Breaking News

Daily Archives: March 8, 2026

జిల్లా అభివృద్ధిలో మహిళలది కీలక పాత్ర… : జిల్లా కలెక్టర్

-జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు వివిధ రంగాలలో రాణిస్తూ జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకుని మరింత అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి కోరారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో డ్వాక్రా సంఘాల మహిళలు, మహిళా వ్యాపారవేత్తలు, మహిళా ప్రభుత్వ …

Read More »

సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పటికే రూ.1000 కోట్లకు పైగా సాయం… : మంత్రి గొట్టిపాటి రవి కుమార్

అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఇప్పటి వరకు పేదలకు రూ.1,000 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించినట్లు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. పేదల ప్రాణాలను కాపాడటంలో ముఖ్యమంత్రి సహాయనిధి కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పాల్గొని సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 103 …

Read More »

ప్రకృతి సాగుతో ఆదాయం, ఆరోగ్యం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి వ్యవసాయంతో ఆదాయంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. వ్యవసాయం భారం కాకుండా లాభసాటి కావాలంటే ప్రకృతి సాగే సరైన విధానమని స్పష్టం చేశారు. విజయవాడలోని ఓ హోటల్లో శనివారం ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయుల కోసం నిర్వహించిన ప్రకృతి వ్యవసాయంపై వర్క్ షాప్ లో పాల్గొని ప్రసంగించారు. ప్రకృతి సాగుపై వర్క …

Read More »

16న పొట్టి శ్రీరాముల విగ్రహావిష్కరణ

– 58 అడుగుల ఎత్తులో అమరజీవి కాంస్య విగ్రహం -సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరణ -రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -అమరజీవి స్మృతి వనం పరిశీలించిన మంత్రి సవిత తుళ్లూరు/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరజీవి పొట్టి శ్రీరాముల ప్రాణ త్యాగ ఫలితం భావితరాలకు తెలియజేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పొట్టి శ్రీరాముల 58 రోజుల అమరణ దీక్షకు గుర్తుగా 58 …

Read More »

‘ఆదరణ’తో శాశ్వత ఉపాధి

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఆదరణ 3.0 పథకం బీసీ కుల వృత్తులకు శాశ్వత ఉపాధ కల్పించనున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత స్పష్టంచేశారు. కురుమ, కురుబల అభివృద్ధి సీఎం చంద్రబాబు, టీడీపీతోనే సాధ్యమన్నారు. బీసీల ఉన్నతికి గతంలో ఎన్నడూ కేటాయించని విధంగా భారీ ఎత్తున నిధులు వెచ్చిస్తున్నామన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను గుంటూరు జిల్లాకు చెందిన కురుమ సామాజిక వర్గీయులు శనివారం …

Read More »

ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 నా జరుగుతున్న సందర్భంగా కళాశాలలోని విమెన్స్ సెల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథి గా కళాశాల పూర్వ విద్యార్థిని డాక్టర్ డి కళ్యాణి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నెల్లూరు విచ్చేశారు. గౌరవ అతిథులుగా రావూరీ సూయాజ్ ,మార్పు ట్రస్టు డైరెక్టర్,మరియు ,సిస్టర్ అమల ఆడిట్ హెడ్ నిర్మల నికేతన్ విచ్చేశారు. డాక్టర్ సిస్టర్ లేన క్వాడ్రస్ విద్యార్థినులు కు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు …

Read More »

కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పాలన సాగిస్తున్న టిడిపి, బిజేపి, జనసేన కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్ గొల్లపాలెం గట్టు రోడ్డులో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) ఆదేశాల మేరకు ప్రజా దర్భార్ కార్యాక్రమాన్ని శనివారం నిర్వహించారు. అధికారులు, టిడిపి నాయకులు, పలువురు ప్రజా ప్రతినిధులు ప్రజల నుంచి నేరుగా విజ్ఞాపనలు స్వీకరించి ఆయా సమస్యల పరిష్కారంకు చర్యలు చేపట్టారు. …

Read More »

కెఎల్‌యులో సందడి చేసిన “నేను రెడీ” చిత్ర బృందం

-ఈ వేస‌విలో కుటుంబం మొత్తానికి చల్లని హాస్యాన్ని అందిస్తాం -విభిన్న చిత్రాల కథానాయకుడు కోనేరు హవీష్ -ఘనంగా ముగిసిన సురభి సాంస్కృతిక ఉత్సవాలు -సాంస్కృతిక వేడుకల్లో అబ్బురపరచిన విద్యార్థుల విన్యాసాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న చిత్రాల యువ కథానాయకుడు కోనేరు హవీష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న “నేను రెడీ” చిత్ర బృందం ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం వ‌డ్డేశ్వ‌రంలోని కెఎల్ యూనివర్సిటీ సందడి చేసింది. ఈ సంద‌ర్భంగా “నేను రెడీ” చిత్రం క‌థానాయ‌కుడు కోనేరు హవీష్ మాట్లాడుతూ, ప్రేక్షకుల ఆశీర్వాదం …

Read More »

కస్టమర్ దేవుళ్ళకి సేల్స్, సర్వీస్ & హెల్త్ క్యాంప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కస్టమర్ దేవుళ్ళకి ఎప్పుడూ పెద్దపీట వేసే వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ప్రజల భద్రతలో భాగంగా వారి ఆరోగ్యం పరిరక్షణ కూడా ముఖ్యమని సేల్స్, సర్వీస్ & హెల్త్ క్యాంప్ నిర్వహించింది. శనివారం ఆటోనగర్, మెయిన్ వర్క్ షాప్, వరుణ్ బజాజ్ సర్వీస్ సెంటర్ నందు ఈ ప్రత్యేక క్యాంప్‌లో మీ ఆరోగ్యం + మీ వాహనం ఆరోగ్యం రెండింటికీ చెక్-అప్ చేసే అవకాశం కల్పించారు. మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది… మీ బండి …

Read More »

‘ప్రమోషన్లలో రిజర్వేషన్లు’ న్యాయం కోసం ఓసీ, ఓబీసీ, బీసీ, మైనారిటీ ఉద్యోగులకు తరలిరావాలి…

-ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫోరం ఏపీ చాప్టర్ స్టేట్ సెక్రటరీ కోట శ్రీనివాస్ పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో ‘ప్రమోషన్లలో రిజర్వేషన్లు’ వలన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో పని చేయుచున్న ఓసి, ఓబిసి, బిసి మరియు మైనారిటీ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై ‘సమానత్వం కోసం మహాసభ’ తరలి రావాలని ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫోరం రాష్ట్ర కార్యదర్శి కోట శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శనివారం ఈ సందర్భంగా కోట శ్రీనివాస్ విడుదల చేసిన ప్రకటనలో విజయవాడలోని బందరురోడ్డులోని మాకినేని …

Read More »