలో అమలు అవుతున్న Aspirational Blocks Programme – Sampoornata Abhiyan 2.0 కార్యక్రమంలో భాగంగా NITI Aayog అధికారి రాధికా ములే (Radhika Mulay) గారు ఈ రోజు పెనుగంచిప్రోలు మండలాన్ని సందర్శించారు. పర్యటనలో భాగంగా ఆమె మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Ayushman Arogya Mandir), ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC), పశుసంవర్ధక శాఖ కార్యాలయం తదితర కేంద్రాలను సందర్శించి అక్కడ అందుతున్న సేవలు, అమలు …
Read More »పర్యావరణ హిత ప్రయాణానికి ప్రోత్సాహం
– ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా ప్రతినిధులకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు – కంపెనీల నుంచి నేరుగా రాయితీపై కొనుగోలు అవకాశం – ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ – ఈవీల వినియోగంలో జిల్లాను మోడల్ జిల్లాగా మారుద్దామని పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణలో మేము సైతం అంటూ ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా ప్రతినిధులను ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినియోగానికి చేరువచేసి.. తద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయాలనే ఉద్దేశంతో కంపెనీల నుంచి నేరుగా రాయితీపై జీరో డౌన్‌పేమెంట్, ఈఎంఐలతో …
Read More »రాజగోపురం శంకుస్థాపన కార్యక్రమంలో కెడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూడలి దాములూరు శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో నిర్మించనున్న రాజగోపురం శంకుస్థాపన కార్యక్రమంలో, వేద పండితుల మంత్రోచ్చారణల ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాల మధ్య జరిగిన పవిత్ర కార్యక్రమంలో మాజీ మంత్రి, కెడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను శాసనసభ్యుడుగా ఉండగా ఆలయం పున్న నిర్మాణం జరిగిందని మళ్లీ రాజగోపురం శంకుస్థాపన రావడం దైవనుగ్రహంగా భావిస్తున్నానని రాజగోపురం నిర్మాణం దేవస్థాన వైభవాన్ని మరింత పెంచుతూ భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రముగా …
Read More »శ్రీ తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్న డా. పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పట్టణంలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంలో ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ మరియు ఆలయ పాలకమండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లక్ష కుంకుమార్చన మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. అమ్మవారి అనుగ్రహం పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ పాలకమండలి చైర్మన్ మరియు సభ్యుల ఆహ్వానం మేరకు మాజీ మంత్రి, తిరుపతి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు పానబాక లక్ష్మి కార్యక్రమానికి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు …
Read More »ఉత్తమ పార్లమెంటేరియన్‌గా డాక్టర్ తరుణ్ కాకానికు జ్యూరీచే ప్రశంసలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కెఎల్ విశ్వవిద్యాలయంలో జరిగిన మాక్ పార్లమెంట్ పోటీలో బిజెపికి చెందిన డాక్టర్ తరుణ్ కాకాని ఉత్తమ పార్లమెంటేరియన్‌గా జ్యూరీచే ప్రశంసలు అందుకున్నారు. డాక్టర్ కాకాని నాయకత్వ నైపుణ్యాలు మరియు వక్తృత్వ శక్తి, చర్చా నైపుణ్యాలు చాలా ఆకట్టుకున్నాయి. కాకాని ప్రజెంటేషన్ శైలి, దుస్తుల ధారణ, ఉపయోగించిన సాంకేతిక పరిభాష, అలంకారం మరియు బలమైన గణాంక డేటా, ప్రస్తుత వ్యవహారాలపై జ్ఞానం, అంతర్జాతీయ వ్యవహారాలు, రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, సామాజిక న్యాయం, చట్టం జ్యూరీతో పాటు ఇతర పాల్గొనేవారిని …
Read More »
Prajavartha Online Telugu News