అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి నగరంలో అంతర్జాతీయ స్థాయి న్యాయ విద్యా సంస్థ ఏర్పాటుకు కీలక అడుగు పడింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా- పెరల్ ఫస్ట్ ఆధ్వర్యంలో స్థాపించనున్న ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(IIULER) స్థాపనకు సంబంధించిన ఒప్పందం శుక్రవారం అమరావతి- మందడం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో, సబ్ రిజిస్ట్రార్ Ch. రాంబాబు సమక్షంలో జరిగింది. APCRDA తరఫున జాయింట్ డైరెక్టర్ (ఎస్టేట్స్) జుబిన్ చిరాన్ రాయ్ అధీకృత ప్రతినిధిగా ఈ ఒప్పందంపై …
Read More »Daily Archives: March 6, 2026
APCRDA ఆధ్వర్యంలో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో 55వ జాతీయ భద్రతా వారోత్సవాలలో మూడో రోజు(శుక్రవారం) CRDA ESMU విభాగ అధికారులు అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు సిఆర్‌డిఏ ప్రధాన కార్యాలయంలోని ఫస్ట్ ఫ్లోర్ – సెమినార్ హాలులో అగ్నిప్రమాదాల కట్టడిపై సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో విపత్తు నిర్వహణ, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలో అవగాహన కల్పిస్తూ అగ్నిమాపక సిబ్బంది వినియోగించే పరికరాలతో మాక్ డ్రిల్ నిర్వహించారు. …
Read More »స్వచ్ఛసర్వేక్షణ్‌లో మున్సిపల్ కమిషనర్లదే కీలక బాధ్యత
-వర్క్‌షాప్‌లో స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛసర్వేక్షణ్‌లో మున్సిపల్ కమిషనర్లదే కీలక బాధ్యత అని స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. వారు లీడ్ రోల్ తీసుకోవాలని చెప్పారు. విజయవాడలోని స్కూల్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన స్వచ్ఛసర్వేక్షణ్, సీఐటీఐఐఎస్(City Investments to Innovate, Integrate and Sustain) ఒక రోజు వర్క్ షాప్ లో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2025 జనవరిలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. అప్పటి …
Read More »ఘనంగా అడ్డూరి శ్రీరామ్ జన్మదిన వేడుకలు..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ జన్మదిన వేడుకలు భవానీపురం ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో నిర్వహించారు.. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , ఎన్డీఏ నాయకులు కలిసి శ్రీరామ్ తో కేక్ ను కట్ చేయించారు.. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ, బీజేపీ నాయకులు సోమేశ్వరరావు, పిట్టల గోవిందు, టీడీపీ నాయకుడు ఏడుపాటి రామయ్య, తదితరులు పాల్గొన్నారు..
Read More »మహిళలే తమ శక్తి సామర్ధ్యాలు పెంచుకుని పురోగతి సాధించాలి.
-సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు సత్కార కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనాచౌదరి పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పశ్చిమ ఎమ్మల్యే సుజనా చౌదరి వివిధ రంగాలకు చెందిన మహిళలను ఘనంగా సత్కరించారు. మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా భవానీ ఐలాండ్ లో సుజనా ఫౌండేషన్ మహిళల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ .. ప్రజాస్వామ్య స్పూర్తి లో మినీ ఇండియా గా పేరొందిన పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా …
Read More »అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 8 వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని తన క్యాంపు కార్యాలయం నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణ ఏర్పాట్లపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 8 వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా స్థాయి సమావేశం …
Read More »బాలబాలికలు, యువత భద్రతపై సంబంధిత అధికారులతో సమావేశం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థిని విద్యార్థులు తప్పుదారి పట్టకుండా మంచి చెడుల వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలసి వారి చాంబర్లో బాలబాలికలు, యువత భద్రతపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రాను …
Read More »ఎస్డీజీ కేపీఐ లక్ష్యాలు నూరు శాతం సాధించాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు స్వర్ణాంధ్ర సుస్థిర అభివృద్ధికి నిర్దేశించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండీకేషన్ ( కేపీఐ) లక్ష్యాలు నూరుశాతం అధిగమించేలా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా స్వర్ణాంధ్ర సుస్థిర అభివృద్ధి కీ పెర్ఫార్మెన్స్ ఇండీకేషన్ లక్ష్యాల పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సుస్థిర అభివృద్ధి …
Read More »10న జన్ సున్ వాయ్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జన్ సున్ వాయ్ (పబ్లిక్ హియరింగ్) కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పూర్వ గుంటూరు జిల్లా పరిధికి సంబంధించి దీనిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జన్ సున్ వాయ్ ను 10వ తేదీ ఉదయం 10 గంటల నుండి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతుందని …
Read More »నేటి సమాజాభివృద్ధికి నాణ్యమైన మానవ వనరులే కీలకం : మాజీ డిజిపి మాలకొండయ్య
-వచ్చే ఏడాది అతిపెద్ద సమ్మేళనం: రెక్టార్ వెల్లడి -సమ్మేళనంతో వర్సిటీ-పరిశ్రమల మధ్య సత్సంబంధం: సీఈవో ఆండ్రియో గేర్రా -రెండో రోజు 20 అవగాహన ఒప్పందాలు -ఆకట్టుకున్న డ్రోన్ షో -కొనసాగిన సాంకేతిక ఉపన్యాసాలు -ఏఎన్యూలో నేటితో ముగియనున్న విద్య-పరిశ్రమల సమ్మేళనం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి సమాజాభివృద్ధికి నాణ్యమైన మానవ వనరులే కీలకమని ఆంధ్రప్రదేశ్ విశ్రాంత మాజీ డిజిపి మాలకొండయ్య వెల్లడించారు.ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈనెల 5న ఏర్పాటు చేసిన విద్య- పరిశ్రమల సమ్మేళనం-2026 కొనసాగింపులో …
Read More »
Prajavartha Online Telugu News