ఎంపి కేశినేని శివ‌నాథ్ కి కృత‌జ్ఞ‌తలు తెలిపిన కార్పెంట‌ర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
34వ డివిజన్ లోని కేదారేశ్వ‌రిపేట కాల‌వ‌గ‌ట్టు ద‌గ్గ‌ర ఎంతో కాలంగా ప‌ని చేసుకుంటున్న కార్పెంటర్స్ శ‌నివారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో ఎంపి కేశినేని శివ‌నాథ్ ను క‌లిసి కృత‌జ్ఞ‌తలు తెలిపారు. తాము కార్పెంట‌ర్ ప‌నిచేసుకునే ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించుకుండా అధికారుల‌తో మాట్లాడి అడ్డుకున్నందుకు కార్పెంట‌ర్స్ తో పాటు చిరు వ్యాపారం చేసుకునే మ‌హిళ‌లు కూడా ఎంపి కేశినేని శివ‌నాథ్ కు ధ‌న్య‌వాదాలు చెబుతూ పుష్పగ‌చ్చం అందించి శాలువాతో స‌త్క‌రించారు. ఇటీవ‌ల వి.యం.సి అధికారులు కేదారేశ్వ‌రిపేట‌లో కాల‌వ‌గ‌ట్టుకి అనుకుని ప‌ని చేసుకునే కార్పెంట‌ర్స్ ను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయాల‌ని ఒత్తిడి చేయ‌టంతో …ఆ విష‌యం ఎంపి కేశినేని శివ‌నాథ్ దృష్టికి వ‌చ్చిన త‌క్ష‌ణమే వి.ఎం.సి అధికారుల‌తో మాట్లాడి కార్పెంట‌ర్స్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు. త‌న‌ని క‌ల‌వ‌టానికి వ‌చ్చిన కార్పెంట‌ర్స్ కి ఎలాంటి ఇబ్బంది వ‌చ్చినా అండ‌గా వుంటానని ఎంపి కేశినేని శివ‌నాథ్ చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ జిల్లా పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ కార్య‌ద‌ర్శి కొట్టేటి హ‌నుమంతురావు, 34వ డివిజ‌న్ పార్టీ అధ్య‌క్షుడు అడ్డూరి కొండ‌ల‌రావు, కార్పెంట‌ర్స్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ అధ్య‌క్షుడు కాశీం, న‌జీర్ బాషా ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Check Also

ఆయుష్ లో ఎంపికైన మెడికల్ ఆఫీసర్ల దృవపత్రాల పరిశీలన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆయుష్ డిపార్ట్ మెంట్ లో ఏ.పి.పిఎస్.సీ ద్వారా మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద, హోమయోపతి) …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *