-త్వరలో టైటానియం, స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్ -వచ్చే 10 ఏళ్లలో రూ.50,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యం -గనుల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు -రాష్ట్రంలో 3 ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు అధికారుల ప్రతిపాదన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా అభివృద్ధి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. ఇందుకు రాష్ట్రంలో బీచ్ సాండ్ వంటి మినరల్స్‌ను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. సచివాలయంలో మంగళవారం గనుల శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ‘ఆంధ్రప్రదేశ్ టైటానియం, …
Read More »Daily Archives: March 10, 2026
రాష్ట్రంపై యుద్ధ ప్రభావం తగ్గించేలా చర్యలు
-పౌల్ట్రీ, హర్టీకల్చర్ రంగాల్లో సంక్షోభం తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ -గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రుల క్షేమ సమాచారాలపై నిరంతరం ఆరా -ఉగాదికి 2.50 లక్షల సామూహిక గృహ ప్రవేశాలు -సీసీ కెమెరా నెట్వర్క్ ద్వారా నేర నియంత్రణ ప్రణాళిక -రియల్ టైమ్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇరాన్ యుద్ధ ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తగిన నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గల్ఫ్ దేశాలతో ఉన్న అన్ని అంశాలూ ప్రభావితం అయ్యే అవకాశం …
Read More »జీరో హ్యమన్, యానిమల్ లాస్ ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
-ఎండ తీవ్రత, వడగాల్పులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి -‘హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ – 2026’ ఆవిష్కరణ -మధ్యాహ్నం 12-4 గంటల మధ్య జరిగే పనులను రీషెడ్యూల్ చేసుకోవాలి -రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి ప్రాణ, పశు నష్టం జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. స్థానిక …
Read More »పోలవరం ఆంధ్రప్రదేశ్ ఆధునిక దేవాలయం
-పుష్కరాలకు ముందే పూర్తికి సన్నాహాలు -నాణ్యత విషయంలో రాజీలేదు -జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏలూరు జిల్లా -పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ కు ఆధునిక దేవాలయం అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు రాష్ట్రంలో చారిత్రక ఘట్టమైన గోదావరి పుష్కరాలకు ముందే, పోలవరం పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.మంగళవారం ఆయన …
Read More »వినోద, పర్యాటక రంగాల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్: మంత్రి కందుల దుర్గేష్
-ముంబయిలో జరుగుతున్న 24వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్ మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్(ఐఏఏపీఐ) ఎక్స్ పోలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి దుర్గేష్ -ముంబయి వేదికగా అమ్యూజ్‌మెంట్ పార్క్ ఇన్వెస్టర్లకు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సాదర ఆహ్వానం -ఏపీ ప్రభుత్వం అందిస్తున్న అద్భుత అవకాశాలను పరిశీలించాలని, అమ్యూజ్ మెంట్, థీమ్, వాటర్ పార్క్ లు, అడ్వెంచర్ జోన్ల ఏర్పాటుకు తమతో భాగస్వాములు కావాలని పిలుపు -ఏపీ పర్యాటకంలో పెట్టుబడులు పెట్టండి…భరోసా కల్పించే బాధ్యత మాది అని ఇన్వెస్టర్లకు భరోసా …
Read More »ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాష్ట్ర జనగణన డైరెక్టర్ భేటీ
-మే 1తేదీ నుంచి హౌస్ లిస్టింగ్ హౌసింగ్ సెన్సెస్ ప్రక్రియ -వచ్చే నెల 15 నుంచి పాటు స్వీయగణన కార్యక్రమం -రెండు దశలుగా 2027 జనగణన కార్యక్రమం గురించి సీఎంకు వివరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2027 జనగణనలో భాగంగా రాష్ట్రంలో ఈ ఏడాది మే 1 తేదీ నుంచి హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ ప్రక్రియ చేపడుతున్నట్టు ఏపీ సెన్సెస్ ఆపరేషన్స్, సిటిజన్ రిజిస్ట్రేషన్స్ డైరెక్టర్ జె. నివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎంతో …
Read More »రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
– రైతులకు ఎటువంటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికతో ప్రభుత్వం చర్యలు – గత ప్రభుత్వ కాలంలో పెండింగ్‌లో ఉన్న పరిహారాలను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది – యూరియా సరఫరా, ఆర్థిక సహాయంలో ప్రభుత్వం ముందంజ – ఇన్‌పుట్ సబ్సిడీ పెంపు, పంటల బీమా సంస్కరణలు – రైతులకు మద్దతు ధర అమలు…ధరల స్థిరీకరణకు ప్రభుత్వం కట్టుబాటు – వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది… రైతు సంక్షేమంలో రాజీ లేదు : మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »అంబేద్కర్ గురుకులాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులపై మంత్రి డిఎస్ బీవీ స్వామి ప్రత్యేక శ్రద్ధ
-పరీక్షల నేపథ్యంలో విద్యార్థులతో మంత్రి వరుస వీడియో కాన్ఫరెన్స్ లు -తాడేపల్లి AP SWREIS కార్యాలయంలో అంబేద్కర్ గురుకులాల 10 వ తరగతి విద్యార్థులతో జూమ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రి -టీచర్, పేరెంట్ లా విద్యార్థులకు ధైర్యం చెప్పి పలు సూచనలు చేసిన మంత్రి డా.స్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంబేద్కర్ గురుకులాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులపై మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులతో వరుస వీడియో కాన్ఫరెన్స్ …
Read More »కొనుగోలుదారులు… అమ్మకందారుల సమ్మేళనం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేస్తున్న వివిధ రకాల ఉత్పత్తులకు కొనుగోలు చేసి చేయూత అందించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కొనుగోలుదారులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం తాడిగడప మున్సిపాలిటీ కానూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో” కొనుగోలుదారులు… అమ్మకందారుల సమ్మేళనం’ పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇందులో జిల్లాలో పలువురు స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసి ప్రదర్శనకు ఉంచిన వివిధ అకాల ఆహార ఉత్పత్తులు, వస్త్రాలు, పారిశుద్ధ్య …
Read More »ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై కీలక సమీక్షలు
-ఈ నెల 11, 12వ తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్సులో దిశా నిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి -సమావేశాల రెండో రోజున శాంతి భద్రతలపై సమీక్ష… హాజరుకానున్న జిల్లాల ఎస్పీలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర అభివృద్ధి దిశగా పని చేస్తోన్న అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసేలా ఈ నెల 11, 12 తేదీల్లో రెండు రోజుల పాటు కలెక్టర్ల సమావేశం జరగనుంది. రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ …
Read More »
Prajavartha Online Telugu News